డిజె టిల్లు నుంచి `టిల్లు అన్న డీజే పెడితే `లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ !!

డిజె టిల్లు నుంచి  `టిల్లు అన్న డీజే పెడితే `లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ !!

 

‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ పాటందుకున్న ‘డిజె టిల్లు’ సిద్దు జొన్నలగడ్డ, 
*గాయకుడు రామ్ మిరియాల స్వరాన్ని, స్వరాల్ని అందించిన గీతం
 
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా 
టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం
 ‘డిజె టిల్లు’. 
 
ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల ఆయన క్షణం నుంచే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే…..
 
“లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల
మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్ ల
టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల” అనే ఈ పల్లవి గల గీతాన్ని గీతా రచయిత కాసర్ల శ్యామ్ రచించారు. ఈ గీతం గురించి ఆయన మాటల్లోనే…
హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక పాట రాయాలని డైరెక్టర్ గారు చెప్పి,రామ్ మిరియాల ఇచ్చిన మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపించారు…పక్కా హైదరాబాదీ రిదం తో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చింది.. హైదరాబాద్ గల్లీలల్లో  ఒక రకమైన ఆటిట్యూడ్ తో ఉండే యంగ్ కుర్రాళ్ళు గుర్తొచ్చారు..ఏరియాల పేర్లతో పల్లవి ప్రారంభించి,హీరోపై మిగతా మిత్రులు, ఫ్యాన్స్ కోణంలో హుక్ లైన్ రాసా..తరువాత టీజర్ లో హీరో నటన,స్వాగ్ చూసాక చరణం అప్రయత్నంగా పలికింది… పాట ప్రోమోనే అద్భుతమైన వ్యూస్ రాబట్టుకుంది.. పాట అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను…
మంచి డాన్సింగ్ నంబర్ నా కలం లో నుండి రావడం,అందరి సెలెబ్రేషన్ లలో నేను ఒక భాగమవ్వడం సంతోషం గా ఉందని ఈ గీతం రచయిత కాసర్ల శ్యామ్ అంటున్నారు. భాను నృత్యరీతులు సమకూర్చారు ఈ గీతానికి. 
 
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయిన‘డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకున్నాయన్నది స్పష్టం. అటు టీజర్ లో దృశ్యాలు, సంభాషణలు ఇటు ఈ గీతంలోని నృత్యాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. జనవరి 14-2022 న విడుదల అవుతున్న ‘డిజె టిల్లు’ ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు అనే విధంగా చిత్ర ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. 
 
నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన .
 
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.
 
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్ 
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ
 
Come, shake a leg with DJ Tillu for Ram Miriyala’s groovy dance number Tillu Anna DJ Pedithe 
 
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Ahead of the film’s release on January 14 for the Sankranti season, Tillu Anna DJ Pedithe, a fast-paced party number was launched today and has caught the fascination of music lovers.
 
Staying true to Siddhu’s character as a local Hyderabadi DJ in the film, the number is high on energy and brims with a folksy flavour unique to Telangana. One of the most happening playback singers in the tinsel town, Ram Miryala, has sung and composed the song penned by popular lyricist Kasarla Shyam, synonymous with delivering one chartbuster after the other.
 
‘Lalaguda Amberpeta Mallepalli Malakpeta..Tillu anna dj pedithe tilla tilla aadalaa…Mallesanna dawath la bannu gaani baarat la.. Tillu anna digindu ante dinchak dinchak dhunkalaa,’ the song, filled with apt local references and boasting of great rhythm, takes off on an exuberant note, with an irresistibly catchy musical hook. Besides Siddhu’s energetic dance moves, the lyrical video offers a colourful sneak-peek into traditions, festivals that are integral to the life of a Hyderabadi. The composer does a fine job in seamlessly blending this indie-musical flavour into a mainstream film.
 
“The director wanted me to write a song that’ll mirror Siddhu’s characterisation in the film and sent across a catchy tune. I was instantly drawn to the number that captured the musical spirit of Hyderabad perfectly. I was reminded of those typical arrogant local guys across Hyderabadi streets and hence thought it would be apt to start the song with the names of various areas in the city,” lyricist Kasarla Shyam says. 
 
“The hook line was written keeping fans in mind and my job was made easier when I noticed Siddhu’s attitude in the film. The lines just flowed organically. I’m happy with the response to the song promo and quite eager to know what audiences have to say about the full song too. I am satisfied I could do my bit to lift the spirits of audiences with a kickass dance number. Bhanu’s choreography does complete justice to its energy levels,” he adds. 
 
It’s evident that DJ Tillu and its wacky universe has resonated with young audiences from the stills and the promos, including the recently launched teaser. The film is further bolstered by the presence of music director S Thaman, who’s come on board to compose the background score. Composer Sri Charan Pakala is also part of the project. Directed by debutant Vimal Krishna, the film has a formidable supporting cast, comprising Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas.
 
 
Cast & Crew: 
 
Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas
 
Story & Screenplay by: Vimal Krishna & Siddhu
Dialogues: Siddhu
Art Director: Avinash Kolla
Music Director: Sri Charan Pakala
Editor: Navin Nooli
DOP: Sai Prakash Ummadisingu.     
Executive Producer: Dheeraj Mogilineni
Producer: Suryadevara Naga Vamsi
Director: Vimal Krishna
Banner: Sithara Entertainments
Presenter: PDV Prasad