`స్వాగతం కృష్ణ` ఇండిపెండెంట్ ఫిలిం రివ్యూ 3.5/5

`స్వాగతం కృష్ణ` ఇండిపెండెంట్ ఫిలిం రివ్యూ  3.5/5

 

  • `స్వాగతం కృష్ణ` ఇండిపెండెంట్ ఫిలిం రివ్యూ

    మాములుగా అబ్బాయిలు , అమ్మాయిలతో ఎఫైర్ కోరుకుంటారు. కానీ , స్వాగతం కృష్ణ ` లో మాత్రం అమ్మాయి, అబ్బాయి తో ఎఫైర్ కోరుకుంటుంది. పబ్ లకు , పార్క్ లకు తిప్పుతుంది. చివరకు వీరద్దరి మధ్య అఫైర్ దేనికి దారి తీసింది అనే ఇంట్రస్టింగ్ కంటెంట్ తో వచ్చిన ఇండిపెండెంట్ ఫిలిం ` స్వాగతం` కృష్ణ `. యూత్ కి కిక్కిచ్చే కంటెంట్ తో నేత్ర ఎంటర్టైన్మెంట్స్, రాధా క్రియేషన్స్ సంయుక్తంగా తెరెకెక్కించిన ఇండిపెండెంట్ ఫిలిం `స్వాగతం కృష్ణ ` . రాధా కృష్ణ పులవర్తి దర్శకత్వం లో టి. హరికృష్ణ నిర్మించారు. శనివారం ప్రసాద్ లాబ్స్ లో ఈ ఇండిపెండెంట్ ఫిలిం ని ప్రదర్శించారు. ఈ ఫిలిం ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    `స్వాగతం కృష్ణ` ఇందులో హీరో చైతన్య కృష్ణ కు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం హాబీ, ఒకవేళ ఎవరైనా నో చెబితే ఫ్రెండ్ షిప్ చేసేవరకు వదలడు మన కృష్ణుడు! కానీ తన లైఫ్ లో ఒక అమ్మాయి మాత్రం చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, 8 ఇయర్స్ అయినా కృష్ణ ఫ్రెండ్షిప్ కి ఆక్సిప్ట్ చేయదు . కానీ కృష్ణ తనతో ఎలాగైనా ఫ్రెండ్షిప్ ఓకే చెప్పించాలని కలుస్తాడు!! కానీ తను మాత్రం ఫ్రెండ్షిప్ కి ఒప్పుకోదు పైగా.., నీతో నేను అస్సలు ఫ్రెండ్షిప్ చెయ్యను అని చెప్తూ కానీ నాకు నీతో ఎఫైర్ అయితే ఓకే అంటుంది.., కృష్ణ షాక్ అవుతాడు.., కానీ తనతో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలని ఎఫైర్ కి ఓకే చెప్పి ఫ్రెండ్షిప్ లోకి దింపాలని అనుకుంటాడు!! మరి ఆ అమ్మాయి ని కృష్ణ ఫ్రెండ్ షిప్ లోకి దించాడా? లేదా ? అసలు ఆ అమ్మాయి కృష్ణ ఫ్రెండ్ షిప్ ని ఎందుకు ఆక్సిప్ట్ చేయడం లేదు అన్నది తెలియాలంటే ఈ నెల 13న యూట్యూబ్ లో చూసి తెలుసుకోవాల్సిందే ….

    ఆర్టిస్ట్స్ పెరఫార్మెన్సెస్ :
    కృష్ణుడిలా మాటల్తో మాయచేసి ఏ అమ్మాయినైనా ఇట్టే పడేయగల పాత్రలో చైతన్య చాలా బాగా నటించాడు. అటు చెలాకీగా, ఇటు సాఫ్ట్ గా టూ వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. ఇంకా కొంచెం నటనను మెరుగుపరుచుకుంటే అతడిలో హీరో అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. ఇక హీరోయిన్ గా చేసిన అల్కా రాథోర్ కూడా తన అందం , అభినయం తో ఆకట్టుకుంది. ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది . ఇక చైతన్య, అల్కా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఆర్టిస్ట్స్ ని ఎంచుకోవడం లోనే డైరెక్టర్ పాస్ మార్క్స్ కొట్టేసాడు . ఇక మిగతావారంతా వారి పాత్రలకు న్యాయం చేసారు.

    టెక్నిషన్స్ వర్క్ అండ్ ఎనాలిసిస్ :
    లవ్ స్టోరీ అనగానే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ . ఇక స్వాగతం కృష్ణ ఫిలిం కి కబీర్ రఫీ ఇచ్చిన రెండు సాంగ్స్ హాంటింగ్ గా ఉన్నాయి . లీనస్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉన్నా.. లౌడ్ ఎక్కువయ్యింది . ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఫిలిం మొత్తం ఆర్, ఆర్ తో నింపేశారు. ఇక చిన్న చిన్న జర్క్ లతో కొంచెం డిస్టర్బ్ చేసినా .. సినిమాటోగ్రఫీ చాలా కలర్ ఫుల్ గా ఉంది. డైరెక్టర్ డైలాగ్స్ తో పాటు మంచి కంటెంట్ తీసుకొని ఫిలిం చేసాడు. అసలు హీరో అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ మాత్రమే ఎందుకు ? కోరుకుంటాడు …. అనే దానికి మంచి రీసన్ ఇచ్చాడు . అలాగే సుప్రియ (హీరోయిన్ ) ఎనిమిదేళ్లుగా ఎందుకు కృష్ణ ( హీరో ) ఫ్రెండ్ షిప్ యాక్సెప్ట్ చేయదు అనే దానికి క్లయిమాక్స్ లో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఇవ్వడం తో సినిమాకు హైలైట్ గా నిలిచింది. ట్విస్ట్ ఏంటో క్లయిమాక్స్ వరకు రివీల్ చేయకుండా ఆడియన్స్ ఊహించని విధంగా స్క్రీన్ ప్లే ని నడిపించడం లో డైరెక్టర్ ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ఇక ఈ లవ్ స్టోరీ లో అమ్మ గురించి చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఎనిమిదేళ్లుగా సుప్రియ ఫ్రెండ్ షిప్ కోరుకున్న కృష్ణ సడన్ గా ఆమెతో లవ్ లో పడిపోతాడు … ఈ సమయం లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ తో కృష్ణ తనపట్ల తీసుకునే కేరింగ్ నచ్చి సుప్రియ , కృష్ణ తో ఫ్రెండ్ షిప్ ని ఓకే చేస్తుంది . కానీ కృష్ణ ఆమె ప్రేమ కావాలనుకుంటాడు. ఇలాంటి సిట్యుయేషన్ లో ముగింపు ఎలా ఇచ్చాడు దర్శకుడు అనేది ఇంట్రస్ట్ పాయింట్. ఇలా ఇంట్రస్టింగ్ మలుపులతో డైరెక్టర్ రాధా కృష్ణ స్వాగతం కృష్ణ ఇండిపెండెంట్ ఫిలిం ని ఫ్యామిలీ , ముఖ్యం గా యూత్ కి అందరికి నచ్చేలా రూపొందించారు. ఇక షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తో తామెంటో నిరూపించుకుని వెండి తెరపై దర్శకులుగా వెలిగిపోతున్న ఈ తరుణం లో ఆ జాబితాలో రాధా కృష్ణ కూడా చేరతారు అనడానికి స్వాగత కృష్ణ సాక్ష్యం.
    గంట నిడివి గల ఈ ఇండిపెండెంట్ ఫిలిం కచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది . ఈ నెల 13న యూట్యూబ్ లో అప్లోడ్ చేయనున్నారు. హ్యాపీ గా చోడోచ్చు , షేర్ చేయొచ్చు.

  • Rating :3.5/5