4 పెద్ద సినిమాల నైజాం హక్కులు పొందిన వరంగల్ శ్రీనివాస్
Warangal Srinivas, popular distributor from Nizam area, has acquired theatrical rights of four big ticket films. He has obtained nizam rights of Ravi Teja’s Krack, Gopichand’s Seeti Marr, Sharwanand’s Srikaram and Rana’s Virataparvam.
Although there was competition, Srinivas grabbed the rights by offering a good price for each film. If not coronavirus and lockdown, all these films would have been released by now. In the meantime, he is also holding talks with producers of few other star hero films for Nizam rights.
Besides distribution, Warangal Srinivas is also turning as a producer with a forthcoming film which has wrapped up half of its shoot the remaining portion will be shot in foreign locations. Later, he is lining up 2 new projects in his production.
నైజాం ఏరియాలో పాపులర్ డిస్ట్రిబ్యూటర్ అయిన వరంగల్ శ్రీనివాస్, నాలుగు పెద్ద సినిమాల థియేటర్ హక్కులు పొందారు. రవితేజ ఫిల్మ్ ‘క్రాక్’, గోపీచంద్ సినిమా ‘సీటీమార్’, శర్వానంద్ చిత్రం ‘శ్రీకారం’, రానా మూవీ ‘విరాటపర్వం’ నైజాం హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు.
ఆ సినిమాల హక్కుల విషయంలో పోటీ ఉన్నప్పటికీ, మంచి ధరతో వాటి హక్కులను శ్రీనివాస్ పొందడం గమనించదగ్గ అంశం. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతపడక పోయినట్లయితే ఈ పాటికి ఆ సినిమాలన్నీ విడుదలై ఉండేవి. ఈ మధ్యలో, ఆయన మరికొంతమంది స్టార్ హీరోల సినిమాల నైజాం హక్కుల కోసం నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఓ వైపు డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటూనే, ఇటీవల ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయన నిర్మిస్తోన్న మొదటి చిత్రం షూటింగ్ సగం పూర్తయింది. మిగతా షూటింగ్‌ను ఫారిన్ లొకేషన్లలో నిర్వహించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత రెండు కొత్త సినిమాలు నిర్మించేందుకు శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు.