టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్ “Tempt రాజా”
టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్ “Tempt రాజా”
సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా “Tempt రాజా”. టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ…
“Tempt రాజా” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. గతంలో మేము విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ బాగా ఆదరించారు. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ కి ఇంకా బాగా రెస్పాన్స్ వస్తోంది. ఎంతలా అంటే… 10 రోజుల్లో మా సినిమా బిజినెస్ ని క్లోజ్ చేసే అంతలా ఈ టీజర్ కి బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. హీరోయిన్ లు దివ్య రావ్, ఆస్మ లు చాలా బాగా నటించారు. వీళ్ళతో పనిచేయడం నాకు కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్. ఎంతో ఎల్దీ గా తన కామెడీ టైమింగ్ తో నవ్వించారు. ఆయకు ధన్యవాదాలు. ఇది మహిళల ఇమేజ్ ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎంటనేది చాలా సున్నితంగా తెరమీద చూపించాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు మా “Tempt రాజా”.
హీరో: రాంకి (వీర్నాల రామకృష్ణ)
హీరోయిన్: దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్)
సెకండ్ హీరోయిన్: ఆస్మ
ఆర్టిస్ట్స్:
పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి.
టైటిల్: Tempt రాజా
బ్యానర్: సే క్రియేషన్స్
నిర్మాత: సే క్రియేషన్స్
ప్రజెంట్స్: ఏఆర్కే ఆర్ట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్
డిఓపి: రాజు
ఎడిటర్: బి.ఎన్. ఆర్.
మ్యూజిక్, సాంగ్స్: హరి గౌర
ఆర్. ఆర్.: తమిరి శంకర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కసర్ల శ్యామ్
స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: రాంకి (రామకృష్ణ)
డైలాగ్స్: రాంకి, జి.రవి, విజయ్
మేనేజర్: జి.రవి
పిఆరోఓ: మధు.విఆర్