Venkatesh Interview
ఫస్ట్ హాఫ్ కామెడీ -సెకండ్ హాఫ్ ఎమోషన్ తో ` వెంకీ` మామ ` : వెంకటేష్
గత ఐదారేళ్లుగా సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు, యాక్టింగ్ నుండి రిటైర్ అవుదామని అనుకుంటున్నట్లు విక్టరీ వెంకటేష్ తెలిపారు. కానీ, కుదరడం లేదని ఆయన అన్నారు. మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన సినిమా ‘వెంకీ మామ’. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల అవుతోంది. అదే రోజు వెంకటేష్ పుట్టిన రోజు, పెళ్లిరోజు కూడా కావడం విశేషం.
ఇక ఈ ఇంటర్వ్యూలో ‘వెంకీ మామ’ సినిమా గురించి వెంకటేష్ మాట్లాడుతూ “మామ అల్లుళ్ళ కాంబినేషన్ మాత్రమే సినిమాలో హైలైట్ కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనకు తెలియని శక్తి ఏదో మనల్ని నడిపిస్తుంది అని నేను నమ్ముతాను. ఈ సినిమా కూడా అటువంటి కథాంశంతో తెరకెక్కింది. జాతకాలు, విధి నేపథ్యంలో కథ సాగుతుంది. అలాగని, ప్రేక్షకులకు బోర్ కొట్టే టాపిక్ కింద ఉండదు. కమర్షియల్ వాల్యూస్ ఫుల్ గా ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా ఫుల్ కామెడీ. సెకండాఫ్ కొంచెం ఎమోషనల్ గా వెళ్తుంది” అని అన్నారు. ఓషో గురించి, తాను నమ్మే ఫిలాసఫీ గురించి వెంకటేష్ చాలా విషయాలు చెప్పారు.
సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు వెంకటేష్ చెప్పారు. ఐదారేళ్లుగా ఆయన మనసులో ఆ ఆలోచన ఉందట. అయితే… మంచి కథలు వస్తుండడంతో రిటైర్ కావడం కుదరడం లేదని వెంకటేష్ తెలిపారు. ‘వెంకీ మామ’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎంచుకుంటూ …తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నాడు వెంకటేష్. స్టార్ హీరో అయినా కూడా ఎంతో సింపుల్ గా ఉండే మనస్తత్వం ఆయనది . సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్లడమే తన సిద్ధాంతం . గురు, ఎఫ్ 2 సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ తాజాగా `వెంకీ మామ `తో సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 13 పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భం విషెష్ తెలియజేస్తోంది మూవీ పేజెస్.