Tremendous Response For Varun Tej – Harish Shankar’s ‘Valmiki’ Pre Teaser

వరుణ్‌తేజ్-హరీష్ శంకర్ తొలి కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్మీకి’. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. మిరపకాయ్, గబ్బర్‌సింగ్ నుంచి డి.జె. వరకు ఎన్నో కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన హరీష్ శంకర్ తమిళ్లో సూపర్‌హిట్ అయిన జిగర్తాండ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే విధంగా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ టీజర్‌ను జూన్ 24న విడుదల చేశారు. ఈ టీజర్లో వరుణ్‌తేజ్ గ్యాంగ్‌స్టర్ లుక్ చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ప్రీ టీజర్‌తోపాటు అధర్వ లుక్‌ని కూడా విడుదల చేశారు. వరుణ్‌తేజ్, అధర్వ ఉన్న ఈ పోస్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా డైలాగ్స్‌తో మ్యాజిక్ చేసే విధంగా హరీష్ శంకర్ సినిమా టీజర్ ఉంటుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. దానికి భిన్నంగా ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఈ ప్రీ టీజర్‌ను డిఫరెంట్‌గా క్రియేట్ చేసి బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు హరీష్ శంకర్.