Victory Venkatesh’s ‘Naarappa’ Shooting Resumed

Victory Venkatesh’s ‘Naarappa’ Shooting Resumed

విక్టరీ వెంక‌టేష్ `నార‌ప్ప` షూటింగ్ షురూ.. 


సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి,  వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. లాక్ డౌన్‌కి ముందే శరవేగంగా 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ రీసెంట్‌గా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైద‌రాబాద్ ప‌రిస‌ర‌ప్రాంతాల్లో షూటింగ్‌ పునఃప్రారంభించింది.  ఈ సంద‌ర్భంగా
నిర్మాత‌లు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ – “అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో  ‘నారప్పస‌ షూటింగ్ ప్రారంభించి తమిళ నాడులోని కురుమలై మ‌రియు తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాం.  క‌రోనా వ్యాప్తి కార‌ణంగా నిలిపివేసిన షూటింగ్‌ని త‌గిన  జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ  రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల త‌దిత‌ర‌ ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో  80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను  పూర్తిచేసి త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తాం” అన్నారు.
విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
కథ: వెట్రిమారన్‌,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ,
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.
 
Victory Venkatesh’s ‘Naarappa’ Shooting Resumed
 
Venkatesh who has made Victory as his first name is currently doing ‘Narappa’ in the Direction of Sreekanth Addala, who is known for delivering heart touching feel-good films. Star Producer Suresh Babu and Kalaippuli S Thanu are Producing Bigbudgeted ‘Naarappa’ under Suresh Productions Pvt Ltd and V Creations banners. National Award Winning Actress Priyamani who is always a front runner for doing different kinds of roles is playing Sundaramma in this film. She will be remembered for a long time for her role in this film. The film has completed 60 days of its shoot at a rapid pace even before the lockdown. The team has resumed the shoot in Hyderabad surroundings taking necessary precautions. On this occasion.

Producers Suresh Babu, Kalaippuli S. Thanu said, ” We started the shoot of ‘Naarappa’ at Paaltur village in Uravakonda at Anantapur District and shot key action sequence at Kurumalai and in Therikaadu Red Desert near Thirichendur in Tamil Nadu. The shoot has been stalled in the wake of Corona Pandemic and we have resumed the shoot recently at Hyderabad taking all precautionary measures. We are currently filming crucial scenes and climax involving Priyamani, Rao Ramesh, Rajeev Kanakala, and other principal casts. With this ongoing schedule, 80% of the shoot will be completed. By completing the remaining flashback sequences, we will bring the film to the audience very soon.”

Victory Venkatesh starrer ‘Naarappa’ has Priyamani, Karthik Ratnam, Rao Ramesh, Rajeev Kanakala as principal cast

Cinematography: Syam K Naidu, Music: Mani Sharma, Editor: Marthand K Venkatesh, Art: Gandhi Nadikudikar, Story: Vettrimaran, Script Consultant: Satyanand, Fights: Peter Heins, Vijay, Lyrics: Sirivennela Seetharama Sastry, Suddala Ashok Teja, Anantha Sreeram, Krishnakanth, Kasarla Shyam, Finance Controller: G. Ramesh Reddy, Production Controller: Ramabalaji D, Production Executive: AP Paul Pandi, Executive Producer: Vijay Shankar Donkada, Co-Producer: Devi Sridevi Satish,
Produced by D. Suresh Babu, Kalaippuli S. Thanu
Directed by Sreekanth Addala.