ఘనంగా ప్రారంభమైన “సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్”
ప్రముఖ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్,హీరో సంపూర్ణేష్ బాబు, రాకేష్ మాస్టర్,ల చేతులమీ దుగా ఘనంగా ప్రారంభమైన “సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్”.
సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి.అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట శిక్షణ ఇచ్చేలా సరికోత్త ఇన్స్ట్యూట్ మనముందుకు వచ్చింది.డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సత్య మాస్టర్ ఇంతకు ముందు సత్య ఫిలిం స్టూడియో, సత్య డి.జోన్స్ ఇన్స్టిట్యూట్ లు పెట్టి ఎంతో మందికి డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. అయితే ఒక్క డ్యాన్స్ కే పరిమితం కాకుండా ట్యాలెంట్ ఉన్న యువతీ, యువకులకు నటనతో పాటు అన్నీ రకాల శిక్షణ ఇచ్చి పరిపూర్ణ నటులను తయారు చెయలనే ఉద్దేశ్యం తో సత్య ఫిల్మ్ అకాడమీ” ప్రారంభోత్సవం సినీ, రాజకీయ అతిరదుల సమక్షంలో “ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రైటర్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు,దర్శకుడు ప్రసన్నకుమార్,నటులు జీవితా రాజశేఖర్, కల్వకుంట్ల తేజస్వి, బీగల గణేష్ గుప్త,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్,హీరో సంపూర్ణేష్ బాబు,రాకేష్ మాస్టర్, జితేంద్ర, రవి, భగవత్ ,రాధా మోహన్, జలదంకి సుధాకర్, కుద్దూస్, శ్యామల రెడ్డి,శివ, ఎం ఎల్ విజయ్,రవి, ,యాంకర్ గీతా బగత్ ఇలా అందరూ వచ్చి సత్య అకాడమీ ఫౌండర్ & CEO సత్య మాస్టర్ కు & టీం కు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ అకాడమీ ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఎంతో మంది నటులను పరిచయం చేస్తూ ఈ అకాడమీ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ టీం అందరికీ అల్ ద బెస్ట్ తెలియజేశారు.అనంతరం జరిగిన పాత్రికేయులు సమావేశంలో
సత్య అకాడమీ ఫౌండర్ & CEO సత్య మాస్టర్ మాట్లాడుతూ.. మా “సత్య ఆకాడమీ”ని బ్లెస్సింగ్స్ చేయడానికి వచ్చిన పెద్దలకు,శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు.భీమవరం లో పుట్టి అక్కడే విద్యాబ్యాసం చేస్తూ కాలేజ్ ఈవెంట్స్ లలో డ్యాన్స్ చేసే వాడిని.నాకు మా అన్న ఇన్స్పిరేషన్. తను చెన్నయ్ సినిమా రంగంలో డైరెక్టన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాడు..తను సపోర్ట్ ఇవ్వడంతో గొప్ప డ్యాన్సర్ అవ్వాలనే కోరికతో నేను విజయవాడలో మస్తాన్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాను అక్కడే నేను శేఖర్ మాస్టర్ ఒకే ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకుని 20 సంవత్సరాల క్రితం మేము హైదరాబాద్ కు రావడం జరిగింది. ఇక్కడ కూడా ముక్కు రాజు, రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాము. ఆ తరువాత డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా చేస్తూ ఎన్నో ఒడిదొడుకులను, కష్టనష్టాలకు ఎదుర్కొన్నాము. ఇండస్ట్రీలో డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసే టైం లో తినడానికి తిండి కూడా దొరికేది కాదు. అయినా ఎంతో కష్టపడి ఈ రంగంలో నిలదొక్కుకోవడం జరిగింది.ఈ క్రమంలో మేము కష్టపడి ఈ స్థాయికి రావడానికి ఆంధ్ర యూనియన్ తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ వారు, చాలా మంది మాస్టార్లు సపోర్టు ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించారు. అప్పట్లో ఎంతోమంది యువతకు టాలెంట్ చూపించుకునే ఆస్కారం ఉన్నా సరైన శిక్షణ లేక అవకాశం దొరికేది కాదు.అది గమనించి వారికి సపోర్ట్ ఇవ్వాలని మేము “సత్య డి.జోన్” డ్యాన్స్ అకాడమీ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్య డీ జోన్ ద్వారా ఎన్నో వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పంపించినందుకు చాలా గర్వపడుతున్నాను.
యాక్టింగ్ నేర్చుకోవాలనే తపన ఉండేటటు వంటి వారు చాలామంది నాకు తారసపడ్డారు వారందరికీ నటనలో సరైన ప్లాట్ఫామ్స్ లేనందున వారికి నటనతో పాటు డ్యాన్స్, ఫిట్నెస్, జుంబా, ఫైటింగ్ ఇలా అల్ ఇన్ వన్ లా అన్నీ ఒకే ఇన్స్టిట్యూట్ లో తగిన బడ్జెట్లో తెలుగులో నేర్పించాలని అందరి సలహాలు తీసుకొని ఇంతకుముందు నేను పెట్టిన సత్య ఫిలిం స్టూడియో, సత్య డి.జోన్స్ కు ఎక్స్టెన్షన్ గా సత్య యాక్టింగ్ అకాడమీ ను పెట్టడం జరిగింది. ఈ.అకాడమీలో ఎంతో నిష్ణాతులైన నంది అవార్డ్ గ్రహీతలైన ప్రొఫెషనల్ ప్రొఫెసర్ ద్వారా స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా అకాడమీలో నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి నటనలో మంచి అవకాశాలు వచ్చేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
యాక్టింగ్ పరంగా సునయన & రామ్మోహన్ గార్లు ఉండగా, డాన్స్ ప్రకారం నా శిష్యులు వుంటారు. అలాగే ఎన్నో అవార్డ్స్ పొందిన గురువులు కూడా యోగా,జుంబా వంటివి కూడా నేర్పించడం జరుగుతుంది. టూరిజం డెవలప్మెంట్ శ్రీనివాస్ గుప్తా, టీజీ వెంకటేష్ గార్లు రాలేకపోయిన వారి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అన్నారు.