Sensor karyakramallo ‘ninne chustu’ Epril vidudalaku siddham

వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా కె.గోవర్ధన్‌రావు దర్శకత్వంలో హేమలతా రెడ్డి నిర్మాతగా రూపొందిన చిత్రం నిన్నే చూస్తూ. ఈ చిత్రంలో నాటితరం హీరో హీరోయిన్లు సుహాసిని, సుమన్, భాను చందర్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించడం విశేషం.
ఇటీవల వైజాగ్ పరిసరప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకొన్న ఈ చిత్రం సెన్సార్ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది.
నిన్ను చూస్తూ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దాదాపు సినిమా పనులు పూర్తికావొస్తుండటంతో చిత్రం యూనిట్ సభ్యుల సమక్షంలో నిర్మాత హేమలతారెడ్డి టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ “నిన్నే చూస్తూ సినిమా ఒక్క అందమైన ప్రేమకథ చిత్రం. మానవ విలువలతో మనసుకు హత్తుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించిన చిత్రం. మా సినిమా త్వరలోనే సెన్సార్‌కు వెళ్లబోతున్నది. అన్ని పనులు పూర్తి చేసుకొన్న తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేస్తాం అని అన్నారు. ఏప్రిల్‌లోనే ఆడియో ఫంక్షన్ నిర్వహించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
నటీనటులు: నితిన్ (రెండో హీరో ), భాను చందర్, సుమన్, కాశీ విశ్వనాధ్ , సాయాజీ షిండే , రజిత , విద్య లతా, నిహాల్, వేణు, మహేష్ , ఫణి , రమణ్, జ్యోతిరెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.