నాని ‘టక్ జగదీష్’లో “ఇంకోసారి లిరికల్ సాంగ్ విడుదల
నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ, షైన్ స్క్రీన్స్ మూవీ ‘టక్ జగదీష్’లో “ఇంకోసారి ఇంకోసారి” లిరికల్ వీడియో సాంగ్ విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు.
ముందుగా ప్రకటించినట్లే చిత్ర బృందం శనివారం ఉదయం 9 గంటలకు “ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి” అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ విన్నకొద్దీ వినాలనిపించే మధురమైన బాణీలు అందించిన ఈ పాటకు చక్కని పదబంధాలతో సాహిత్యం అందించారు చైతన్య ప్రసాద్. శ్రేయా ఘోషల్, కాలభైరవ గానం ఈ సాంగ్‌కు మరింత రిచ్‌నెస్ తీసుకొచ్చింది. చిత్రంలో ఈ పాటను నాని, రీతూ వర్మపై చిత్రీకరించారు. వారిద్దరి జంట చూడముచ్చటగా ఉంది.
ఇదివరకు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ పోస్టర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైరల్ అయ్యింది.
దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, వెంకట్ ఫైట్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తారాగణం:
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, నాజర్, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
కో- డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి
క్యాస్టూమ్ డిజైనర్: నీరజ కోన
పీఆర్వో: వంశీ-శేఖర్.