“శుక్ర” మూవీ ప్రెస్ మీట్ !!
“శుక్ర” కొత్త కాన్సెప్ట్ మూవీ, ఖచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చుతుంది –
“శుక్ర” మూవీ టీమ్
మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన
సినిమా “శుక్ర”. సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న
నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న
శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ
సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో
చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత మధుర
శ్రీధర్ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ….ఇట్స్ మై లవ్ స్టోరి చిత్రంతో అరవింద్
కృష్ణను ఇంట్రడ్యూస్ చేశాం. టాలెంట్ ఉన్న నటుడు. చాలా రోజుల గ్యాప్
వచ్చింది అతనికి. ఈ గ్యాప్ తర్వాత మంచి యాక్షన్ ఫిల్మ్ తో మీ
ముందుకొస్తున్నాడు. శుక్ర మూవీని దర్శకుడు సుకు పూర్వజ్ సూపర్బ్ గా
తెరకెక్కించారు. టెక్నికల్ గా చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది.
కాంపాక్ట్ బడ్జెట్ లో చేసిన చిత్రమిది. ఇప్పుడున్న ఛాలెంజింగ్ టైమ్ లో
రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 23న థియేటర్లలో శుక్రను చూడొచ్చు. ఇలాంటి చిన్న
చిత్రాలకు మీ సపోర్ట్ కావాలి. టాలెంటెట్ టీమ్ అంతా కలిసి చేసిన శుక్ర
మూవీ హిట్ కావాలి. అరవింద్ కృష్ణ, దర్శకుడు సుకు, హీరోయిన్, నిర్మాత సహా
యూనిట్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. అన్నారు.
దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ…శుక్ర మూవీ దర్శకుడిగా నాకు ఫస్ట్
ఫీచర్ ఫిల్మ్. గతంలో ఇండిపెండెంట్ మూవీస్, షార్ట్ ఫిలింస్ చేశాను. వాటికి
అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చాయి. నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే
అవార్డ్, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన జగదీశ్ బొమ్మిశెట్టికి
డీవోపీగా పురస్కారం దక్కాయి. చాలా బౌండ్ స్క్రిప్ట్ లు చేసుకున్న తర్వాత
శుక్ర మూవీతో ఫస్ట్ ఫిల్మ్ రూపొందించాను. నాకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన
నిర్మాతలకు థాంక్స్. సినిమా విడుదలకు ఇది సరైన టైమ్ అనుకుంటున్నాం. టాప్
స్టార్స్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఆలోచిస్తే లాభం లేదు. శుక్ర
చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు ముందడుగు వేశాం. మధుర శ్రీధర్
గారు సినిమా చూసి ఆయనకు నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన మాకు
ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేం. అరవింద్ కృష్ణతో చాలా కాలంగా ట్రావెల్
చేస్తున్నా. ఒక డిఫరెంట్ స్టార్ అవ్వాల్సిన నటుడు తను. ఒక కొత్త తరహా
నటనను అరవింద్ లో చూస్తారు. నాయిక శ్రీజిత సినిమా కోసం చాలా కష్టపడింది.
యూట్యూబ్ లో మా సినిమా ట్రైలర్, పాటలు ఉన్నాయి. మీకు ఏమాత్రం కొత్తగా
అనిపించినా థియేటర్ కు వచ్చి సినిమా చూడండి. ఓ కొత్త సినిమా చూసిన
ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. అన్నారు.
నాయిక శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ….దర్శకుడు సుకు గారు నన్ను చూసినప్పటి
నుంచి నేను ఈ క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని పూర్తిగా నమ్మారు. నాకు
తెలుగు రాదు. అదొక్కటే ప్రాబ్లమ్ అయ్యేది. ఈ క్యారెక్టర్ చేసేందుకు సుకు
గారు చాలా సపోర్ట్ చేశారు. అరవింద్ కృష్ణ టాలెంటెడ్ యాక్టర్ అండ్ నైస్
పర్సన్. శుక్ర మూవీ నా తొలి చిత్రం కాబట్టి చాలా స్పెషల్. ఇదొక డిఫరెంట్
మూవీ. డిఫరెంట్ ఎమోషన్ మూవీలో చూస్తారు. అన్ని జాగ్రత్తలతో శుక్ర మూవీ
థియేటర్లో చూడండి. అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ…ఇట్స్ మై లవ్ స్టోరి చిత్రంతో టాలీవుడ్
లో నేను అడుగుపెట్టాను. శుక్ర సినిమాతో గ్యాప్ తర్వాత మీ
ముందుకొస్తున్నాను. ఈ సినిమా నాకు నటుడిగా పునర్జన్మ లాంటింది. ఈ రెండు
సందర్భాల్లో మా గురువు గారు మధుర శ్రీధర్ మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఆయన
అండగా ఉండకుంటే ఇవాళ శుక్ర సినిమా ఇంత చక్కగా రిలీజ్ అయ్యేది కాదు.
పర్సనల్ లైఫ్ తో సినిమాలకు కొంత దూరంగా ఉన్నాను. ప్రొఫెషనల్ బాస్కెట్
బాల్ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నాను. దాంతో నటనకు కొంత దూరం
అవ్వాల్సి వచ్చింది. నాలుగేళ్ల కిందట దర్శకుడు సుకు గారితో పరిచయం
ఏర్పడింది. మీలాంటి హీరోలు మళ్లీ ఇండస్ట్రీకి రావాలని ఆయన నాతో
చెప్పేవారు. మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి మీకు ఇష్టమైతే చేద్దాం అనేవారు.
నాకు అప్పటికి టైమ్ దొరకలేదు. ఈ నాలుగేళ్లలో సుకు గారు నాకు 8 కథలు
చెప్పారు. ఆయనకు నా మీద ఉన్న నమ్మకం నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెంచింది.
నేను మళ్లీ నటించాలనే కోరికను కలిగించింది. సుకు గారి వల్లే నేను మళ్లీ
సినిమాల్లోకి వచ్చాను. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని ఉంది. శుక్ర ఒక న్యూ
ఏజ్ మూవీ. ఈ మధ్య కాలంలో ఓటీటీల వల్ల తెలుగు ప్రేక్షకులకు వరల్డ్ సినిమా
బాగా పరిచయం అయ్యింది. ప్రేక్షకులకు కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కావాలని
కోరుకుంటున్నారు. తెలుగు సినిమా స్టాండర్డ్ ప్రపంచస్థాయికి పెరిగింది.
ఇలాంటి టైమ్ లో నేను తెలుగు సినిమా హీరో అని చెప్పుకునేందుకు
గర్వపడుతున్నాను. శుక్ర సినిమా కూడా ప్రేక్షకులకు కోరుకునే కొత్త టైప్
ఆఫ్ మూవీ. ఇందులో రొమాన్స్ ఉంది, క్రైమ్ ఉంది, లస్ట్ ఉంది. రివెంజ్ ఉంది.
ఇది ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లాంటింది. ఏప్రిల్ 23న శుక్ర సినిమా
చూడండి. అన్నారు.
నిర్మాత తేజ పల్లె మాట్లాడుతూ…ఈ పాండమిక్ టైమ్ లో మమ్మల్ని సపోర్ట్
చేస్తున్న మీడియా మిత్రులకు థాంక్స్. ఈ సినిమాకు నేను నిర్మాతను అనేకంటే
సపోర్టర్ అని చెప్పుకునేందుకు సంతోషిస్తాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ
ఒకరకంగా సినిమాకు నిర్మాతలే అనుకోవచ్చు. వాళ్లంతా చాలా సాక్రిఫైజ్ చేసి
సినిమా కంప్లీట్ అయ్యేలా చేశారు. ఏడాదిన్నరగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని
సినిమాను పూర్తి చేశాం. సినిమా అనుకున్నట్లు వచ్చింది. మీరు చూసి బ్లెస్
చేయాలి. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి మాట్లాడుతూ…దర్శకుడు సుకు పూర్వజ్
తో నాకు ఐదేళ్ల ఫ్రెండి షిప్ ఉంది. డిఫరెంట్ సిట్యూవేషన్ లో శుక్ర
సినిమాను స్టార్ట్ చేశాం. హీరో, నిర్మాతలు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు.
సినిమా కొత్త వే లో సాగుతుంది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
అరవింద్ కృష్ణ, శ్రీజితా గోష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి
ప్రొడ్యూసర్స్ అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె సినిమాటోగ్రఫీ జగదీష్
బొమ్మిశెట్టి, సంగీతం ఆశీర్వాద్, రచన-దర్శకత్వం సుకు పూర్వజ్.