గ్రాండ్ గా ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !!
‘రంగ్ దే’ జీవితంలోని ఏడురంగులను చూపిస్తుంది
– సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
గ్రాండ్ గా ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక కన్నుల పండుగగా జరిగింది. చిత్ర నాయకా,నాయికలు నితిన్, కీర్తి సురేష్, సుప్రసిద్ధ నిర్మాత, హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత సుధాకర్‌రెడ్ది, నిర్మాత ఠాగూర్ మధు,చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి,సీనియర్ నటుడు వీకే నరే్‌ష్, రోహిణి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీమణి, గాయని మంగ్లీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘రంగ్ దే’ జీవితంలోని ఏడురంగులను చూపిస్తుంది
– సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘‘అన్ని జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. అలాగే జంతువులకు ఏ వస్తువైనా బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తుంది. మనుషులకు మాత్రమే ఏడురంగులను చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది. సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఇందులో నాకు బాగా నచ్చిన పాత్రలు అర్జున్, అను. ఎలాంటి సందర్భంలో అయినా ఓ మంచి పాటను తీసుకురాగలిగే సత్తా దేవిశ్రీ ప్రసాద్‌కు ఉంది. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో దేవీ కూడా ఒకరు. ఇందులో ‘ఊరంతా చీకటి’ పాట థియేటర్‌లో చూస్తే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతాయి’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలకు నేను సంగీతం అందించాలి. మ్యూజిక్ టూర్స్‌లో ఉండడం వల్ల డేట్స్ కుదరలేదు. ఈ సినిమా గురించి ఫ్లైట్‌లో కలిసినప్పుడు ఓ గంట కథ చెప్పారు. అలా ‘రంగ్ దే’ కుదిరింది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ స్టోరీ ఇది. నితిన్ చేసిన సినిమాల్లో డిఫరెంట్ సినిమా ఇది’’ అని అన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘‘నితిన్, కీర్తి ఈ కథ అంగీకరిస్తారని అనుకోలేదు. అర్జున్, అను పాత్రలకు ప్రాణం పోశారు. మేం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. లాక్‌డౌన్‌లో నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేనిది. దేవిగారిని ఓ ఫ్యాన్‌గా కలిశా. ఆయన మాత్రం నాకు ఫ్రీడమ్ ఇచ్చి కావలసినట్లు సంగీతం ఇచ్చారు. పీసీ శ్రీరామ్‌గారు సినిమా అంగీకరించడం నా అదృష్టం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్, అభినవ్ కామెడీ చక్కగా పండుతుంది. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు ఇచ్చిన సపోర్ట్ మరువలేను’’ అని అన్నారు.
సీనియర్ యాక్టర్ నరేష్ మాట్లాడుతూ ‘‘ఒక్క ట్రైలర్.. రెండు డైలాగ్‌లతో వందకు పైగా మెసేజ్‌లు వచ్చాయి. అంతగా ప్రేక్షకుల్ని ట్రైలర్ ఆకట్టుకుంది. దీన్ని బట్టి వెంకీ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేశారో తెలుస్తుంది. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్‌తో బ్యూటిఫుల్ కాక్‌టైల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నితిన్ తప్ప మరెవరూ ఈ సినిమాకి సూట్‌కారు. కీర్తి దక్షిణ భారతదేశం గర్వంచదగ్గ నాయిక’’ అని అన్నారు.
నటి రోహిణి మాట్లాడుతూ ‘‘రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని సెలక్టివ్ సినిమాలు చూడాలనుకుంటాం. ఆ కోవకు చెందిన సినిమా ఇది. ప్రేమకథని పీసీ శ్రీరామ్ చూపించినంత అందంగా ఎవరూ చూపించలేరు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. అను పాత్రను కీర్తి తప్ప ఎవరూ చేయలేరు’’ అని అన్నారు.
గేయ రచయిత శ్రీమణి మాట్లాడుతూ ‘‘తొలిప్రేమ నుంచి వెంకీ అట్లూరితో జర్నీ చేస్తున్నా. పాటలకు ఆయనిచ్చే సందర్భాలు బావుంటాయి. అందుకే చక్కని సాహిత్యం అందించగలిగా. ఇందులో అన్ని పాటలు నేనే రాశా. ‘జులాయి’ సినిమా నుంచి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో ట్రావెల్ చేస్తున్నా. మంచి అవకాశాలిచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న నాగవంశీగారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.
హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘‘అను పాత్ర చేయగలనని నమ్మిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో నా మూడో సినిమా ఇది. హ్యాట్రిక్ అవుతుందని ఆశిస్తున్నా. నితిన్‌తో నా కెమిస్ట్రీ బావుంటుంది’’ అని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు: నితిన్
నితిన్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నా వయసు 24 ఏళ్లు. నిజంగా నా వయసు 36 ఏళ్లు. దర్శకుడు కథ చెప్పినప్పుడు నా వయసుని జనాలు అంగీకరిస్తారా అన్న అనుమానం వచ్చింది. పీసీ శ్రీరామ్ డిఓపీ అనగానే ఆయన బాగా చూపిస్తారనే నమ్మకంతో ధైర్యం వచ్చింది. ‘ఇష్క్’ తర్వాత ఆయనతో మరోసారి పని చేయడం హ్యాపీగా ఉంది. డీఎస్‌పీ డైమండ్స్ లాంటి పాటలిచ్చారు. కీర్తి సురేశ్ అనగానే ‘మహానటి’ గుర్తొస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఆమె మహా నాటు, మహా నాటీ. ఈ కథకు ఆమె పెద్ద ఎసెట్. దర్శకుడితో పన్నెండేళ్ల పరిచయం ఉన్నా మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికి కుదిరింది. చాలా సెన్సిబుల్‌గా ఈ కథను తెరకెక్కించాడు. ఈ బ్యానర్‌లో మూడో సినిమా ఇది. నేను ఫ్లాప్‌లో ఉన్న ప్రతిసారీ ఈ బ్యానర్ హిట్ ఇస్తుంది. సెంటిమెంట్‌గా చూస్తే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు. ఈ ఇద్దరూ నా వెనకున్నారు. అదే నా ధైర్యం అదే నా దమ్ము’’ అని అన్నారు.
‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.
ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
Youth star Nithiin and Keerthy Suresh starrer ‘Rang De’ is gearing up for release on March 26th. The film is written and directed by Venky Atluri while produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner. The Pre-Release Event of ‘Rang De’ was held in a grand style at Shilpa Kala Vedika. Star director Trivikram Srinivas graced the event as chief guest.
Speaking on the occasion, Ace Director Trivikram said, “Humans are the only living beings who can smile and see all the colours. We are the lucky ones and ‘Rang De’ will be like a rainbow. I’ve watched the film and I really liked it. Nithiin is like my brother and I always wish him success. Nithiin and Keerthy are playing Arjun and Anu respectively which is indirectly ‘A.. Aa.’ Devi Sri Prasad is one of my favourite music composers and I’ve immense respect for musicians who have classical background. There is a particular song in this movei ‘Oorantha Cheekati’ and it will certainly make the audiences weep in the theatres.”
Music director Devi Sri Prasad said, “I was supposed to compose music for director Venky’s ‘Tholi Prema’ and ‘Mr. Majnu.’ I was on an overseas tour and so it did not work out. I’m glad that I’ve finally collaborated with Venky. I heard ‘Rang De’ script in a flight and this is a matured love story cum youthful entertainer. It will be a different film in Nithiin’s career.”
Director Venky said, “I never imagined that Nithiin and Keerthy would accept this film. They breathed life in the roles of Arjun and Anu. Now we three have become best friends. The support I received from the producers during the lockdown period is unforgettable one. I met DSP as a fan but he gave me extraordinary music. It’s a blessing for this film to have legendary PC Sreeram and to all the artists and technicians, I thank you. Last but not least, director Trivikram’s encouraging words after watching ‘Rang De’ relieved me.”
Actress Keerthy Suresh said, “I thank the director and producers for believing in me that I can do the role of Anu. This is my third film in Devi Sri Prasad’s musical and I hope we score a hat-trick. The chemistry between me and Nithiin in ‘Rang De’ worked out quite well.”
Actor Naresh said, “I received hundreds of messages after the trailer was launched. This shows the response to the trailer and Venky has handled the film efficiently. ‘Rang De’ is a cocktail of emotions, entertainment and romance. None can fit in the role of Arjun except Nithiin and Keerthy is pride of South Indian cinema.”
Character artist Rohini said, “This film falls in that category when we would want to sit back and relax and watch a pleasant movie. Nobody can show love story as beautiful as PC Sreeram and ‘Rang De’ is a striking love story. Anu role can only be done by Keerthy.”
Lastly hero Nithiin addressed the event. “In this film my age is 24 but my actual age is 36. I was in doubt but when I heard that PC Sreeram is doing the cinematography, I gained confidence and courage. Happy to be working with him after ‘Ishq.’ DSP gave fantastic music and all the songs released so far have garnered superb response. Keerthy always reminds of ‘Mahanati’ but in this film she is too naughty. She is a big asset for this film. I know director Venky for the past 11 years yet it took long for us to work together. This is a sensible subject and was handled well. ‘Rang De’ is my third film in Sithara Entertainments banner. Whenever I score a flop, this banner gives me the much needed success. If reckoned as sentiment, ‘Rang De’ will definitely score a hit. In the industry, Pawan Kalyan and Trivikram are my pillars of support. They are my strength.”
Rang De Pre-Release event was also graced by producers S Radha Krishna (Chinababu),