Suresh kondeti interview about lisaa 3d

Suresh kondeti interview about lisaa 3d
                               
 
                               
                                      `లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం!- సురేష్ కొండేటి
 
అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `లీసా 3డి`. రాజు విశ్వ‌నాథం ద‌ర్శ‌కుడు. తెలుగు- త‌మిళ్ ద్విభాషా చిత్ర‌మిది. వీరేష్ కాసాని స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.కె.పిక్చ‌ర్స్ ప‌తాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏపీ- తెలంగాణ‌లో దాదాపు 400 పైగా 3డి థియేట‌ర్ల‌లో సినిమా రిలీజ్ చేస్తున్నామ‌ని.. ప్ర‌తి సెంట‌ర్ లో 3డి థియేట‌ర్లు అందుబాటులో ఉన్నాయని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు. ఈనెల 24న రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎఫ్ఎన్ సీసీలో ఆయ‌న‌ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలివి.. 
 
*అన్ని సినిమాలు హార‌ర్ కామెడీలుగా అల‌రించాయి. కానీ లీసా 3డిలో హార‌ర్ తో పాటు సెంటిమెంట్ హైలైట్ గా ఉంటుంది. రెగ్యుల‌ర్ హార‌ర్ సినిమా మాత్రం కానేకాదు. రెండున్న‌ర గంట‌లు .. 3గం.ల పాటు నిడివి లేకుండా 2గం.ల పాటు ఆద్యంతం ఉత్కంఠ క‌లిగించేలా ఈ చిత్రం ఉంటుంది. 
 
* ఈసినిమాకి రోబోటిక్స్ అద్భుతంగా వ‌ర్క‌వుటైంది. 2.0 చిత్రానికి ప‌ని చేసిన అత్యుత్త‌మ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి ప‌ని చేశారు. రోజుకు 2.5ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఖ‌రీదైన కెమెరాల్ని చిత్రీక‌ర‌ణ కోసం ఉప‌యోగించారు. బెస్ట్ క్వాలిటీ విజువ‌ల్స్ తెర‌పై మైమ‌రిపిస్తాయి. 
 
*ఇది తెలుగు స్ట్రెయిట్ సినిమా. త‌మిళంలో అనువ‌దించి రిలీజ్ చేస్తున్నాం. సైమ‌ల్టేనియ‌స్ గా రెండు చోట్లా రిలీజ్ చేస్తున్నాం. ఇదివ‌ర‌కూ తెలుగులో పిజ్జా అనే హారర్ చిత్రాన్ని రిలీజ్ చేశాం. ఆ సినిమా ఎంత పెద్ద స‌క్సెసైందో తెలిసిందే. సింగ‌ర్ల కోసం ప్ర‌సాద్ లాబ్స్ లో షో వేస్తే అరిచి గోల పెట్టారు. మ‌ధ్య‌లోనే సినిమాని ఆపాల్సొచ్చింది. లీసా 3డి అంత‌కుమించి భ‌య‌పెడుతుంది. థియేట‌ర్ల‌లో గ‌గ్గోలు పెట్ట‌డం ఖాయం. పంపిణీదారుగా.. ఎగ్జిబిట‌ర్ గా ఎంత అనుభ‌వంతో అన్ని ప‌క్కా క్యాలిక్యులేష‌న్స్ తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. కింది స్థాయి నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి హిట్ సినిమాని ఇవ్వ‌డానికి ఏం చేయాలో నాకు తెలుసు. నేను దేవుడిని కాక‌పోయినా హిట్ ఫార్ములా తెలిసిన‌వాడిగా న‌మ్మ‌కంగా చెబుతున్నా. గ‌తంలో ప్రేమిస్తే.. షాపింగ్ మాల్.. జ‌ర్నీ ఎంత పెద్ద విజ‌యం సాధించాయో అంత‌కుమించిన ఘ‌న‌విజయం అందుకోబోతున్నాం. 
 
*లిసా 3డి చిత్రం రిలీజ్ గురించి తెలిసి ఆరు జిల్లాల‌కు వెంట‌నే ఓ బ‌య్య‌రు కొనుక్కున్నారు. మ‌రుస‌టి రోజుకే బిజినెస్ మొత్తం పూర్త‌వ్వ‌డం ఈ సినిమాకి ఉన్న డిమాండ్ ని తెలియ‌జేస్తోంది. అంజ‌లి ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా.. బ్ర‌హ్మానందం త‌దితరులు ఈ చిత్రంలో న‌టించారు. 
 
*ప్ర‌తియేటా సంతోషం అవార్డుల్ని దిగ్విజ‌యంగా అందిస్తున్నాం. ఈ ఆగ‌స్టుతో సంతోషం వార‌ప‌త్రిక విజ‌య‌వంతంగా 17 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 18వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది. 18వ ఏట అవార్డు వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నాం. మ్యాగ‌జైన్ ప్రారంభోత్స‌వ‌ ఫంక్ష‌న్ వేళ ఫిలింఫేర్ త‌ర‌హాలో తెలుగులో అవార్డులు లేవు ఏదైనా అవార్డు కార్య‌క్ర‌మం చేయొచ్చు క‌దా! అని నాగార్జున గారు అన్నారు. ఆయ‌న మాట మేర‌కు సంతోషం అవార్డుల్ని ప్రారంభించి విజ‌య‌వంతంగా న‌డిపించాను. మెగాస్టార్ చిరంజీవి నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకుని ఆయ‌న స్ఫూర్తితోనే ఈ రంగంలో కొన‌సాగుతున్నాను. ఇక నేను నిర్మాత కావాల‌ని మెగాస్టార్ చిరంజీవి దీవించారు.2004లోనే అన్న‌య్య దీవెన‌లు అందుకుని నేడు నిర్మాత‌గా ఎదిగాను. నేను ఏం చేసినా ఇన్ స్పిరేష‌న్ మెగాస్టార్ చిరంజీవి గారే. ఇక అవార్డుల సంద‌ర్భంలో పేద ఆర్టిస్టుల‌కు చిన్న‌పాటి ఆర్థిక సాయం చేయ‌డం ఒక బాధ్య‌తగా తీసుకుని చేస్తున్నాను. 
 
*ప్రేమిస్తే సినిమా స‌మ‌యానికి ఇప్ప‌టికి సినిమా మేకింగ్ లో ఎంతో ఛేంజ్ క‌నిపిస్తోంది. ఇప్పుడు డిజిట‌ల్ గా సాంకేతిక‌త పెరిగింది. అయితే దాంతో పాటే క్వాలిటీ కోసం ఖ‌ర్చు పెంచారు. విజువ‌ల్ గ్రాఫిక్స్ స‌హా ప్ర‌తిదానికి అవ‌స‌రం మేర ఖ‌ర్చు పెట్టే త‌త్వం నిర్మాత‌ల్లో పెరిగింది. 
 
*ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా శంభో శంక‌ర చిత్రాన్ని నిర్మించాను. శంక‌ర్ హీరోగానే మ‌రో తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. శంక‌ర్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల్లో న‌టించ‌డం సంతోషంగా ఉంది. 
 
*జ‌ర్న‌లిస్టుగా కెరీర్ ప్రారంభించాను. సంతోషం మ్యాగ‌జైన్ న‌డిపిస్తున్నా. అయితే మ్యాగ‌జైన్లు కిట్టుబాటు అవుతోందా .. క‌ష్టం క‌దా వ‌దిలెయ్!! అని చాలా మంది అన్నారు. కానీ నేను ఉన్నంత‌కాలం జ‌ర్న‌లిజాన్ని.. మ్యాగ‌జైన్ ని విడిచిపెట్టేది లేదు. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రినుంచో ప్రోత్సాహం ఉంది. అదే నాకు శ్రీ‌రామ‌ర‌క్ష‌.
 
*మూవీ ఆర్టిస్టుల సంఘంలో సుధీర్ఘ కాలం ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. ప్ర‌స్తుత క‌మిటీలో కీల‌క బాధ్య‌తల్ని నిర్వ‌ర్తిస్తున్నాను. న‌టకిరీటి రాజేంద్ర ప్ర‌సాద్, శివాజీ రాజా అధ్య‌క్షులుగా ఉన్న‌ప్పుడు వారి జ‌మానాలో `మా`లో బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించాను. సీనియ‌ర్ న‌రేష్ అధ్య‌క్షుడిగా ఉన్న ప్ర‌స్తుత క‌మిటీలోనూ  నా బాధ్య‌త నేను నిర్వ‌ర్తిస్తా. చేసే ప‌ని నిజాయితీగా చేస్తున్నాను కాబ‌ట్టే నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. సినిమాతో ప్ర‌మేయం ఉన్న 24 శాఖ‌ల్లో ఏ ప‌ని చేయ‌డానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఎఫ్ఎన్‌సీసీ మేనేజ్‌మెంట్ క‌మిటీ మెంబ‌ర్ గా బాధ్య‌తాయుతంగా ప‌ని చేస్తున్నాను.