తెలుగు ఆడియో రంగంలోకి ప్రవేశించిన అగ్ర సంగీత సంస్థ `టిప్స్` మ్యూజిక్ !!
టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు శాకుంతలం, హరిహర వీరమల్లు గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే శాకుంతలం, హరి హర వీర మల్లు చిత్రాల గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాల మ్యూజికల్ టీజర్స్‌పై ఆసక్తి రెట్టింపయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటీనటులు నటించిన
హరి హర వీర మల్లు, శాకుంతలం, రెండు చిత్రాల బిజినెస్ పరిశ్రమకే సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ యాక్షన్- అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నం, సంగీత దిగ్గజం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి బాణీలు కడుతున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ నెలలో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ మ్యూజిక్ హక్కులు కూడా టిప్స్ ఇండస్ట్రీస్ సొంతమయ్యాయి.
కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం శకుంతల ఆధారంగా భారతీయ తెలుగు భాషా పౌరాణిక ప్రేమకథా చిత్రంగా శాకుంతలం మూవీ రూపొందింది. క్రెయేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మించారు. సంగీత స్వరకర్త మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ పోషించగా.. కురువంశపు రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అల్లు అర్హ, అనన్య నాగళ్ళ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ భారీ సినిమా కు చెందిన ప్రపంచవ్యాప్త సంగీత హక్కులను ఇప్పుడు టిప్స్ మ్యూజిక్ కంపెనీ చేజిక్కించుకుంది.
ఈ సందర్భంగా టిప్స్ మ్యూజిక్ అధినేతలు కుమార్ తౌరానీ, గిరీష్ తౌరానీ మాట్లాడుతూ : “ఎన్నో సంవత్సరాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతటా ఎన్నో అద్భుతమైన భారీ చిత్రాలని నిర్మించిన సంస్థ టిప్స్, అంతే కాకుండా పాటలు, సంగీతాన్ని అందించిన టిప్స్ మ్యూజిక్.. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదే నిబద్ధతతో ప్రస్తుతం తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇకపై తెలుగు చిత్రాల ఆడియో హక్కులతో పాటు భారతీయ అన్ని భాషల ఆడియో హక్కులను కొనడానికి సిద్ధంగా వుంది. కేవలం భారీ చిత్రాలనే కాకుండా చిన్న చిత్రాలు సైతం మా సంస్థ ఆడియో విడుదల చేయడానికి ముందుంటుంది. శాకుంతలం, హరిహర వీరమల్లు వంటి అద్భుతమైన చిత్రాల ఆడియో హక్కులతో పాటు… మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ DTS (డేర్ టూ స్లీప్) మణి శంకర్, లాంప్, రా రా పెనిమిటి, ధగఢ్ సాంబా, పరమపద సోపానం, యు అర్ మై హీరో, ఈ రోజు టీజర్తో విడుదల అయినా మై నేమ్ ఈజ్ శృతి, చిత్రాల ఆడియో హక్కులు పొంది ఉన్నామని మీకు తెలియ చేస్తున్నాం. ఇప్పటికే మా టిప్స్ యు ట్యూబ్ ఛానల్ కు 51 మిలియన్ సభ్యులు వున్నారు ప్రతి చిత్రం ప్రచారంలో భాగంగా చిన్న పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ప్రతీ సినీ ప్రేమికుడికి మా మాధ్యమం ద్వారా చేరుతుందని తెలియచేస్తూన్నాం. మా మిత్రుడు ఆడియో రంగంలో సుపరిచితుడు ‘సుప్రీం’ రాజు హార్వాణి సౌత్ ఇండియన్ మూవీస్ వ్యాపార లావాదేవులను నిర్వహిస్తారు. ప్రేక్షకులకు క్లాసీ, వినోదాత్మక సంగీతాన్ని అందించాలానే సంకల్పంతో టిప్స్ ఇండస్ట్రీస్ మునుకెళ్తోంది” అన్నారు.
Tips Industries acquires the Global Music Rights of Telugu film industry’s two biggest & most anticipated films Pawan Kalyan Hari Hara Veera Mallu and Samantha Shakunthalam
Shaakuntalam is a massively ambitious Indian Telugu-language mythological love story drama film written and directed by the exemplary director Gunasekhar combining with soulful music of iconic music composer Mani Sharma and produced by Neelima Guna and Dil Raju under the banner of Gunaa Teamworks and Dil Raju Productions respectively. Based on a popular Indian play Shakuntala by Kalidasa, the film features Mega superstars Samantha Ruth Prabhu in the titular role of Shakuntala and Dev Mohan as Dushyanta, the king of Kuru Dynasty along with quintessential Mohan Babu, Sachin Khedekar, Gautami, Aditi Balan and Ananya Nagalla in supporting roles.