Runam movie press meet
రుణం” ప్రీ రిలీజ్, ఆడియో సక్సెస్‌మీట్
బెస్ట్‌విన్ ప్రొడక్షన్ బ్యానర్ పై భీమినేని సురేష్, జి.రామకృష్ణారావుసంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరి స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. గోపికృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్లో ఏర్పాటు చేసిన ఆడియో సక్సెస్ మీట్ లో ..
ప్రొడ్యూసర్ జి. రామకృష్ణారావు మాట్లాడుతూ… ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. డైరెక్టర్‌గారు చాలా టైటిల్స్‌ను వెతికి మరీ ఈ కథకు అనుగుణంగా ఉండే రుణం టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. ఇద్దరి స్నేహితుల ఫ్యామిలీల మధ్య నడిచే కథ. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌గారు ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు. నేను ఎన్నో సినిమాలు చూశాను కాని ప్రొడ్యూస్ చెయ్యడం మొదటిసారి. మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. డిఓపి కూడా చాలా కష్టపడ్డారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ వారి వారి పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు నాకు అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
ప్రొడ్యూసర్ భీమినేని సురేష్ మాట్లాడుతూ… మా చిత్ర యూనిట్ అందరికీ నా కృతజ్ఞతలుఅన్నారు. ఏప్రిల్ 12న విడుదల కాబోతుంది. మా యూనిట్ అందరికీ నేను రుణ పడి ఉన్నాను. వచ్చే నెలలో ఇదే టీమ్ తో మరో చిత్రం స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే యూనిట్‌కి మరో ఛాన్స్ ఇస్తాం అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.వి.మల్లిక్ తేజ మాట్లాడుతూ… రుణం శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 12న విడుదల కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కొత్తవాడినని కూడా చూడకుండా నన్ను ఆదరించిన దర్శకనిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కథతోపాటు నా జర్నీ సాగింది. ఎప్పుడూ డైరెక్టర్‌తోనే ఉండేవాడిని. చిన్న సినిమా అని చూడకుండా మమ్మల్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ ఎస్.గుండ్రెడ్డి మాట్లాడుతూ… నేను గతంలో కన్నడలో ఐదు చిత్రాలు చేశాను. రైటర్‌గా నా కెరీయర్ని మొదులుపెట్టి ఎన్నో సీరియల్స్ రాశాను. తెలుగు, కన్నడకు చేస్తూ ఉండగా ఇప్పుడు డైరెక్టర్‌గా మారాను. నా సినిమాలో ఎక్కడా అశ్లీలత అనేది ఉండదు. ఎవరికీ సందేశమివ్వాలనే ఉద్దేశంతో చెయ్యలేదు. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రుల మీద, వారి బంధాలు బాంధవ్యాలు ఇంట్లో జరిగే చిన్న చిన్న అపార్ధాల మధ్య కొనసాగుతుంది. ఈ చిత్రం చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ అన్నీ పోతాయి. సెన్సార్ కూడా పూర్తయింది. ఇది చాలా పెద్ద మూవీగా తీసుకొస్తున్నాము. మా ప్రొడ్యూసర్లు ఇద్దరు మమ్మల్ని చాలా బాగా చూశారు. హీరోగా చేసిన గోపికృష్ణ కన్నడలో చేశారు. ఇప్పుడు తెలుగు కి వచ్చారు. మీరందరూ మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరో మహేంద్ర మాట్లాడుతూ… ఏప్రిల్12న మీ ముందుకు రాబోతుంది. డైరెక్టర్‌గారు ఆయన నిజ జీవితంలో జరిగిన కథను ఆధారంగా తీసుకుని చేశారు. కాని ఇది కేవలం ఆయన జీవితం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది. మనం చేసే పనుల వల్ల మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అన్న మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. అందరూ ఆదరించాని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో గోపికృష్ణ మాట్లాడుతూ… ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని రకాల హంగులతో ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగే రియల్ స్టోరీ ఇది. ఏప్రిల్ 12న విడుదలకాబోతుంది. అందరూ ఆదరించాలి. ప్రొడ్యూసర్లు ఇద్దరూ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది అన్నారు.
హీరోయిన్ ప్రియా మాట్లాడుతూ… ఈ చిత్రంలో నటించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా ప్రొడ్యూసర్లు ఇద్దరూ చాలా మంచివారు. ఇది కేవలం మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంమే కాదు ఎక్కడా అశ్లీ లత అనేదే ఉండదు. మేము ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టాలు పడ్డాము. మీ అందరికీ తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. దయచేసి రివ్యూస్ చూసి సినిమాని జడ్జ్ చేయవద్దు. అదే విధంగా 11న అందరూ వెళ్ళి తమ ఓట్ హక్కును వినియోగించుకోండి అని అన్నారు.
విలన్ ప్రదీప్ పత్తికొండ మాట్లాడుతూ… ఈ సినిమాలో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరు ఎవరికి రుణపడి ఉంటారు అన్నది కథ. మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. మా డైరెక్టర్‌గారికి సినిమా అంటే పిచ్చి, మా ప్రొడ్యూసర్‌గారికి ప్యాషన్ ఇవి రెండూ కలిస్తేనే ఈ సినిమా. ఏప్రిల్ 12న విడుదకాబోతుంది మీరందరూ తప్పకుండా ఆదరించాలి అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన ఆర్టిస్టు నారాయణ, మహేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.