Sudigaali Sudheer Starrer As Hero

Sudigaali Sudheer Starrer As Hero

Sudigaali Sudheer Starrer As Hero, Produced By K Sekhar Raju In Sekhara Art Creations Banner Titled ‘Software Sudheer’

Sudigaali Sudheer who is quite popular with TV shows like Jabardasth, Dhee, Pove Poraa is starring as a hero in a film titled ‘Software Sudheer’ co-starring ‘Raju gari Gadhi’ fame Dhanya Balakrishna as a heroine. ‘Software Sudheer’ which is being made as a full-length family entertainer is produced by Popular Industrialist K.Sekhar Raju in Sekhara Art Creations as production no – 1. Rajasekhar Reddy Pulicharla is debuting as director with this film. Popular actress Indraja, Shayaji Shinde, Posani Krishnamurali will be seen in other important roles. The shoot of the film is going on at a brisk pace. Makers are planning to release the film in July last week.

Hero Sudigaali Sudheer says, ” Everyone is saying that I am the hero in this film. But, Story is the main hero for this film. I got very excited when the director narrated me this story.  Audience treats me like a boy next door. I am very blessed for their love and support for me. I am very happy that I am getting very close to them with this film. I never thought I would work with such popular technicians for my first film. Thanks to Producer and Director for this opportunity.”

Producer K Sekhar Raju says, ” I earned a lot of name and fame in UPVC industry in the last 11 years. I am very passionate about films and while I was looking for a good story, Director Rajasekhar Reddy narrated me this script. He has experience working as a writer for Kona Venkat and for Harish Shankar, Sampath Nandi in Direction department. I launched Sekhara Art Creations banner and introducing him as a director with ‘Software Sudheer’ which is being made as a Production No – 1 in our banner. I am very happy to introduce Sudheer as a hero in this film. I want to give my best for the film and I am not compromising in the quality of the film. Popular actors Dhanya Balakrishna, Indraja, Posani, Shayaji Shinde, Shiva Prasad, Popular technicians Gowtham Raju, Ram Prasad, Ram – Lakshman, Bheems, Sekhar Master are working for this film. Half of the film’s talkie part has completed its shoot. We are planning to release the film in the last week of July.”

Director Rajasekhar Reddy Pulicharla says, ” This is a very good commercial family entertainer. This film has an interesting story along with good comedy with all commercial aspects. This film showcases the lifestyle of software employees along with the challenges they face in their lives. We chose Sudheer as a hero as he has very good comedy timing. ‘Raju Gari Gadhi’ fame Dhanya Balakrishna is playing the heroine. This film has four songs and shooting part of two songs has been completed. Remaining two songs will be shot as montage songs. Bheems has given superb music and is providing terrific background music. Ram Prasad gari cinematography will be eye pleasing. This is a concept-oriented film and Telugu audiences will love it.”

Popular Actress Indraja says, ” I loved the subject narrated by director. More than that, the way the mother sentiment which is depicted made me do this film. Director is handling the film very well. Everyone knows about the comedy timing about Sudheer. He is giving his best for this film. The film carries very good emotion. The shoot is going in a fun mode and I am enjoying working for this film. The film will definitely become a big success.”

Sudigaali Sudheer, Dhanya Balakrishna will be seen as lead pair along with Indraja, Posani krishnamurali, Shayaji Shinde, Shiva Prasad, hema, Vidyullekha, Tarzan in other important roles. 

Editing: Gowtham Raju, Cinematography: Ram Prasad, Music: Bheems Cecerolio, Fights: Ram – Lakshman, Dance: Sekhar master, Publicity Designer: Dhani Aelay, Art Director: Narayana Muppala, Production Executive: Bhikshapathi Thummala, Songs: Suresh Banisetty, Producer: K Sekhar Raju, Story, Screenplay, Dialogues, Direction: Rajasekhar Reddy Pulicharla

 

సుడిగాలి సుధీర్‌ హీరోగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా  ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా,’రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా  శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

హీరో సుడిగాలి  సుధీర్‌ మాట్లాడుతూ – ”అందరూ నన్ను హీరో అంటున్నారు.. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎక్సయిటింగ్‌ గా అనిపించింది. ఇప్పటి వరకూ ఆడియన్స్‌ నన్ను తమ పక్కింటి కుర్రాడిగానే పరిగణిస్తారు. ఇంత తక్కువ టైంలోనే వారి ఆదరాభిమానాలు పొందడం నిజంగా నా అదృష్టం. అలాంటిది ఈ సినిమా ద్వారా వారికి మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాకే ఇంత మంది ప్రముఖ టెక్నిషియన్స్‌తో కలిసి పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.
 
ప్రొడ్యూసర్‌ కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”నేను గత 11 సంవత్సరాలుగా యుపీవిసి వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో 6 నెలల క్రితం రాజశేఖర్‌ రెడ్డి నాకు మంచి కథ వినిపించారు. అలాగే ఆయన కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గాను, హరీష్‌ శంకర్‌, సంపత్‌ నంది దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉండడంతో రాజశేఖర్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి ప్రొడక్షన్‌ నెం-1గా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమాను నిర్మిస్తున్నాను. ఈ సినిమా ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌ లాంటి నటీనటులతో గౌతమ్‌ రాజు, రామ్‌ప్రసాద్‌, రామ్‌ లక్ష్మణ్‌, భీమ్స్‌, శేఖర్‌ మాస్టర్‌ లాంటి ప్రముఖ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ఇప్పటికే యాభై శాతం టాకీ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం” అన్నారు. 

దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ”మంచి కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కామెడీతో పాటు కమర్షియల్‌ పంథాలో సాగే ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీతో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేటి తరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లో ఉండే కష్టసుఖాలు మా సినిమాలో చూపించడం జరిగింది. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కాబట్టి సుధీర్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. అలాగే ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రెండు పాటలు చిత్రీకరణ పూర్తయ్యింది. మిగతా రెండు మోంటేజ్‌ సాంగ్స్‌. భీమ్స్‌ అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తున్నారు. అలాగే రామ్‌ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది” అన్నారు. 

ప్రముఖ నటి ఇంద్రజ మాట్లాడుతూ – ”దర్శకుడు చెప్పిన సబ్జెక్ట్‌ నాకు బాగా నచ్చింది. అంతకు మించి ఒక మదర్‌ సెంటిమెంట్‌ నన్ను ఈ క్యారెక్టర్‌ చేయడానికి ప్రేరేపించింది. అలాగే దర్శకుడు కూడా సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌ కామెడీ టైమింగ్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. షూటింగ్‌ చాలా ఫన్‌గా జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు. 

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో  ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌, హేమ, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు  కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతమ్‌ రాజు, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్‌, మ్యూజిక్‌ : భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, డాన్స్‌: శేఖర్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ఆర్ట్‌ డైరెక్టర్‌: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: సురేష్‌ బనిశెట్టి, ప్రొడ్యూసర్‌: కె. శేఖర్‌ రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల.