Vijaya Bheri Arts New Film Production House Logo Launch

విజయభేరి ఆర్ట్స్ చిత్ర నిర్మాణ సంస్థ లోగో లాంచ్
సీనీ ప్రముఖులు మురళి మోహన్,వి.కె.నరేష్,వీరుపోట్ల,బా
విజయభేరి ఆర్ట్స్ సంస్థ అధినేత గతంలో వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా 2014 నుండి తెలుగు సినీ టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ, బుల్లితెర తో పాటు, వెండి తెర అవార్డులు అందిస్తున్నారు.
ఈ సందర్బంగా- విష్ణు బొప్పన మాట్లాడుతూ-* .సినీ ప్రముఖుల చేతుల మీదుగా లాంచ్ చేసిన విజయభేరి ఆర్ట్స్ లో నేను నిర్మించ బోయే చిత్రాలకు మంచి టాలెంట్ ఉన్న నూతన నటీ నటులను ప్రోత్సాహిస్తూ మా సంస్థ లో ప్రారంభమయ్యే ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి ఆర్టిస్ట్,టెక్నీషన్ల వివరాలను త్వరలో తెలియ చేస్తానని అన్నారు.
మురళీమోహన్ మాట్లాడుతూ** -. విష్ణు చిన్న కళా కారుడుగా కెరీర్ మొదలుపెట్టి, నిర్మాతగా మారి, గత 5 సంవత్సరాలుగా ఇలాంటి అవార్డ్స్ కార్యక్రమం చేయడం అభినందనీయం.నా జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ను ఇన్స్పిరేషన్ తీసుకుని తను విజయభేరీ ఆర్ట్స్ అను సంస్థను స్థాపించడం చాలా సంతోషం. ఈ ప్రొడక్షన్ లో మంచి సినిమాలు తీసి ఏంతో మందికి ఉపాధి కల్పించాలని అన్నారు..
నటుడు సీనియర్ నరేష్ మాట్లాడుతూ* – విష్ణు విజయభేరి ఆర్ట్స్ సంస్థ ను మొదలుపెట్టడం చాలా సంతోషం. ఈ సంస్థ లో మంచి చిత్రాలు నిర్మించి మా… ఆర్టిస్ట్ లకు చాలా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు
దర్శకుడు వీరుపోట్ల మాట్లాడుతూ* — విష్ణు గారి బ్యానర్ లో కొత్త టాలెంట్ తో వచ్చే దర్శకులకు అవకాశాలు కల్పించి ఉత్తమమైన చిత్రాలు నిర్మించాలని అన్నారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ:* -విష్ణు లాంచ్ చేసిన విజయభేరి ఆర్ట్స్ లో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు అవకాశం కల్పించి మంచి చిత్రాలు తీయాలని అన్నారు..