Vijay Sethupathi in Vaisshnav Tej’s debut film

తమిళంలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కొన్ని రోజుల కిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
నటీనటులు:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సి.ఇ.ఒ: చెర్రీ
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫీ:శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మోనిక రామకృష్ణ