Victory Venkatesh’s New Stylish Look For His Birthday is Rocking
బర్త్ డే కి న్యూ స్టైలిష్ లుక్ లో అదరకొడుతున్న విక్టరీ వెంకటేష్
ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి ‘విక్టరీ’ నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం డిసెంబర్ 13. ప్రస్తుతం ‘నారప్ప’ గా పవర్ ఫుల్, ఇంటెన్స్ రోల్ లో కనిపిస్తున్న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గం లకు విడుదల చేయనున్నారు. ‘నారప్ప’ తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ‘F3’ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ పుట్టినరోజుకు వెంకటేష్ న్యూ ఫోటోషూట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్టిల్స్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, గెడ్డంతో స్టైలిష్ గా వెంకీ అదరకొడుతున్నారు. ట్రేమెండస్ రెస్పాన్స్ వచ్చిన ఈ స్టిల్స్ కాజువల్ గా తీసినవే అని చెప్తున్నప్పటికీ, ఫ్యూచర్ లో రాబోయే ఫిల్మ్ లో ఖచ్చితంగా ఈ స్టైలిష్ లుక్ తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ అది ఏ చిత్రంలో ఉంటుందో వెయిట్ అండ్ సీ…
Venkatesh Daggubati who has aced many memorable roles and delivered huge successes in his career has made ‘Victory’ as his household name. He is celebrating his birthday on December 13. Currently he is doing a Powerful and Intense role as Narappa and the first glimpse of the film will be out today (December 12) at 8:00 PM as his birthday gift. It is already known that Victory Venkatesh will be doing ‘F3’ along with Mega Prince Varun Tej in Blockbuster Director Anil Ravipudi’s Direction. Venkatesh’s latest stills from new photoshoot are released for this birthday. Venky looks Uber cool sporting salt & pepper look with a beard in this stylish pics. These stills received rave response from everyone. Though it is being said that these were clicked casually, It is being heard that Victory Venkatesh will surely sport this new terrific look in one of his future films. Let’s wait and see for more details of the film.