Sree Vishnu, Nivetha Thomas ‘Brochevarevarura’ Release On June 28th 

Sree Vishnu, Nivetha Thomas ‘Brochevarevarura’ Release On June 28th 

జూన్ 28న విడుద‌ల‌వుతున్న‌ శ్రీవిష్ణు, నివేథా థామ‌స్ `బ్రోచేవారెవ‌రురా` 

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం `బ్రోచేవారెవ‌రురా` కావ‌డం గ‌మ‌నార్హం. `చ‌ల‌న‌మే చిత్ర‌ము… చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. క్రియేటివ్ నెరేష‌న్‌ను, ఆర్టిస్టిక్ అంశాల‌కు జ‌నాలు ఫిదా అవుతున్నారు. స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ స‌పోర్టింగ్ రోల్స్ చేశారు. వివేక్ సాగ‌ర్ స్వ‌రాలందించారు. 
ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్నారు.`బ్రోచేవారెవ‌రురా` ట్రైల‌ర్, ఆడియో విడుద‌ల గురించి త్వ‌ర‌లోనే నిర్మాత ప్ర‌క‌టించ‌నున్నారు. 
న‌టీన‌టులు:
శ్రీ విష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌
సాంకేతిక నిపుణులు 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌:  విజ‌య్ కుమార్ మ‌న్యం
సంస్థ‌: మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్
సంగీతం:  వివేక్ సాగ‌ర్‌
కెమెరా:  సాయి శ్రీరామ్‌
ఎడిట‌ర్:  రవితేజ గిరిజాల‌
పీఆర్వో:  వంశీ శేఖ‌ర్

 
Sree Vishnu, Nivetha Thomas ‘Brochevarevarura’ Release On June 28th 
‘Brochevarevarura’starring Sree Vishnu and Nivetha Thomas in the lead roles, has confirmed its release date on June 28th.
‘Brochevarevarura’ is written and directed by Vivek Athreya and it is his straight second film with hero Sree Vishnu. The film comes up with the tagline ‘Chalaname Chitramu… Chitrame Chalanamu…’
The teaser got a fantastic response with the narration being creative and artistic.
Satya Dev and Nivetha Pethuraj will be seen in pivotal roles while Priyadarshi and Rahul Ramakrishna are playing supporting role.s. Vivek Sagar is composing music.
‘Brochevarevarura’ has wrapped up the shooting and the post-production works are going. 
Vijay Kumar Manyam is producing ‘Brochevarevarura’ under Manyam Productions banner.
The makers will soon announce the trailer and audio launch dates.

Cast: Sree Vishnu, Nivetha Thomas, Satya Dev, Nivetha Pethuraj, Priyadarshi and Rahul Ramakrishna

Crew:
Writer & Director: Vivek Athreya
Producer: Vijay Kumar Manyam
Banner: Manyam Productions
Music: Vivek Sagar
Cinematography: Sai Sriram
Editor: RaviTeja Girijala
PRO: VamsiShekar