పర్ఫార్మెన్స్‌కి స్కోపున్న పాత్రలో నటించా:  హీరోయిన్  ప్రగ్య నయన్‌

   పర్ఫార్మెన్స్‌కి స్కోపున్న పాత్రలో నటించా:  హీరోయిన్  ప్రగ్య నయన్‌
 

           పర్ఫార్మెన్స్‌కి స్కోపున్న పాత్రలో నటించా:  హీరోయిన్  ప్రగ్య నయన్‌

 

 

   జార్ఖండ్‌లో గిరిడి అనే చిన్న ప్రాంతంలో పుట్టి రాజస్థాన్‌లో బిట్స్‌ పిలానిలో చదువుకుని మంచి ప్యాకేజ్‌ ఉన్న జాబ్‌ వదులుకుని ఎటువంటి సినిమా నేపథ్యంలో లేకుండా సౌత్‌ ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్‌గా రాణిస్తున్నారు  ప్రగ్య నయన్‌, ప్రస్తుతం ఈమె ‘సురాపానం’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం జూన్‌ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ప్రగ్య నయన్‌తో బాక్సాఫీస్‌ ఇంటర్వ్యూ ..
 మీ గురించి చెప్పండి?
 మా నేటివ్‌ ప్లేస్‌ జార్ఖండ్‌లో గిరిడి. మా నాన్నగారు రంజన్‌ రాజీవ్‌ నయన్‌, మా అమ్మగారి పేరు సీమ సిన్హా, మా సిస్టర్‌ పేరు ప్రేరణ. నేను కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ కంప్లీట్‌ చేశాను. బెంగుళూరులో ఐటీ ఫీల్డ్‌లో కొంతకాలం జాబ్‌ చేశాను. మా ఫ్యామిలీలో అందరూ ఐఏయసే ఆఫీసర్స్‌, ఇంజనీర్స్‌, డాక్టర్స్‌ ఉన్నారు తప్ప..సినిమా ఫీల్డ్‌లో ఎవరూ లేరు. అలా నేను ఎక్కువగా మొదట్లో స్టడీ మీద శ్రద్ధ పెట్టాను. నేను బెంగుళూరులో జాబ్‌ చేసేటప్పుడు వీకెండ్స్‌లో క్యాట్‌ అండ్‌ ర్యాంప్‌ వాక్‌కి వెళ్లేదాన్ని అలా ‘సమరం’ అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘సురాపానం’ చిత్రంలో ఆడిషన్‌ ద్వారా హీరోయిన్‌గా సెలక్ట్‌ అయ్యాను.  యాక్టింగ్‌ పరంగా ఏ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లలేదు కానీ కొన్ని థియేటర్‌ క్లాసెస్‌కి వెళ్లాను. అలాగే స్కూల్‌ డేస్‌  నుంచి కూడా డాన్స్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చేదాణ్ని. అలాగే యాక్టింగ్‌  పట్ల ఎంతో ఇంటస్ట్రింగ్‌గా ఉండేదాణ్ని. మూవీస్‌ చూస్తూ కూడా చాలా నేర్చుకున్నా. రాజస్థాన్‌లో బిట్స్‌ పిలానీ లో చదువుకుని..మంచి ప్యాకేజ్‌ ఉన్న జాబ్‌ వదులుకుని సినిమా ఫీల్డ్‌కి ఎందుకు వచ్చావు అని చాలా మంది అడుగుతుంటారు. కానీ నాకు మూవీస్‌ అంటే ప్యాషన్‌. అందుకే సినిమా ఫీల్డ్ కి వ‌చ్చాను. “ నీ స్టడీ కంప్లీట్‌ అయ్యాక నీ ఇష్టమైన ఫీల్డ్‌లోకి వెళ్లమన్నారు మా పేరెంట్స్ . అందుకే స్టడీ కంప్లీట్‌ అయ్యాక ఇటువైపు వచ్చాను. మా ఫ్యామిలీ ఫుల్‌ సపోర్ట్‌ ఉంది.

 

 

 సురాపానం’ చిత్రంలో మీ క్యారక్టర్‌ ఎలా ఉంటుంది?
 ఇందులో నా క్యారక్టర్‌ చాలా బబ్లీ బబ్లీగా ఉంటుంది. స్వతంత్ర భావాలతో  ఉంటూ.. నచ్చింది చేయాలనుకుంటాను. మా పేరెంట్స్‌ కూడా నన్ను ఎంతో గారంగా చూస్తుంటారు. స్టోరి నాకు చాలా నచ్చింది. ఫ్యాంటసీతో సాగే థ్రిల్లర్‌. కామెడీ కూడా బాగుంటుంది. పర్ఫార్మెన్స్‌కి స్కోపున్న పాత్ర.
 డైరక్టర్‌ కమ్‌ హీరో సంపత్‌ కుమార్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి చెప్పండి?
 సంపత్‌ గారు ఇందులో హీరోగా నటిస్తూ డైరక్షన్‌ చేశారు. వెరీ కూల్‌ పర్సన్‌. నాకు తెలుగు రాకున్నా ప్రతిదీ చెప్పి నాతో యాక్టింగ్‌  చేయించారు. తెలుగు కూడా చాలా వరకు నేర్పించారు. ఫస్ట్‌ టైమ్‌  నటిస్తూ డైరక్షన్‌ చేశారు. నిజంగా చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. తెలుగులో నటించడం వండ్రఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. అందరూ ఎంతో సపోర్టివ్‌గా ఉంటూ ఎంకరేజ్‌  చేశారు. సీనియర్‌ ఆర్టిస్ట్స్‌ కూడా న టించారు. వాళ్లు కూడా ఎంతో సపోర్ట్‌ చేశారు. అందుకే తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రస్ట్‌ చూపిస్తున్నా.

 


 హీరోయిన్‌గా మీకు ఇన్‌స్పిరేషన్‌?
 సీనియర్‌ హీరోయిన్‌ మధుబాల అలాగే కీర్తి సురేష్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. వీళ్లే నాకు ఇన్‌స్పిరేషన్‌.
 తెలుగులో ఇష్టమైన హీరోలు?
మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం.

 


మీకు ఇష్టమైన పాట?
ఇందులో ‘పిల్లా నాలో నిండిపోయావే’ అనే సాంగ్‌ నాకు చాలా ఇష్టం. అలాగే మదర్‌ సెంటిమెంట్‌ సాంగ్‌ కూడా బావుంటుంది.
సురాపానం హీరోయిన్‌గా మీకు ఎలాంటి గుర్తింపునిస్తుంది అనుకుంటున్నారు?
గ్లామర్‌, పర్ఫార్మెన్స్‌ రెండూ ఉన్న క్యారక్టర్‌ సురాపానంలో చేశాను. కచ్చితంగా ఈ సినిమా నా కెరీర్‌కు ప్లస్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నా.
 ప్రస్తుతం మీరు చేస్తోన్న చిత్రాలు?
  తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో మూవీస్ తో పాటు వెబ్ మూవీస్ లో న‌టిస్తున్నా.