రాక్షసుడు` మూవీ రివ్యూ!!
నటీనటులుః
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, వినోదిని వైధ్యనాథ్, సుజన జార్జ్ , కాశీ విశ్వనాథ్ తదితరులు
రచన: సాగర్
ఆర్ట్: గాంధీ నడికొడికర్,
కెమెరా: వెంకట్ సి.దిలీప్
సంగీతం: గిబ్రాన్,
నిర్మాత: సత్యనారాయణ కొనేరు
దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స
రేటింగ్ః 3/5
`అల్లుడు శీను` చిత్రంతో హీరోగా ఇంటర్ డ్యూస్ అయిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ సినిమా మినహా తను చేసిన సినిమాలన్నీ పెద్దగా ఆడలేదు. దీంతో ఇక పంథా మార్చి తమిళంలో సక్సెస్ సాధించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ `రాక్షసన్` చిత్రాన్ని తెలుగులో `రాక్షసుడు` పేరుతో రీమేక్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
రవి (సాయి శ్రీనివాస్) కి మూవీ డైరక్టర్ అవ్వాలన్నది కోరిక. సీరియల్ కిల్లర్ పై ఓ కాన్సెప్ట్ రెడీ చేసుకుని చాలా మంది ప్రొడ్యూసర్స్ ని కలుస్తాడు. కానీ, వెళ్లిన ప్రతి చోట రిజక్ట్ అవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న బాధ్యతల వల్ల రవి మదర్ ఉద్యోగం చేరాలని ఫోర్స్ చేస్తుంది. రవి ఫాదర్ అలాగే బావ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ కి చెందిన వారు కావడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరతాడు. ఈ క్రమంలో ఒక మర్దర్ జరుగుతుంది. ఆ మర్డర్ కి ఇంత కు ముందు కి జరిగిన మర్డర్ కి దగ్గర పోలికలు ఉండటంతో ….అప్పటి వరకు రవి సినిమా తీయాలని సైకోల గురించి కలెక్ట్ చేసుకున్న పేపర్ కటింగ్స్ తో ఇదంతా ఓ సైకో చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంతలో రవి మేనకోడలు కనపడుకుండా మిస్ అవుతుంది. ఆమె కోసం ఎంత ప్రయత్నించినా దొరకదు. ఆమెను కూడా అతి కిరాతకంగా చంపేస్తాడు ఆ సైకో. అసలు ఆ సైకో ఎవరు? ఎందుకిలా వరుసగా స్కూల్ గాళ్స్ ను మర్డర్ చేస్తున్నాడు. చివరకు రవి సైకోను ఎలా పట్టుకుని మట్టు పెట్టాడు అన్నది మిగతా స్టోరి.
నటీనటుల పర్ఫార్మెన్స్ః
ఇంత వరకు కమర్షియల్ యాక్షన్ మూవీస్ తో ఒకే విధమైన పర్ఫార్మెన్స్ కనబరిచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేసాడనడంతో సందేహం లేదు. ఒక యాస్పరెంట్ డైరక్టర్ గా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ , హావభావాలు పలికించాడు. అలాగే స్కూల్ టీచర్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా ట్రెడిషినల్ గా కనిపిచింది. అలాగే రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తన పాత్రకు జెస్టిఫై చేశాడు. ఇక ఒరిజినల్ లో చేసిన వినోదిని వైద్యనాథన్, వినోద్ సాగర్, సుజన జార్జ్ వారి వారి పాత్రలను మరోసారి పండించారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోదగిన వారిలో ముందుండే వ్యక్తి సంగీత దర్శకుడు గిబ్రాన్ తన అద్భతమైన నేపథ్యం సంగీతంతో సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాడు. అలాగే సినిమాటోగ్రఫీ తో పాటు డైరక్టర్ ఒరిజినల్ సినిమాను మక్కీకి మక్కీ దించడంలో సక్సెస్ అయ్యాడు. తమిళ ఫ్లేవర్ ని ఏ మాత్రం మిస్ చేయలేదు. ఇక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ సినిమాను నిర్మించారు.
ప్లస్ పాయింట్స్
స్టోరి , స్క్రీన్ ప్లే
నేపథ్య సంగీతం
ఇన్వెస్టిగేషన్ సీన్స్
నటీనటుల హావభావాలు
ఇంట్రవెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
ఫ్రెష్ సీన్స్ లేకపోవడం
లవ్ ట్రాక్
మక్కీకి మక్కీ దించడం
విశ్లేషణః
ఫస్ట్ సీన్ తోనే కథలోకి తీసుకెళతాడు రాక్షసుడు. స్కూల్ విద్యార్థిని మర్డర్ తో ప్రారంభం అవుతుంది సినిమా. ఇక మరో మర్డర్ జరగబోతుండగా కట్ అంటూ ఓ ట్రాలీలో పరిచయమవుతాడు హీరో. అప్పుడు తెలుస్తుంది రెండో మర్డర్ కాదు సినిమా షూటింగ్ అని. ఈ విధంగా హీరో సినిమా డైరక్టర్ అని అర్థమవుతుంది. సాయి శ్రీనివాస్ గత సినిమాల్లో బిల్డప్ సీన్స్ తో కాకుండా సింపుల్ గా పరిచయం చేసిన విధానం బావుంది. డైరక్టర్ అవ్వాలని చేసిన ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని విఫలమవడంతో ఇంట్లో పరిస్థితుల వల్ల అయిష్టంగానే పోలీస్ జాబ్ లో చేరతాడు రవి. ఇక అక్కడ తను ఎలాంటి ఇన్విస్టిగేషన్ సినిమా చేయాలనుకుంటాడో అలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతుంటాయి. ఇక దీంతో సినిమా కోసం కలెక్ట్ చేసిన పేపర్ కటింగ్స్ అన్నీ తనకు మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ కోసం ఉపయోగపడుతుంటాయి. నిజంగా ఈ థాట్ దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. సినిమా దర్శకుడు పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో చూపించాడు. ఇక సీరియల్ కిల్లర్ కోసం జరిగే ఇన్వెస్టిగేషన్ యడ్జ్ ఆఫ్ ది సీట్ అన్నట్టు ఆడియన్స్ ను థ్రిల్ కి గురి చేస్తుంటది. సాయి శ్రీనివాస్ ఒక హీరోలా కాకుండా ఒక ఇన్వెష్టిగేషన్ ఆఫీసర్ గా మాత్రమే కనిపంచాడంటే ఆ పాత్రలో తను ఎంత లీనమై నటించాడో అర్థమవుతుంది. అలాగే అనుపమ , సాయి శ్రీనివాస్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది కానీ లవ్ సీన్స్ ఇంకా ఫ్రెష్ గా ఉంటే బావుండేది అనిపించింది. క్యూరియాసిటీ తో ఇంటర్ వెల్ వేసిన దర్శకుడు సెకండాఫ్ ని చాలా థ్రిల్లింగ్ గా నడిపించాడు. ముఖ్యంగా సైకో క్రిష్టో ఫర్ ఫ్లాష్ బ్యాక్ , తను సైకో గా మారడానికి గల రీజన్స్ , తను స్కూల్ గాళ్స్ ని ఎందుకు క్రూరంగా చంపుతున్నాడన్నా అంశాలన్నీ కూడా ఇంట్రస్టింగ్ గా, కన్వెన్సింగ్ గా ఉన్నాయి. సెకండాఫ్ లో వచ్చే ఇన్వేస్టిగేషన్ సీన్స్ సినిమాకే హైలెట్, ఇక గిబ్రాన్ మ్యూజిక్ ఒక మ్యాజిక్ చేసిందనడంలో సందేహం లేదు. ఇక దర్శకుడు రమేష్ వర్మ కాపీ పేస్ట్ లా ఒరిజినల్ ని ఏ మాత్రం మిస్ చేయకుండా సినిమా తీయడంలో సక్సెస్ అయ్యాడు కానీ, ఏ మాత్రం ఫ్రెష్ సీన్స్ కానీ, ఇంకా కొత్తగా , బెటర్ గా తీయడానికి ప్రయత్నించలేకపోవడం సినిమాకు మైనస్ అనే చెప్పాలి. ఇక సాయి శ్రీనివాస్ చెప్పినట్లు తనకు మంచి కెరీర్ ఈ సినిమాతో స్టార్ట్ అయినట్టే. తన ఖాతాలో ఫస్ట్ టైమ్ ఒక సక్సెస్ ఫుల్ సినిమా పడినట్లే. టెక్నీకల్ గా, పర్ఫార్మెన్స్ పరంగా రాక్షసుడు యడ్జ్ ఆఫ్ ది సీట్ నుంచి చూడదగ్గ చిత్రమే. సైకో థ్రిల్లర్స్ చిత్రాలను ఇష్టపడే వారికి అమితంగా నచ్చే చిత్రం.