“ది ఇండియన్ స్టోరి“ మూవీ రివ్యూ !! రేటింగ్ 3.25/5

“ది ఇండియన్ స్టోరి“ మూవీ రివ్యూ !! రేటింగ్ 3.25/5

 

 

“ది ఇండియన్ స్టోరి“ మూవీ రివ్యూ !!

నటీనటులుః
రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు

సాంకేతిక వర్గంః
స్టంట్స్ – శంకర్, ఆది, మ్యూజిక్ – సందీప్ కనుగుల, ఎడిటర్ – జేపి, డీవోపీ – నిమ్మల జైపాల్ రెడ్డి, కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు, ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి, దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.

ఇటీవ‌ల కాలంలో సందేశాత్మ‌క చిత్రాలు చాలా అరుదుగా వ‌స్తున్నాయి. మెసేజ్ కి క‌మ‌ర్షియ‌ల్ అంశాలు జోడించి చిత్రాలు చేసి స‌క్సెస్ సాధించడంతో త‌మిళ శంక‌ర్ ఎన్నో స‌క్సెస్ అయ్యారు. ఆ కోవ‌లో “ ది ఇండియ‌న్ స్టోరి` ఒక సందేశాత్మ‌క చిత్రంగా రూపొంది ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌లైంది. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్ష‌కులు నుంచి ఎలాంటి ప్ర‌శంస‌లు అందుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

కథ విష‌యానికొస్తే…
త‌క్కువ సంఖ్య‌లో ఉండ‌టం చేత అణచివేతకు గురవుతున్నామ‌ని ముస్లిం వర్గం… మెజారిటీ సంఖ్య అయినా ఐక్యత లేకపోవడం వల్ల నష్టపోతున్నామని హిందూ వర్గం భావిస్తుంటుంది. ఈ ఆలోచనలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉంటాయి. ముస్లింలకు కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్), హిందువులకు శ్రీరామ్ (రామరాజు) నాయకత్వం వహిస్తుంటారు. ఈ ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో హిందూ ముస్లిం దాడులు పెరుగుతుంటాయి. ఇది గమనించిన రాజ్ (రాజ్ భీమ్ రెడ్డి) అనే జర్నలిస్ట్ మత విద్వేషాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణ‌యించుకుంటాడు. సమాజంలో మతం పేరుతో గొడవలు జరగకూడదని రంగంలోకి దిగుతాడు. ఇందుకోసం అతనేం చేశాడు. తన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా. ఈ క్రమంలో కబీర్ ఖాన్, శ్రీరామ్ గురించి అతను తెలుసుకున్న ఆశ్చర్యకర నిజం ఏంటి అనేది మిగ‌తా సినిమా. అది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

న‌టీన‌టుల ప‌నితీరుః
హీరోగా తన నటన, ఫైట్స్, కామెడీతో మంచి మార్కులు కొట్టశాడు రాజ్ భీమ్ రెడ్డి. స్టార్ హీరోలా ఎలివేషన్స్ కోరుకోకుండా సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాడు. నిర్మాతగా ఆయన అభిరుచి, నటుడిగా ప్రతిభ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఫైట్స్ హైలైట్ అయ్యాయి. ఫేకు గా చమ్మక్ చంద్రకు తన కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ చేశాడు. ప్రతి సీన్ లో నవ్విస్తూనే ఉన్నాడు చమ్మక్ చంద్ర. అలాగే హీరోయిన్ జరా ఖాన్ పర్ ఫార్మెన్స్ బాగుంది. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు తమకున్న అపార నటనానుభవంతో మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
టెక్నికల్ గా “ది ఇండియన్ స్టోరి” టాప్ క్వాలిటీతో ఉంది. ఎడిటింగ్, స్టంట్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తాయి.

ఫైన‌ల్ గా చెప్పాలంటేః
రాజకీయ నాయ‌కుల స్వార్థం వ‌ల్లే స‌మాజంలో అభివృద్ది ఆగిపోతుంది. ఇలాగే మతం పేరుతో కూడా హింసను ప్రేరేపిస్తున్నారు కొందరు నాయకులు. అలాంటి ఇద్దరు నాయకుల ఆట కట్టించిన హీరో కథే “ది ఇండియన్ స్టోరి”. హిందువుల వర్గానికి నాయకుడైన శ్రీరామ్ (రామరాజు) శక్తి సేన పేరుతో పార్టీ పెడతాడు. ముస్లిం లీడర్ కబీర్ ఖాన్ ముస్లిం లీగ్ పేరుతో రాజకీయాల్లోకి వస్తాడు. వీరిద్దరు హత్యా రాజకీయాలు, మతం పేరుతో దాడులు చేయిస్తుంటారు. ఈ హత్యల వెనక కారణాలు తెలుసుకునేందుకు రాజ్ అనే జర్నలిస్ట్ ఓ పథకం ప్రకారం రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతను శ్రీరామ్ గురించి కబీర్ ఖాన్ గురించి తెలుసుకున్న విషయాలు ప్రేక్షకుల్ని అవాక్కయ్యేలా చేస్తాయి. వారు పుట్టి పెరిగిన నేపథ్యం, ఎదిగిన క్రమం ఆశ్చర్యపరుస్తాయి. రాజ్ ను రెహమాన్ గా పరిచయం చేసిన దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే సాగించాడు. రెహమాన్ క్యారెక్టర్ ద్వారా ప్రతి సీన్ ఆసక్తికరంగా మలుస్తూ కథను తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ లో ఒక బ్యాంగ్ తో ముగించాడు. సరదాగా సాగిన పస్టాఫ్ ఇక్కడి నుంచి సీరియస్ నెస్ తో వెళ్తుంది. చివరలో మంచి సందేశంతో సినిమాను ముగించారు. ఫ‌స్టాఫ్ లో అక్క‌డ‌క్క‌డా కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. సెకండాఫ్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా కొన‌సాగుతుంది.

కామెడీగా ఉంటూనే కథలో మెసేజ్ , సీరియస్ నెస్ కొనసాగుతూ ఉంటుంది. ఈ కథను ఏమాత్రం అటూ ఇటూగా చూపినా అది ప్రమాదకరం అందుకే దర్శక నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా మూవీని తెరకెక్కించారు. తాము చెప్పదల్చుకున్న పాయింట్ ను మాత్రమే ఈ సినిమాలో చూపించారు. మతం పేరుతో మన మధ్య చిచ్చు పెట్టేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే మంచి సందేశాన్నిచ్చింది “ది ఇండియన్ స్టోరి” సినిమా. “ది ఇండియన్ స్టోరి` ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్రం.

రేటింగ్ 3.25/5