ప్రేమికుల రోజు సందర్భంగా “సొగసు చూడ తరమా” సినిమా టైటిల్ విడుదల
ప్రేమికుల రోజు సందర్భంగా “సొగసు చూడ తరమా” సినిమా టైటిల్ విడుదల
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ మరియు క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “సొగసు చూడ తరమా”. తల్లాడ సాయి కృష్ణ, నక్షత్ర హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కృష్ణ తల్లాడ దర్శకత్వం వహిస్తుండగా తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈరోజు అన్నగా ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సొగసు చూడ తరమా మొదటి ప్రచార చిత్రాన్ని సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేసారు.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ “2016 నుంచి తల్లాడ సాయి కృష్ణ నాకు తెలుసు. సినిమాలు అంటే బాగా ప్యాషన్ తో ఉంటాడు. ప్రతిసారి కొత్త కథ తో కొత్త సినిమాలతో బిజీ గా ఉంటాడు. “సొగసు చూడ తరమా” టైటిల్ బాగుంది. ఈ టైటిల్ చూస్తూనే ఇది ఒక అందమైన ప్రేమ కథ అని అర్థం అవుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి అని తన శుభాకాంక్షలు తెలియజేసారు.
డైరెక్టర్ సాయికృష్ణ తల్లాడ మాట్లాడుతూ “ఇప్పటివరకు నేను స్పెషల్ గా లవ్ స్టొరీ ని డైరెక్ట్ చేయలేదు, కానీ మొదటి సారి స్వచ్ఛమైన ప్రేమకథని తెరకెక్కిస్తునందుకు చాలా సంతోషంగా ఉంది. నా టీం అందరు చాలా కష్టపడి పని చేస్తున్నారు. నిర్మాత తల్లాడ శ్రీనివాస్ కంప్రమైస్ కాకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం అరకు లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది” అని తెలిపారు.
హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ “మా సినిమా టైటిల్ రివిలింగ్ చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. ఈ సినిమా లో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది, ఇంత మంచి టీం తో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది” అని తెలిపారు.
నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మా బ్యానర్లో వస్తున్న ఒక మంచి ప్రేమ కథ చిత్రం “సొగసు చూడ తరమా”. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది అని ఆశిస్తున్నాం” అని అన్నారు.
ఈ సినిమా కి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ :- అశోక్ నిమ్మల,విజయ్,
సంగీతం: వి.ఆర్.ఏ.ప్రదీప్,
కెమేరా: శివ రాథోడ్,
రచన సహకారం: శివ కాకు,రమేష్ కుమార్ వెలుపుకొండ,
పబ్లిసిటి డిజైన్స్ :- రాహుల్,
కో- డైరెక్టర్ :- వివేకానంద విక్రాంత్,
అసోసియేట్ డైరెక్టర్స్:- అను, శివ,
ప్రోడక్షన్ ఇంచార్జ్:- మణి కుమార్,
కాస్టింగ్ డైరెక్టర్:- నాని,
సౌండ్ ఎఫ్ఎక్ట్స్ :- వెంకట్,
లిరిక్స్:-పవన్, సంధ్యవర్షిని, చింతల శ్రీనివాస్, శరత చంద్ర,
పి.ఆర్.ఓ :- పాల్ పవన్