Vijay Antony Interview
కిల్లర్ తెలుగువారికి కచ్చితంగా నచ్చె చిత్రం – విజయ్ ఆంథోని
విజయ్ ఆంటొని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగారన్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా కథానాయిక. దియా మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సైమన్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు విడుదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ఎన్ని హత్యలైనా చేయడానికి నేను రెడీ’ అంటూ తనలోని కిల్లర్‌ని విజయ్ ఆంటొని చూపిస్తున్నారు. అర్జున్ పోలీస్ అధికారిగా నటించారు. నాజర్ మరో కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ చూస్తుంటే విజయ్ ఆంటొని మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పనులు అన్నీ పూర్తి చేసుకుని 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయ్ మాట్లాడుతూ…
కిల్లర్ గురించి చెప్పండి…
నేను ఈ చిత్ర దర్శకుడితో కలిసి పనిచెయ్యడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందువల్లన అంటే ఆయన నా క్లాస్‌మేట్, నా ఫ్రెండ్. చదువుకునేటప్పుడు మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ ఏమీ లేదు. చదువుకునేటప్పుడే తెలిసింది ఆయన 3, 4 చిత్రాలు డైరెక్ట్ చేశారని. నేను నటించడం మొదలుపెట్టాక ఆయన నాకొక కథ చెప్పారు. కథ నచ్చి వెంటనే చేస్తానని ఒప్పుకున్నాను. ఆయన గత చిత్రాలను చూశాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తర్వాత ఈ చిత్రాన్ని కూడా చాలా బాగా తీశారు. ఈ సినిమాకి మ్యూజిక్ నేను చెయ్యలేదు. సైమన్.కె.సింగ్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ మిస్టర్ ముకేష్. తమిళ్‌లో ప్రదీప్ గారు ప్రొడ్యూస్ చేశారు. స్నేహితుడు సంజు తెలుగులో దీని రైట్స్ కొన్నారు. అర్జున్‌గారు ఈ చిత్రంలోనటించారు. చాలా మంచి పాత్ర ఆయనది.
మీరు మ్యూజిక్ అందించిన చిత్రాలు…
నేను గతంలో ఇండియా పాకిస్టాన్ అనే చిత్రానికి ఇచ్చాను. అది నా మూడవ చిత్రం. అలాగే ఇంకా రెండు మూడు సినిమాలకు చేశాను. కాని ప్రస్తుతం నేను మ్యూజిక్ మీద ఇంట్రస్ట్ చూపించడం లేదు. నా ఇంట్రస్ట్ మొత్తం నటన మీదే ఉంది. నా ఏకాగ్రత మొత్తం నటన మీదే పెట్టి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తియ్యాలనుకుంటున్నాను.
ఈ చిత్రంలో కిల్లర్ ఎవరు…
నేనే ఈ సినిమాలో కిల్లర్‌ని. అర్జున్‌గారు పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
మీకు నచ్చిన పాయింట్ ఏంటి…
స్ర్కీన్‌ప్లే బాగా నచ్చింది. నేను ఎప్పుడు కథ లైన్ మాత్రమే విననండి ఫుల్ స్ర్కిప్ట్‌ను వింటాను. నాకు బాగా నచ్చి వెంటనే ఓకేచెయ్యడం జరిగింది.
మీ గత చిత్రాలకు దీనికి డిఫరెన్స్…
ఈ చిత్రంలో నేనే కిల్లర్‌ని. ఇంతకు ముందు చిత్రాల్లో నేనెవర్నీ చంపలేదు. నేను ఎందుకు చంపుతున్నాను.. ఎవర్ని చంపుతున్నాను. నేను మంచివాడినా… చెడ్డవాడినా… ఏంటి అన్నదాని పైన స్టోరీ నడుస్తుంది. లెజండరీ యాక్టర్ అర్జున్‌గారు కూడా ఇందులో ఉండడం చెయ్యడం ఈ చిత్రానికి ఒక స్పెషల్ ఎస్పెట్ అనే చెప్పాలి.
అర్జున్‌గారి గురించి…
ఆయన చాలా మంచి ప్రొఫెషనల్ యాక్టర్. నేను బేసిక్‌గా యాక్టర్‌ని కాదు. నేను మంచిగా నటించడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఏది మంచి యాక్టింగ్ ఏది కాదు అన్నది నాకు తెలియదు కాని నా ఉద్దేశం ప్రకారం ఆయన చాలా మంచి ప్రొఫెషనల్ యాక్టర్. ఆయన చాలా నీట్‌గా పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫనెట్‌గా ఆయన పాత్ర ఈ చిత్రాన్ని మంచి పొజీషన్‌కి తీసుకువెళ్ళుద్ది. ఆయనకి అన్ని బాషలు వచ్చు. చాలా బాగా చేస్తారు.
ఈ సినిమా ద్వారా సొసైటికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు…
ఇది మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం కాదు. ఇది పక్కా కమర్షియల్ ఫ్యామిలీ మూవీ. నా గత చిత్రాల్లో మెసేజ్ ఉండేది. కాని ఇది మెసేజ్ చిత్రం కాదు.
మీరు ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్‌ని తీసుకుంటారు ఎందువల్ల..
లేదండి. బిచ్చగాడు నెగిటివ్ కాదు. ఇందులో కూడా నాది నెగిటివ్ క్యారెక్టర్ కాదు ఒకసారి మీరు ఈ సినిమాని చూస్తే మీకే అర్ధమవుతుంది. నేను ఎందువల్ల వేరేవాళ్ళని చంపవలసి వచ్చింది. నేను ఎందుకు అంతకిరాతకంగా మారాను అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
తెలుగులో మీ స్ర్టయిట్ మూవీస్ ఎప్పుడు వస్తాయి…
ముందు నేను తెలుగు బాగా నేర్చుకోవాలండి. అప్పుడు తెలుగు స్ర్టయిట్ మూవీస్‌లో చేస్తాను. ప్రస్తుతం నాకు హేమచంద్ర డబ్బింగ్ చెపుతున్నారు.
స్టోరీ లైన్ చెప్పండి…
ఇదొక సస్పెన్స్ మూవీ. నేను ఈ చిత్రంలో కిల్లర్ పాత్రని పోషిస్తున్నాను. అర్జున్‌సార్ పోలీస్ క్యారెక్టర్ ఆయన నన్ను పట్టుకోవడానికి ట్రైచేస్తూ ఉంటారు. చాలా సింపుల్ లైన్. కాని సినిమా చూస్తే స్క్రీన్‌ప్లే చాలా బావుంటుంది. డెఫనెట్‌గా మీకందరికీ నచ్చుతుంది. ఇదొకంప్లీట్‌గా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది.
పోలీస్‌లైన్ డు నాట్ క్రాస్ అని ఉంది ఏంటది…
అది అర్జున్‌సార్ నాకు చెపుతారు పోలీస్‌లైన్ డు నాట్‌క్రాస్ అని ఎందుకంటే నేను సినిమాలో క్రాస్ చేస్తాను. ఎందువల్ల క్రాస్ చేస్తాను ఏంటన్నదే కథ. కొంత సొసైటీ కోసమైతే … నేను ఈ సినిమాలో ఓ అమ్మాయి వెనుక పడుతుంటాను ఆమెకోసం అలా క్రాస్ చేస్తుంటాను.
ఈ సినిమా మ్యూజిక్…
ఈ సినిమాకి మ్యూజిక్ కూడా నేను ఇవ్వలేదండి. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. మీరు సినిమా చూస్తే అదర్శమవుతుంది.
మీరు ఎప్పుడైన డైరెక్షన్ పరంగా ఇన్వాల్వ్ అవుతారా..
లేదండి నేను ఎప్పుడూ ఇన్‌వాల్వ్ కాను. నార్మల్‌గా కామన్‌మ్యాన్‌లాగా చెపుతాను అంతే ప్రత్యేకించి ఏమీ ఇన్వాల్వ్ కాను.
ఈ సినిమా ప్రొడ్యూసర్ మీరేనా…
నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌ని కాదు… నా గత చిత్రాలన్నీ నేను ప్రొడ్యూస్ చేశాను. నేను వేరే బ్యానర్‌లో చెయ్యడం ఇదే నా మొదటి చిత్రం.
బిచ్చగాడు చిత్రం చేసిన తర్వాత నాకు మంచి అనుభవం వచ్చింది సినిమాలు చెయ్యడంలో.
ఎడిటింగ్ మీరేనా..
కాదండి నేను చెయ్యలేదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను అన్నీ తెలుసుకోవాలనే ఇంట్రస్ట్‌తో నేర్చుకుంటున్నాను. నేను నా అంతట నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర నేర్చుకోలేదు.
తర్వాత సినిమాలు…
తమిళ్‌లో ఖాకి అనే చిత్రం చేస్తున్నాను. తెలుగులో జ్వాలా అనే చిత్రం తెలుగులో చాలా మంచి యాక్టర్స్‌తో కలిసి చెయ్యబోతున్నా ప్రకాష్‌రాజుగారు, జగపతిబాబుగారు, అరుణ్‌విజయ్, సత్యరాజ్ వీళ్ళందరితో కలిసి చెయ్యబోతున్నాను. ప్రస్తుతం కంటిన్యూగా పది సినిమాలు ఉన్నాయి. ప్రొడక్షన్ చెయ్యడంలేదు. ఓన్లీ వేరే బ్యానర్లకి సినిమాలు చేస్తున్నాను .
మీరు ఒక సింగర్‌గా మ్యూజిక్‌డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా ఇన్ని రంగాలు ఎలా చెయ్యగలుగుతున్నారు…
నేను ప్రొఫెషనల్ సింగర్‌ని కాదు అలాగే ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ని కూడా కాదు. నాకు కొంత అన్ని రంగాల పై కొంత అవగాహన ఉంటే ఎక్కడైనా ఏదైన తప్పు జరిగితే కవర్ చెయ్యడానికి ఉంటుందని తెలుసుకుంటున్నాను అంతే. ఎడిటింగ్‌లో అయినా టెక్నికల్‌గా ఏ డిపార్ట్‌మెంట్ అయినా అంతే అని ముగించారు.