ప్రిన్స్ ది ఫైట‌ర్ మూవీ రివ్యూ

ప్రిన్స్ ది ఫైట‌ర్ మూవీ రివ్యూ


ప్రిన్స్ ది ఫైట‌ర్ మూవీ రివ్యూ
ట్యాగ్‌లైన్ రైజ్ ఆఫ్ ఎ రియల్‌స్టార్
బ్యానర్ : పీజే క్రియేటివ్ వర్క్స్
నిర్మాత : జగదీష్ పల్లి
రచన , దర్శకత్వం : PJ
కెమెరా : ఆర్యన్
మ్యూజిక్ : స్వర పవన్
ఛాయాగ్రహణం: ఆర్యన్
ఎడిటర్ : M.A.MALIK
ఫైట్ మాస్టర్ కొరియోగ్రాఫర్ : శంకర్ వుయ్యల కపిలకుల
ఆర్ట్: రవి
నటీనటులు : రవి కిరణ్, అవంతిక, యోగి ఖత్రి, శాండీ, బంటి , చైతన్య, యోగి, గబ్బర్ సింగ్ అంతాక్షరి గ్యాంగ్, తదితరులు ..
విడుదల తేదీ 29-10-2021
రేటింగ్ : 3 / 5

న్యూ టాలెంట్ తో వ‌చ్చిన చిత్రం `ప్రిన్స్ ది ఫైటర్. యాక్షన్ అంశాల కలయికలో లవ్, ఎమోషన్, దాంతో పాటు సామజిక సమస్యల నేపథ్యంలో జగదీష్ పల్లి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. మరి ప్రిన్స్ ఎవరు ? ఆ ఫైటర్ కథేంటి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

స్టోరిః

హీరో ప్రిన్స్ (రవి కిరణ్) నగరంలో తన స్నేహితులతో కలిసి ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు మరియు అతను సినిమా హీరో కూడా. అతను ఓ సారి అనుకోకుండా హీరోయిన్ ప్రియా (అవంతిక) ను చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ సందర్భంలో అనుకోకుండా ఓ గొడవ జరుగుతుంది. అలా ప్రిన్స్ హీరోయిన్ ని ప్రేమలో పడేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసాడు, ఫైనల్ గా ఆమె ఇతని ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ సోదరుడు తన చెల్లి ని ప్రేమిస్తున్నావా అంటూ హీరోతో గొడవపడతాడు. ఒక ఈవెంట్ సమయంలో ఆర్టిస్ట్ అయిన హీరో పర్సనల్ అసిస్టెంట్, ఆమె తన డ్రెస్ మార్చుకుంటున్న సందర్భంలో ఒక రాజకీయ నాయకుడి కొడుకు మొబైల్‌లో చిత్రీకరిస్తాడు. అంతే కాకుండా అతను ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తాడు, అమ్మాయి ఈ విషయాన్ని హీరోకి చెప్పడంతో హీరో అతన్ని కొట్టాడు. అదే ఊరిలో ఉన్న ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు .. ఈ విషయం తెలుసుకున్న హీరో భూస్వామిని కొట్టి అతన్ని రక్షించాడు. దాంతో హీరోపై పగ పెంచుకుంటాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్ సోదరుడు మరియు రాజకీయ నాయకుడి కొడుకు, భూస్వామి ముగ్గురూ కలుసుకుని, హీరోని చంపడానికి ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నంలో హీరో ని వారు అంతమొందించారా ? అసలు ఆ ముగ్గురు ఎందుకు కలుసుకున్నారు? ఫైనల్ గా హీరో ప్రిన్స్ తాను అనుకున్న ఆశయాలు నెరవేర్చడా లేదా అన్నది తెలియాలంటే సినెమా చూడాల్సిందే.

ఆర్టిస్ట్స్ ప‌ర్ఫార్మెన్స్ః

రవి కిరణ్ కి ఇది తొలి సినిమా అయినా హీరోగా చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. యాక్షన్ విషయంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ కు తగ్గట్టుగా ప్రిన్స్ గా అదరగొట్టాడు. ఇక హీరోయిన్ అవంతిక అందం ఆకట్టుకుంది. అందం, గ్లామర్ తో అవంతిక తప్పకుండా ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఇక మిగతా పాత్రల్లో యోగి ఖత్రి, శాండీ, బంటి , చైతన్య, వారి వారి పాత్రల్లో కట్టుకున్నారు. ముక్యంగా విలనిజం పండించే విషయంలో ముగ్గురు సూపర్ అనిపించారు. ఇక పవర్ స్టార్ గబ్బర్ సింగ్ అంతాక్షరి గ్యాంగ్ యాక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
ఈ సినిమా టెక్నీకల్ విషయాల్లో కూడా దర్శకుడు మంచి అవుట్ ఫుట్ రాబట్టాడు. ముక్యంగా ఈ సినిమాకు ఫోటోగ్రఫి బాగుంది. చాలా సన్నివేశాలు అందంగా చిత్రీకరించారు. ఛాయాగ్రహణం అందించిన ఆర్యన్ టాలెంట్ సూపర్ అనిపించుకున్నాడు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటర్ మాలిక్ పనితనం బాగుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో కేర్ తీసుకుంటే బాగుండేది. అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సంగీత దర్శకుడు స్వరపవన్ అందించిన సాంగ్స్, ఆర్ ఆర్ బాగుంది. విలేజి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాకు తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక దర్శకుడు, నిర్మాత అయిన జగదీష్ పల్లి మంచి సందేశాత్మక కథను ఎంచుకుని దానికి తగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలతో సినిమాను తెరకెక్కించాడు. కథ, కథనం విషయాల్లో మంచి అవుట్ ఫుట్ రాబట్టాడు. అయితే కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడా అనిపిస్తుంది. ఫైనల్ గా రైతు ఆత్మహత్యలు, హీరో లక్ష్యం లాంటి అంశాలను చక్కగా చూపించే ప్రయత్నం చేసాడు. ఇక నిర్మాత కూడా ఆయనే కాబట్టి ప్రొడక్షన్ విలువల విషయంలో సందేహ పడాల్సిన పనిలేదు.

పైన‌ల్ గా చెప్పాలంటేః
“ప్రిన్స్ ది ఫైటర్” టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ అంశాల కలయికలో ఓ మంచి కథను అందించే ప్రయత్నం చేసారు. ప్రేమ, లక్ష్యం లాంటి అంశాలను కలగలపుతూ ముక్యంగా నేటి సమాజంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా చూపించే ప్రయత్నం చేసారు. మొత్తానికి ప్రిన్స్ ది ఫైటర్ చిత్రం చాలా మంచి ప్రయత్నం అని చెప్పాలి. సో డోంట్ మిస్ దిస్ వీక్. గో అండ్ వాచ్.