సింహాచలంలో శ్రీవేద ఫ్యాషన్స్ ప్రారంభం బిగ్ బాస్ ఫేమ్ హిమజ సందడి
సింహాచలంలో శ్రీవేద ఫ్యాషన్స్ ప్రారంభం బిగ్ బాస్ ఫేమ్ హిమజ సందడి
సింహాచలం, నవంబర్ 25 : సింహాచలంలోని మెయిన్ రోడ్డు దరి శ్రీపైడితల్లి అమ్మవారి గుడి దగ్గర శ్రీవేద ఫ్యాషన్స్ స్టోర్‌ను వైసీపీ నాయకులు ముత్తంశెట్టి మహేష్ బుధవారం ప్రారంభించారు. బిగ్‌బాస్ ఫేమ్ హిమజ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవిత్ర పుణ్య క్షేత్రం సింహాచలంలో స్టోర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలతో పాటు భక్తులకు ఈ స్టోర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
బిగ్ బాస్ ఫేమ్ హిమజ మాట్లాడుతూ శ్రీవరాహా లక్ష్మీనృసింహస్వామి ఆశీస్సులు స్టోర్ నిర్వాహకులపై ఉండాలని అభిలషించారు. ఈ స్టోర్‌లో అన్ని రకాల ఫ్యాషన్ వస్త్రాలు ఉండటం ఒక ప్రత్యేకతన్నారు. శ్రీవేదలో షాపింగ్ చేసుకొని రాబోయే పండగల సంతోషాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలని కోరారు. అందమైన సాగర తీరానికి ఎన్ని సార్లు వచ్చినా రావాలనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ స్టోర్ ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. వర్థమాన సినీ నటి రేఖా భోజ్ మాట్లాడుతూ ఈ స్టోర్ ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవేద మరిన్ని శాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు.
శ్రీవేద ఫ్యాషన్స్ ఎండీ కే నాగరాజు మాట్లాడుతూ సూటింగ్, షర్టింగ్స్ ఇక్కడ లభించునని తెలిపారు. రెడీమేడ్ షర్ట్స్, ప్యాంట్స్‌తో పాటు బెడ్ షీట్స్, దివాన్ కాట్ బెడ్ షీట్స్, డోర్ మేట్స్ ఉన్నాయన్నారు. మహిళల మనసు దోచే కాటన్ శారీస్‌కు ఈ షాపు నిలయమన్నారు. వేదపండితులకు పంచి కండువాలు, దోతీస్, చిన్నారుల దోతీ సెట్స్ ఉన్నాయని తెలిపారు. యువత ఇష్టపడే సంప్రదాయ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని బ్రాండ్స్ ఇన్నర్ వేర్, గార్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. రేమండ్స్, లెనిన్ క్లబ్, ఆరవింద్, రీడ్ అండ్ టేలర్, డోనియర్, బొంబే డయింగ్, రామరాజ్, లెనిన్ వోగ్, సియారామ్స్ ఇక్కడ లభించునని పేర్కొన్నారు. జాకీ, రామరాజ్, దిక్సీ, ఓక్సో, గోకుల్ తదితర ఇన్నర్ వేర్ కూడా లభించునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ఈవో వీ త్రినాథరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లంక సత్తిబాబు, కొలుసు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హిమజ సందడి
బిగ్‌బాస్ ఫేమ్ హిమజ శ్రీవేద ఫ్యాషన్స్ స్టోర్ ప్రారంభానికి వస్తోందని తెలియడంతో ఆమె అభిమానుల్లో కోలాహాలం నెలకొంది. అయితే, కోవిడ్ నిబంధనలు ఉండటంతో అందరూ మాస్కులు ధరించి ఉదయం నుంచి ఆ ప్రాంతంలో బారులు తీరారు. అభిమానులు కేరింతలతో సందడి చేశారు. స్టోర్ ప్రారంభం అనంతరం బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.