వెంకీ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరి!!

వెంకీ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరి!!
`ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` సినిమాలో వెంకటేష్ ని ప్రేమించమని వెంట పడుతుంది నటి స్వాతి. కానీ వెంకటేష్ కుఏజ్ కు ఆమె ఏజ్ కు సగం తేడా ఉంటుంది. దీంతో ఆమెకు చిన్న క్లాప్ పీకేస్తాడు వెంకటేష్. ఇక ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ తో ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అవును ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో ఒక సినిమా ప్లాన్ చేసాడట దిల్ రాజు. ఈ కథను యువ రైటర్ ప్రసన్న రాసినట్లు తెలుస్తోంది. వెంకటేష్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వెంకటేష్ `వెంకీమామ` లో నటిస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే దిల్ రాజు బేనరల్ లో రూపొందే ఈ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ ఉండే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది. చూద్దాం ఎలా ఉంటుందో మరి.