VJ Sunny’s ‘Sound Party’ poster released at the hands of MLC Kalvakuntla Kavita
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా వీజే సన్నీ `సౌండ్ పార్టీ` చిత్రం పోస్టర్ లాంచ్!!
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…“సౌండ్ పార్టీ` టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్లు టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ…“ ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వస్తోన్నమా మొదటి సినిమా `సౌండ్ పార్టీ` పోస్టర్ ను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా, ప్సోత్సాహకరంగా ఉంది. ప్రత్యేకంగా మా `సౌండ్ పార్టీ` యూనిట్ అందరి తరఫున కవిత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇటీవల విడుదల చేసిన సౌండ్ పార్టీ టైటిల్ కు వచ్చిన స్పందనే పోస్టర్ కు కూడా వస్తోంది. మా చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా యూనిట్ అంతా ఎంతో శ్రమించి అనుకున్న దానికన్నా అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు“ అన్నారు.
హీరో వీజే సన్ని మాట్లాడుతూ…“మా సౌండ్ పార్టీ` చిత్రం పోస్టర్ కవిత గారు లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది“ అన్నారు.
దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ…“ సౌండ్ పార్టీ` టైటిల్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు కవిత గారి చేతుల మీదుగా మా చిత్రం పోస్టర్ లాంచ్ చేశాము. పోస్టర్ లాంచ్ చేసి కవిత గారు మా టీమ్ అందరికీ బ్లెస్సింగ్స్ అందించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి“ అన్నారు.
చిత్ర సమర్పకుడు జయశంకర్ మాట్లాడుతూ…“మేము ఏ ఉద్దేశ్యంతో టైటిల్ పెట్టామో దానికి రీచ్ అయ్యాము. టైటిల్ విన్న వారంతా కూడా చాలా బావుంది అంటున్నారు. ఈ రోజు మా సినిమా పోస్టర్ లాంచ్ చేసిన కవిత గారికి ధన్యవాదాలు. మా నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండ్ గా పిక్చరైజ్ చేశాము. త్వరలో విడుదలకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తాం“ అన్నారు.
శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. : జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జయశంకర్ ; రచన – దర్శకత్వం : సంజయ్ శేరి
Bigg Boss Telugu 5 title winner VJ Sunny’s upcoming movie titled ‘Sound Party’ is up for theatrical release. Starring Hritika Srinivas as the heroine, the film is Full Moon Media Productions’ maiden venture. Sanjay Sheri, a talented writer, is making his debut as a director. Producers Ravi Polishetty, Mahendra Gajendra, and Sri Shyam Gajendra have joined hands with presenter Jaya Shankar. MLC Kalvakuntla Kavita has unveiled the first poster of the entertainer, which is currently in post-production phase.
Speaking on the occasion, Kavita Kalvakuntla said that the title and the first poster are very interesting. “The title suggests that the concept of the film is quite entertaining. This film will be a great success. I wish the director, the producers, all actors and technicians all the best,” she added.
Producer Ravi Polishetty said, “It is very happy and encouraging that Nizamabad MLC Kalvakuntla Kavita garu today launched the poster of our debut movie. ‘Sound Party’ has been made prestigious on Full Moon Media Productions. The entire unit thanks the MLC today. We are expecting a fabulous response to the poster. The production works have been wrapped up successfully. Post-production work is currently underway. All our unit members worked really hard and made the film better than we expected.”
Hero VJ Sunny said, “I am very happy to launch the poster today at the hands of Kavita garu. Ever since the title was announced, our film has gained a lot of buzz. The shooting has been completed. The final product exceeds all expectations.”
Director Sanjay Sheri said, “The title of ‘Sound Party’ has got an amazing response. Today, we launched the poster of our film at the hands of Kavita garu. It is a great pleasure that she has extended her blessings to all our team.”
Presenter Jaya Shankar said, “The title has been justified already. Everyone is satisfied with the title. Thanks to Kavita for launching the movie poster today. Thanks to our producers, the quality has turned out to be so good.”
Cast:
VJ Sunny, Sivannarayana, Ali, Saptagiri, ’30 Years’ Prudhviraj, ‘Mirchi’ Priya, Manik Reddy, Ashok Kumar, Kadambari Kiran, ‘Gemini’ Suresh, Bhuvan Saluri, ‘I Dream’ Anjali, Prem Sagar, RJ Hemanth, Shashank Mouli, Trinadh, Krishna Teja and others.
Crew:
Director of Photography: Srinivas Reddy; Editor: G Avinash; Music Director: Mohit Rahmaniac; Music Director: Poornachari; PRO: GK Media; Line Producer: Sivakanth Vanga; Executive Producer: Bhuvan Saluru; Producer: Ravi Polishetty; Submitted by: V Jayashankar; Written and Directed by Sanjay Sheri.