Tharun Bhascker, Roll Rida Sing For Manishi Brathuku Inthe

Tharun Bhascker, Roll Rida Sing  For Manishi Brathuku Inthe

‘మ‌నిషి బ్ర‌తుకు ఇంతే’ అని పాడిన త‌రుణ్ భాస్క‌ర్‌, రోల్ రైడా

సినిమా తీసినం!
మా మొద‌టి ఫీచ‌ర్ ఫిల్మ్ ఫైన‌ల్ క‌ట్ పూర్తి చేసిన‌ప్పుడు మాకు క‌లిగిన అనుభూతి ఇది. ఈ ఫిల్మ్‌ను మార్కెట్ చేయ‌డానికి మంచి మార్గం గురించి అన్వేషిస్తున్న‌ప్పుడు క‌లిగిన ఆలోచ‌న‌తో రోల్ రైడా, త‌రుణ్ భాస్క‌ర్‌ల‌ను క‌లుపుకొని సాగాల‌ని మేం నిర్ణ‌యించుకున్నాం. విష‌యం ఏదైనా కానీ, ఈ ర‌క‌మైన స్పిరిట్ ఆఫ్ మేకింగ్‌కు వాళ్లిద్ద‌రూ ప్ర‌తినిధుల‌నేది నా అభిప్రాయం.

సినిమా తీసినం స్ఫూర్తి
త‌రుణ్ భాస్క‌ర్‌కు నేనెక్కువ రుణ‌ప‌డి ఉంటాను. త‌న షార్ట్ ఫిల్మ్ రోజుల నుంచి అత‌ని వ‌ర్క్ నాకు ప్రేర‌ణ‌నివ్వ‌డం వ‌ల్లే, చివ‌ర‌కు సొంతంగా నేను సినిమా తియ్య‌గ‌లిగాను.

నేను ఈ సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు మా ద‌గ్గ‌రుంది కేవలం రూ. 2 లక్ష‌లు మాత్రమే. ఆ బడ్జెట్లోనే షూటింగ్ పూర్తి చేయాల‌ని నిర్ణయించుకున్నాం. మేం అతిగా ఊహించుకొని ఉండొచ్చు. కానీ విష‌యం ఏమంటే, మేం నిజంగా ఆ ప‌ని చేశాం. ప్ర‌తి పైసా ఆదా చేస్తూ, న‌టులంద‌రి షెడ్యూల్స్‌ను తీసేసుకుంటూ, సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌తి లొకేష‌న్‌ను ప‌ట్టుకుంటూ సినిమా పూర్తి చేశాం.

మేం సాధించాం. ఈ విష‌యంలో న‌న్ను న‌మ్మి, నా కోసం స‌మ‌ష్టిగా ప‌నిచేసి, నాకు సాయ‌ప‌డిన‌ నా టీమ్‌కు ఎంతైనా రుణ‌ప‌డి ఉంటాను.

ఈ సినిమా దేని గురించంటే..
‘మ‌నిషి బ్ర‌తుకు ఇంతే’ అనేది ఒక వెబ్ ఫిల్మ్‌. త‌నలో క‌లిగిన డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే సిద్ధార్థ్ అనే యువ‌కుడి క‌థ‌తో న‌డిచే నేటి కాల‌పు కామెడీ ఫిల్మ్ ఇది. సాధార‌ణంగా డిప్రెష‌న్‌ను మ‌న సినిమాల్లో చాలా భ‌యంక‌ర‌మైన‌దిగా చూపిస్తుంటారు. కానీ దానికి వినోద‌భ‌రిత‌మైన రెండో కోణం కూడా ఉంద‌ని మేం న‌మ్మాం. ఈ సినిమా ద్వారా ఆ రెండో వైపును చూపించాల‌నుకున్నాం. ప్ర‌ధానంగా ఆన్‌లైన్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫిల్మ్ తీశాం. ప‌దునైన‌ ‘రా’ కంటెంట్ కోసం ఆన్‌లైన్ ఆడియెన్స్ బాగా ఆక‌లిగా ఎదురు చూస్తున్నారు. స‌రిగ్గా దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఫిల్మ్ రూపొందించాం. అతి త్వ‌ర‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం.

త‌రుణ్ భాస్క‌ర్ & రోల్ రైడా
తెలుగు ర్యాప్ అంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చే పేరు రోల్ రైడా. మాకు పెద్ద బోన‌స్ అవుతుంద‌నే ఉద్దేశంతోనే ఆయ‌న‌తో క‌లిశామ‌నేది నిజం. కాన్సెప్ట్ న‌చ్చి, ఇందులో ప‌నిచేయ‌డానికి ఆయ‌న‌ అంగీక‌రించాడు.
త‌రుణ్ భాస్క‌ర్ అయితే నిజంగా స్వీట్‌హార్ట్‌. త‌ను కేవ‌లం పాడ‌ట‌మే కాకుండా, రికార్డ్ స్థాయిలో ఒకే ఒక్క రోజులో యానిమేటెడ్ వీడియో త‌యారుచేయ‌డం.. చాలా గొప్ప విష‌యం. ఆయ‌న జీనియ‌స్ మాత్ర‌మే కాదు, ఎంతో విన‌య‌శీలి కూడా. ఒక్క మాట‌లో చెప్పాలంటే, నా దృష్టిలో టాలీవుడ్‌లో త‌రుణ్ భాస్క‌ర్ బెస్ట్ డైరెక్ట‌ర్‌.

సినిమా తీద్దాం!
చాలామంది ఆర్థికంగా త‌ట్టుకోలేని ఒక ఫిల్మ్ స్కూల్లో నేను చ‌దువుకున్నాను. కాబ‌ట్టి ముందుకు వెళ్ల‌డానికి.. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేక‌ర్స్‌, స్టూడెంట్స్ క‌లిసి పనిచేయ‌గ‌ల ఒక లెర్నింగ్ క‌మ్యూనిటీని ప్రారంభించాల‌నుకున్నాం. సినిమాల గురించి నేర్పించ‌డానికీ, త‌మ ద‌గ్గ‌రున్న డ‌బ్బు, జ‌నం, లొకేష‌న్స్ వంటి వ‌న‌రుల‌తో సినిమాలు నిర్మించ‌డానికీ ఈ క‌మ్యూనిటీ ప్ర‌జ‌ల‌కు తోడ్ప‌డుతుంది.

‘కీప్ రోలింగ్’ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌
‘మ‌నిషి బ్ర‌తుకు ఇంతే’ మూవీతో పాటు, మేం ఇంకో ఫిల్మ్ కూడా తీస్తున్నాం. ప్ర‌స్తుతం అది పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. దాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.

మా ప‌నిని కొన‌సాగించ‌డంలో ‘కీప్ రోలింగ్’ అనే మా పేరును నిల‌బెట్టుకోవాల‌ని ఆశిస్తున్నాం. మ‌రిన్ని ఫిలిమ్స్ తీస్తూ, వాటిని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాం. మ‌మ్మ‌ల్ని మేమే చాలెంజ్ చేసుకుంటూ, ప్ర‌తి సారీ మరింత మంచి ఫిల్మ్ తీయాల‌ని ఆశిస్తున్నాం.

‘మ‌నిషి బ్ర‌తుకు ఇంతే’ తారాగ‌ణం, సాంకేతిక బృందం…
ఈ మూవీలో సిద్ధార్థ్ రెడ్డి, రేవంత్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు.
హైద‌రాబాద్ ఇండీ ర్యాప్‌కు చెందిన‌వాళ్లు అతిథి పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.
నిర్మాణ సంస్థ – కీప్ రోలింగ్ పిక్చ‌ర్స్‌
ర‌చ‌న‌, కూర్పు, ద‌ర్శ‌క‌త్వం: వ‌రుణ్‌రెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ: రోహిత్ బ‌చ్చు
బీజీయం: బాబీ
అడిష‌న‌ల్ బీజీయం: శిశిర్ (ఆల్ఫా బీయింగ్‌)

Tharun Bhascker, Roll Rida Sing For Manishi Brathuku Inthe

Cinema teeshinam!

It was the feeling we had when we finished the final cut of our first feature length film.

While we were thinking of the best way to market this film, we thought we should speak about the spirit that got us over the edge.

And that’s when we decided that we should try and collaborate with Roll Rida and Tharun Bhascker.

For me, they both represent this spirit of making it no matter what.

The spirit of Cinema Teeshinam.

I owe a lot to Tharun Bhascker. His work (from his short film days) inspired me to finally make a film on my own.

I just had a couple of lakh rupees when I started this movie. And we decided that we will finish the shooting within that budget.

We might have overshot. But the point is, we really did it. We managed to save every penny, steal every actor’s schedule and grab every location we could.

We did it. I owe a lot to the team that believed in me and came together to help me with this.

ABOUT THE MOVIE

Manishi Brathuku Inthe is a web film. It’s a coming of age comedy that follows the lead protagonist Siddharth, as he comes out of his depression.

Usually depression is shown in a grim dark way in movies. But we believe there is a funny side to it. We wanted to shed light on that through this movie.

Our target audience is mostly online. They have a huge appetite for edgy, raw content. And that is exactly the tone we went for.

We want to release this film on an OTT platform shortly.
THARUN & ROLL RIDA
Roll Rida is the biggest household name in Telugu Rap. So the fact that we collaborated with him was a huge bonus for us. He liked the concept and agreed to come onboard.

Tharun Bhascker was an absolute sweetheart. He came onboard and not only did he sing, but also made the animated video in a record time of 1 day. That’s right.

The man is a genius. And so down to Earth.

Just a word, I think Tharun Bhascker is the best director in Tollywood. It’s just a matter of time before everyone agrees to it.

CINEMA TEESDAM!

I studied in a film school and not many can afford it. I barely managed at the time.

So going ahead, we want to start a learning community where independent film makers and students can come together. This community will help people learn and make films with whatever resources they have – be it money, people or locations.

FUTURE OF KEEP ROLLING.

Besides MANISHI BRATHUKU INTHE, we are finishing another film too.

Currently, it’s in post-production. We will have a theatrical release for that.

Going ahead, we want to stay true to our name – Keep Rolling. We want to keep making more films and get them out in front of an audience. The journey is all that counts.

And yes, we want to challenge ourselves and get better each time.

CAST and CREW

The film features Siddharth Reddy and Revanth in key roles.

There are little cameos by the Hyderabad Indie rap crowd in the film.

Production house – Keep Rolling pictures

Written, directed and edited – Varun Reddy

Cinematography – Rohit Bachu

BGM – Bobby

Additional BGM – Shishir (Alpha Being)