Runam movie review rating 3/5

Runam movie review rating 3/5

Runam Movie PRESS MEET

                                      ` రుణం` మూవీ రివ్యూ 
 
నటీ నటులు: గోపికృష్ణ-మహేంద్ర, శిల్ప-తేజు-ప్రియా అగస్టీన్ , ప్రదీప్ ప్రత్తికొండ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : బెస్ట్ విన్ ప్రొడక్షన్
నిర్మాతలు : భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు
మ్యూజిక్ : ఎస్వీ మల్లిక్ తేజ్
కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి
3/5
 
 అచ్చ తెలుగు టైటిల్ తో , ఎలాంటి వల్గారిటీ లేకుండా వచ్చిన సినిమా `రుణం`. నూతన తారాగణం తో కాన్సెప్ట్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ  సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యింది. మరి ఆడియెన్స్ ని ఏ మాత్రం ఎంటర్టైన్ చేస్తుందో  తెలుసుకుందాం…
 
కథ…
అమ్మ నాన్నలే తన సర్వస్వము గా భావించే శ్రీను ( హీరో మహేంద్ర)  , చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన సుధీర్ ( గోపికృష్ణ ) వీరిద్దరూ రూమ్మేట్స్. సుధీర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు… ఆ అమ్మాయి మాత్రం అతన్ని అవసరానికి యూస్ చేసుకుంటుంది.  ఈ విషయం తెలుసుకున్న హీరో డబ్బు లేకపోబట్టే ఇలా జరిగినదని అనుకుని ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకుంటాడు.  డబ్బు ఎలా సంపాదించాడు?  ఆ అర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అన్నది సినిమా. 
 
 
 ఆర్టిస్ట్స్ పెరఫార్మెన్సెస్ …
 గోపికృష్ణ  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా  ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు . అలాగే మిడిల్ క్లాస్ కుర్రాడు గా, తలితండ్రుల పట్ల ప్రేమానురాగాలు కలిగిన కొడుకుగా మహేంద్ర  చాలా సహజం గా నటించాడు.  శిల్ప-తేజు-ప్రియా అగస్టీన్ ముగ్గురు హీరోయిన్స్ తమ పాత్రల  మేరకు  నటించారు. మెయిన్ విలన్ గా  ప్రదీప్ పర్వాలేదనిపించాడు. 
 
సాంకేతిక నిపుణుల పనితీరు …
రొటీన్ స్టోరీ అయినా  స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా డిజైన్ చేసాడు దర్శకుడు.  సినిమాటోగ్రఫీ  కూడా బావుంది. ఇక ఎస్వీ మల్లిక్ తేజ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. పాటలు అన్ని బావు న్నాయి .  సినిమాకు హైలైట్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు . అలాగే  నిర్మాణ విలువలు బావున్నాయి . టెక్నికల్ గా సినిమా చాల గ్రాండ్ గా ఉంది. 
 
 ప్లస్ పాయింట్స్ 
స్క్రీన్ ప్లే 
డైరెక్షన్
సంగీతం 
ఆర్టిస్ట్స్  పెరఫార్మెన్సెస్ 
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ 
 
 మైనస్ పాయింట్స్ 
 రొటీన్ స్టోరీ 
సెకండ్ హాఫ్ లాగ్ 
 
అనాలసిస్ …
గుండ్రెడ్డి శ్రీనివాస్  తన దర్శకత్వ ప్రతిభ తో పాటు పదునైన సంభాషణలతో సినిమాను ఒక స్థాయి లోకి తీసుకెళ్లాడు.   కథ , కథనాలతో పాటు , సన్నివేశాలు , ఫ్రెండ్ షిప్ , సెంటిమెంట్ , కామెడీ  సినిమాకు ప్రాణం పోశాయి.  సినిమా ఓపెనింగే కొత్తగా స్ట్రాట్ అయి  సినిమా పై ఇంటరెస్ట్ పెంచేలా చేసింది.  ముఖ్యం గా  హీరో సుధీర్ అత్యాశకు పోయి తన మిత్రున్ని కోల్పోయి , ఆ మిత్రుడు ఫ్యామిలీ కి హెల్ప్ చేస్తూ తన ఋణం తీర్చుకోవడం అనే లైన్ ఇంప్రెసివ్ గా ఉంది. డైరెక్షన్ తో పాటు  డైలాగ్స్ బావున్నాయి.  సంగీ తం సినిమాకు హైలైట్ గా నిలించింది. నిర్మాతలు కూడా సినిమా కి కథకు మించి బడ్జెట్ పెట్టారు .  బోల్డ్ కంటెంట్ , హారర్ సినిమాలతో విసిగి పోయిన ప్రేక్షకులకు రుణం సినిమా మంచి రిలీఫ్  ఇస్తుంది, ఫ్యామిలీ తో వెళ్లి హాయిగా చూడొచ్చు . 
 
 
సూటిగా చెప్పాలంటే …`రుణం` చూడాల్సిన  తరుణం