veyi shubhamulu kalugu neeku movie review Raating 3.25/5
వేయి శుభములు కలుగు నీకు మూవీ రివ్యూ!!
నటీ నటులుః
విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్పా రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు
సాంకేతిక నిపుణులుః
బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా
నిర్మాతలు: తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్
కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని
రేటింగ్ : 3.25/5
సీనియర్ నటుడు శివాజీ రాజా అబ్బాయి విజయ్ రాజా, తమన్నా వ్యాస్ జంటగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమా చూడాలన్న క్యూరియాసిటీ ఏర్పరిచింది. మరి ఈ శుక్రవారం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం రివ్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
స్టోరి విషయానికి వస్తే..
ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో హారర్ ప్రోగ్రామ్స్ కు ప్రోగ్రామ్ డైరెక్టర్ గా చైతు(విజయ్ రాజా) వర్క్ చేస్తుంటాడు. దివ్య(తమన్నా వ్యాస్)అనే అమ్మాయిని మూడేళ్లుగా ప్రేమిస్తుంటాడు. చైతూ టీవీ చానల్ లో పనిచేస్తూ పోగు చేసుకున్న డబ్బుతో తన ఫాదర్ (శివాజీ రాజా) సొంతింటి కలను నెరవేర్చడానికి ఓ మంచి బంగ్లాను కొనుగోలు చేసి అందులోనే మకాం ఉంటాడు. అయితే ఆ బంగ్లాలో ఓ దెయ్యం (జ్ఞాన ప్రియ) చైతూని ఇళ్ళు ఖాళీ చేయించాలని నా నా చిత్రహింసలు పెడుతూ… భయ భ్రాంతులకు గురిచేస్తూ ఉంటుంది. మరి చైతూ బంగ్లాను వదిలి పెట్టాడా? ఇంతకు దెయ్యం ఎవరు? ఆమె చైతు కొనుగోలు చేసిన బంగ్లాను విడిచి పోవాలని ఎందుకు చైతూని భయపెడుతూ ఉంటుంది? ఇంతకూ చైతూ బంగ్లాని వదిలి పెట్టాడా? దివ్య… చైతూ వివాహం జరిగిందా? లేదా అన్నది మిగతా కథాంశం.
సాంకేతిక నిపుణుల పనితీరుః
ప్రారంభ సన్నివేశంతోనే దర్శకుడు రామ్స్ రాథోడ్ సినిమా ఎలా ఉండుబోతుందో చూపించేసాడు. ఎక్కడా ల్యాగ్ లేకుండా కథలోకి వెళ్లాడు దర్శకుడు. తను రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కు గురిచేస్తుంది. టీవీ ఛానెల్ లో వచ్చే హార్రర్ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేస్తాయి. అడవిలో తీసిన హార్రర్ సీన్, బంగ్లాలో హీరోని భయపెట్టే సోఫాసెట్స్ గాల్లో ఎగిరే సీన్ ఆడియన్స్ ని భయపెడతాయి. అలాగే హీరో, సత్యం రాజేష్ ని భయపెట్టే సీన్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగించి…. సెకెండ్ హాఫ్ లో అసలు విషయం రివీల్ చేయడం…. ఆందులో ఓ చైల్డ్ సెంటిమెంట్, సరయు పాత్రలో కనిపించే ఎమోషనల్, సోసియల్ మీడియా ద్వారా ఉదయ్(వెంకట్ నారాయణ) పాత్ర చేసే మోసపూరిత చర్యలు అన్నీ ప్రేక్షకులకు మంచి సందేశాన్ని కూడా అందిస్తాయి. రచ్చ రవి , విలన్ ను దెయ్యం భయపెట్టే సీన్ ప్రేక్షకులను నవ్విస్తుంది. సకెండ్ హాఫ్ లో వచ్చే సరయు, ఉదయ్ పాత్రలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ ఓ మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. రామ్స్ రాథోడ్ దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమాటోగ్రఫీ, మాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ప్రేమకథా చిత్రం తర్వాత ఆ స్థాయిలో మరో మంచి సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది.
ఆర్టిస్ట్స్ పర్పార్మెన్స్ః
హీరో విజయ్ రాజా తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నటన , లుక్స్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు . అలానే డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో మాస్ ని ఆకట్టుకున్నాడు అనడంలో సందేహం లేదు. తండ్రి కోరికను తీర్చే బాధ్యత గల చైతూ పాత్రలో యూత్ ని ఆకర్షించాడు. అలాగే హీరోయిన్ తమన్నా వ్యాస్ తన అందంతో పాటు అభినయంతో మెస్మరైజ్ చేసింది. హీరో ఫ్రెండ్ గా త్రూ అవుట్ పాత్ర చేసిన సత్యం రాజేష్ మరోసారి తన కామెడీ టైమింగ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. కాసేపు వున్నా రచ్చరవి కడుపుబ్బ నవ్వించాడు. బిల్డర్ గా కొద్దిసేపు కనిపించినా సాయాజీ షిండే తన పాత్రకు న్యాయం చేసాడు. ఫస్టులో తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్ మీద వచ్చే సెంటి మెంట్ సాంగ్ లో శివాజీ రాజా బాగా నటించారు. విలన్ గా ఉదయ్ పాత్రలో నటించిన కొత్త నటుడు వెంకట్ నారాయణ అటు లవర్ బాయ్ గా…. ఇటు విలన్ గా రెండు పాత్రలను బాగా బ్యాలెన్స్ చేసి మెప్పించాడు. మిగతా నటులంతా వారి పాత్రలకూ న్యాయం చేస్తూ సినిమాకు బలాన్ని చేకూర్చారు.
ఫైనల్ గా చెప్పాలంటేః
ఇప్పటి వరకు అనేక హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసుంటాం. కానీ ఇందులో ఎంచుకున్న ప్లాట్ మాత్రం విభిన్నంగా ఇంత వరకు తెరపై రాని విధంగా ఉంటుంది. దర్శకుడు ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ ను తీసి సక్సెస్ అయ్యారు. శ్రీనాథ్ రెడ్డి అందించిన కథకు… దర్శకుడు మంచి స్క్రీన్ ప్లే రాసి… దాన్ని సినిమాటోగ్రాఫర్ బుజ్జితో సిల్వర్ స్క్రీన్ పై అందంగా ఆవిష్కరించారు. నిర్మాతలు తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావులు ఖర్చుకి వెనుకాడకుండా రిచ్ మేకింగ్ వాల్యూస్ తో సినిమా ని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాల చాలా తక్కువగా వస్తున్నాయి. డిఫరెంట్ చిత్రాలు , సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ కామెడీ చిత్రాలను నచ్చని ప్రేక్షకులు ఉండరు. సో ఇంటిల్లిపాది వెళ్లి సినిమా ఎంజాయ్ చేయవచ్చు. డోంట్ మిస్ దిస్ వీక్.
వేయి నవ్వులు కలుగు మీకు