‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ మార్చి 12న విడుదల !!
నాగార్జున, అహిషోర్ సాల్మన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ మార్చి 12న విడుదల
అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. యథార్థ ఘటనలను ఆధారం చేసుకొని రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మ అనే ఒక వైవిధ్యమైన పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటివరకూ, సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేస్తూ పోస్టర్లను మాత్రమే చిత్ర బృందం విడుదల చేసింది. అవి ఆడియెన్స్‌లో సినిమాపై మంచి క్యూరియాసిటీని రేకెత్తించాయి. ఇప్పుడు ఈ సినిమా దేని గురించనే విషయాన్ని వెల్లడించే థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మార్చి 12 సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.
నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా నటిస్తోన్న ఈ మూవీలో మరో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ డైలాగ్స్ రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచా
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
యాక్షన్ డైరెక్టర్: డేవిడ్ ఇస్మలోన్
డైలాగ్స్: కిరణ్ కుమార్
ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని
ఆర్ట్: మురళి ఎస్.వి.
స్టంట్ కో-ఆర్డినేటర్: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్.
Matinee Entertainment’s 6th film ‘Wild Dog’ starring Akkineni Nagarjuna is directed by Ahishor Solomon. Reported to be based on true incidents, the film sees Nagarjuna essaying a different character as ACP Vijay Varma.
As of now, only posters of the film were released to introduce the lead cast of the film. Now, the makers have announced to release theatrical trailer to disclose what the film is all about.
Wild Dog trailer will be unleashed on March 12th at 4:05 PM.
Dia Mirza is the leading lady in the film, while Saiyami Kher will be seen in a crucial role.
This production venture of Matinee headed by Niranjan Reddy and Anvesh Reddy has dialogues penned by Kiran Kumar and Shaneil Deo is overseeing cinematography.
The following are the credits:
Writer – Director: Ahishor Solomon
Producers: Niranjan Reddy, Anvesh Reddy
Co-Producers: N M Pasha, Jagan Mohan Vancha
DOP: Shaneil Deo
Action Director: David Ismalone
Dialogues: Kiran Kumar
Editor: Shravan Katikaneni
Art Director: Murali SV
VFX Supervisor: Yugandhar T
Costume Designer: Ashwanth Byri
Stunt Coordinator: Jashuva
PRO: Vamsi-Shekar
Publicity Designers: Anil&Bhanu