Rangupaduddi movie review rating 3/5

Rangupaduddi movie review rating 3/5

 

 

   `రంగుప‌డుద్ది` రివ్యూ

న‌టీనటులుః అలి, ర‌ఘుబాబు, హీన‌, ధ‌న్ రాజ్ , జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, షేకింగ్ శేషు, సుమ‌న్ శెట్టి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులుః
బేన‌ర్ః మ‌నీషా ఆర్ట్స్
స‌మ‌ర్ప‌ణః కిషోర్ రాఠి
క‌థ-నిర్మాత : మహేష్ రాఠి
డైలాగ్స్: అభయ్ శ్రీ జయ్
మ్యూజిక్: సుభాష్ ఆనంద్
ఎడిటర్: నందమూరి హరి
డిఓపి: జి. ఎస్. రాజ్ (మురళి),
నిర్మాత: మహేష్ రాఠి
డైరెక్టర్: ఎస్. శ్యామ్ ప్రసాద్.

రేటింగ్ః 3/5

మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో బ్లాక్ బస్టర్ అయిన `ఘటోత్కచుడు` చిత్రంలో ఫేమస్ అయిన `రంగుపడుద్ది` డైలాగ్ నే టైటిల్ గా పెట్టి మళ్లీ ఇదే బ్యానర్ లో ఓ మంచి కామెడీ హారర్ ను తెరకెక్కించారు మనీషా ఫిలిమ్స్ బ్యానర్ వారు. మౌన‌మేలనోయి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్యామ్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మ‌రి టైటిల్, ట్రైల‌ర్స్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఈ శుక్ర‌వారం విడుదలైంది. మ‌రి సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి రెస్సాన్స్ వ‌స్తుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరి విష‌యానికొస్తే…
గ‌తంలో చేసిన మిస్టేక్ వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌న్నా బాధ‌తో ఉన్న అలీ, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, షేకింగ్ శేషు, అలాగే ఫ్యూచ‌ర్ లోకి వెళ్లి అంతా తెలుసుకుని ఈ లోకాన్ని ఏలేయాల‌ని అన‌కునే మ‌రో ముగ్గురు వ్య‌క్తులు ధ‌న్ రాజ్, సుమ‌న్ శెట్టి, హీన ఈ ఇద్ద‌రి గ్యాంగ్ మ‌న‌స్త‌త్వాలు తెలుసుకున్న అయ్య‌ర్ అనే సైంటిస్ట్ వీరి ని ట్రైమ్ ట్రావెల్ ద్వారా పాస్ట్ లోకి , ఫ్యూచ‌ర్ లోకి తీసుకెళ‌తాను…కానీ బ్లాక్ హోల్స్ ఓపెన్ అయిన‌ప్పుడే అది కుదురుతుంది అని చెబుతాడు. అమావాస్య రోజు ఒక పాడు ప‌డ్డ రాజ‌మ‌హ‌ల్ లోకి ర‌మ్మ‌ని చెబుతాడు. ఆ మ‌హ‌ల్ కి వెళ్లి ఈ ఇద్ద‌రి గ్యాంగ్ కి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? మ‌రి ట్రైమ్ ట్రావెల్ ద్వారా పాస్ట్ లోకి వెళ్లారా? లేదా? అస‌లు ఆ బంగ్లా నుంచి ఎలా బ‌య‌పడ్డారు అన్న‌ది మిగ‌తా క‌థాంశం.

ప్ల‌స్ పాయింట్స్
న‌టీన‌టులు
రాజ‌మ‌హ‌ల్ లో కామెడీ
సినిమాటోగ్ర‌ఫీ
నిర్మాత‌ల మేకింగ్
ద‌ర్శ‌కుడి టేకింగ్

మైన‌స్ పాయింట్స్
సినిమా మొత్తం
రాజ్ మ‌హ‌ల్ లో ఉండ‌టం
క్లైమాక్స్ లో క‌న్ క్లూజ‌న్ లేక‌పోవ‌డం

విశ్లేష‌ణః
హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రాలు ఇటీవ‌ల కాలంలో చాలా వ‌చ్చాయి. ముఖ్యంగా ఒక బంగ్లాకు తీసుకెళ్లి ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ భ‌య‌పెడుతూ న‌వ్వించ‌డం. ఇవ‌న్నీ కామ‌న్ అయినా కానీ, సీనియ‌ర్ క‌మెడియ‌న్ అలీ, ధ‌న్ రాజ్, జ‌బ‌ర్త‌స్ తో మెప్పించిన షేకింగ్ శేషు, జ‌బ‌ర్త‌స్ అప్పారావు లాంటి క‌మెడియ‌న్స్ ప‌డ‌టంతో వారి క్యార‌క్ట‌ర్స్ తో న‌వ్వులు పూయించారు. అంద‌రూ కామెడీ పండించ‌డంలో సిద్ధ‌హ‌స్తులు కావ‌డంతో వాళ్లు భ‌య‌ప‌డుతూ ఆడియ‌న్స్ న‌వ్వించారు.
ఎన్నో గొప్ప చిత్రాల‌ను నిర్మించిన కిషోరాఠీ హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రంతో చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చి రాజీ ప‌డ‌కుండా నిర్మించ‌డ‌మే కాకుండా ఒక స‌క్సెస్ ఫుల్ సినిమాను నిర్మించారు అన‌డంలో సందేహం లేదు. సినిమా స్టార్టింగ్ లో ఏదో అనిపించినా రాజ్ మ‌హ‌ల్ కి వెళ్లాక సినిమా ఇంట్ర‌స్ట్ ని క్రియేట్ చేస్తుంది. రెండు బ్యాచ్ లు ఒకరికొక‌రు దెయ్యం గ్యాంగ్ అంటూ భ‌య‌ప‌డ‌టం , వారిని త‌ప్పించుకుని ఆ బంగ్లా నుంచి బ‌య‌ట‌ప‌డాలన్న క్ర‌మంలో ఆ క్యారక్ట‌ర్స్ ప‌డే భ‌యం అంద‌ర్నీ క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. ద‌ర్శ‌కుడు టైమ్ ట్రావెల్ అనే ఒక పాయింట్ తీసుకుని దాని చుట్టు ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ని అల్లుకున్నాడు.సినిమాటో గ్ర‌ఫీ, సంగీతం బాగా కుదిరాయి. కాకుంటే క్లైమాక్స్ అర్థాంత‌రంగా ముగిస్తూ పార్ట్ టూ అని వేయ‌డంతో ప్రేక్ష‌కులు కొంత ఏదో ఉంది తెలుసుకోవాల‌న్న వారి ఎగ్జైటింగ్ కి ఫుల్ స్టాప్ ప‌డ‌టంతో కాస్త నీరుగారిపోతారు.

సూటిగా చెప్పాలంటేః బోల్డ్ కంటెంట్ తో సినిమాలు వ‌స్తోన్న ఈ త‌రుణంలో మ‌రో సారి హ‌ర్ర‌ర్ కామెడీ వ‌చ్చి క‌డుపుబ్బ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసింది. ఎక్క‌డా బోర్ లేకుండా హాయిగా కాసేపు భ‌య‌ప‌డుతూ, నవ్వుతూ కాల‌క్షేపం చేయాల‌నుకుంటే `రంగుప‌డుద్ది` ఫ్యామిలీ అంతా క‌లిసి చూడ‌వచ్చు.

పైన‌ల్ గాః న‌వ్వుల రంగు