PremaPispasi Movie Review

PremaPispasi Movie Review
 
  ‘ప్రేమ పిపాసి’ రివ్యూ!!
 
 
 
 
 రేటింగ్‌ :3/5
నటీనటులు 
    
  హీరో: జిపిఎస్‌  ,హీరోయిన్స్‌: కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌ పుత్‌, మమత శ్రీ చౌదరి 
 ముఖ్య పాత్రలు  :  సుమన్‌ , భార్గవ్‌ , షేకింగ్‌ శేషు, జబ్బర్దస్థ్‌ రాజమౌళి, ఫసక్‌  శశి, ఫన్‌ బకెట్‌ భరత్‌ తదితరులు 
 కెమెరా: తిరుమల   రోడ్రిగ్జ్‌ , మ్యూజిక్‌: ఆర్స్‌ 
  పాటలు   : సురేష్‌ గంగుల  -అల  రాజు 
 పీఆర్వో : వంగాల   కుమారస్వామి 
 ఎడిటర్‌: ఎస్‌.శివ.కిరణ్‌, 
 ఫైట్స్‌: మిస్టర్‌ దేవ్‌,  కో-ప్రొడ్యూసర్స్‌ : రాహుల్‌ పండిట్‌, జిఎస్‌ రావు, వై వెంకట లక్ష్మి 
 అసోసియేట్‌  ప్రొడ్యూసర్‌ :యుగంధర్‌ కొడవటి 
ప్రొడ్యూసర్‌ : పియస్‌ రామకష్ణ (ఆర్కే)
 రచన-దర్శకత్వం: మురళి రామస్వామి 
 రేటింగ్‌ :3/5
 
 ‘నేనొక ప్రేమ పిపాసిని’ ఈ పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ పాటలోని పల్లవిని  తీసుకుని ‘ప్రేమపిపాసి’ అనే టైటిల్‌తో మురళిరామస్వామి అనే నూతన దర్శకుడు జిపియస్‌ హీరోగా ఇంటెన్స్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్ తో  ఆకట్టుకున్న ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను  ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే  ప్రయత్నం చేద్దాం..
 
 స్టోరి: 
 పని, పాట లేకుండా ఆవారా గా తిరుగుతూ  ప్రేమను వెతుక్కునే పనిలో ఉంటాడు హీరో. కనపడ్డ అమ్మాయినల్ల    ఫ్లర్ట్‌ చేస్తూ వారితో రొమాన్స్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో బాల  అనే అమ్మాయి హీరో లైఫులోకి వస్తుంది. ఆ అమ్మాయిని సిన్సియర్‌గా ప్రేమిస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు. అసలు  ఆ అమ్మాయి ఎవరు? ఇలా కనపడ్డ అమ్మాయినల్లా హీరో ఎందుకు యూజ్‌ చేసుకుని వదిలేస్తున్నాడు అనేది ఫ్లాష్‌ బ్యాక్‌లో తెలుస్తుంది . ఆ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? చివరకు బాల  అనే అమ్మాయిని దక్కించుకున్నాడా? అసలు  హీరో భగ్న ప్రేమికుడుగా ఎందుకు మారాడు అన్నది క్లైమాక్స్‌. 
 
 పాజిటివ్‌:
 సినిమాటోగ్రఫీ
 పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
 డైరక్షన్‌ 
 హీరో పర్ఫార్మెన్స్‌
 అక్కడక్కడా డైలాగ్స్‌
 ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌
నెగిటివ్‌:
 ఫస్టాఫ్‌లో అక్కడక్కడా ల్యాగ్‌ సీన్స్‌
 ఎడిటింగ్ 
కొన్ని  సన్నివేశాలు స్ట్రాంగ్ గా లేకపోవడం 
 
 ఎడిటింగ్‌ 
నటీటీనటుల  పర్ఫార్మెన్స్‌:
 అమ్మాయిలను  ఫ్లర్ట్‌ చేసే పాత్రలో, భగ్న ప్రేమికుడుగా హీరో జిపియస్‌ అద్భుతమైన నటన కనబరిచాడు. ఒక కొత్త హీరోలా కాకుండా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న హీరోలా నటించాడు అనడంలో సందేహం లేదు. క్యారక్టర్‌కి తగ్గట్టుగా లాంగ్వేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ చూపించాడు. ఫస్ట్‌ సీన్‌ నుంచి లాస్ట్‌ సీన్‌ వరకు అదే యాటిట్యూడ్‌తో సినిమాను తన భుజాల  పై తీసుకెళ్లాడు. కామెడీ టైమింగ్‌తో పాటు చివరిలో ఎమోషన్స్‌ కూడా బాగా పండించాడు. భవిష్యత్‌లో మంచి హీరో లక్షణాలు  మెండుగా ఉన్నాయి. ఇక సుమన్‌ ఒక ఇంపార్టెంట్‌ పాత్రలో నటించాడు. హీరో ఫ్రెండ్‌గా ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ తనదైన శైలిలో పంచ్‌ లతో అక్కడక్కడా నవ్వించాడు. ఇక జబర్దస్త్‌ రాజమౌళి కనిపించేది కొద్దిసేపే అయినా తన పేరడీ పాటలతో థియేటర్‌లో నవ్వులు  పూయించాడు. హీరోయిన్స్‌ అందరూ తమ పాత్రలకు  న్యాయం చేశారు.
 సాంకేతిక నిపుణుల  పనితీరు:
 లవ్ స్టోరీస్  ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సాంగ్స్‌, లొకేషన్స్‌ బావుండాలి, తిరుమల  రోడ్రిగ్జ్‌ సినిమాటోగ్రఫీ, ఆర్స్‌ బాణీలు , సురేష్‌ గంగుల  సాహిత్యం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు  అని చెప్పాలి. ఒక పెద్ద సినిమా స్థాయిలో ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌ కుదిరింది. ఇక దర్శకుడు లవ్‌ , ఎమోషన్‌, ఫ్రస్టేషన్‌ ప్రతిదీ ఎక్స్‌ట్రీమ్‌లో చెప్పడానికి ప్రయత్నించారు. హీరో క్యారక్టర్‌ని బాడీ లాంగ్వేజ్‌ని బాగా డిజైన్‌ చేశాడు దర్శకుడు  . డైరక్షన్‌ ఎంగేజింగ్‌గా ఉంది. నేటి ట్రెండ్‌కి అనుగుణంగానే కాకుండా అడ్వాన్స్‌డ్‌గా సినిమా తీశాడు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. అసలు  హీరో అమ్మాయి లను ఎందుకు అలా చేస్తున్నాడు అనేది దానికి ఫ్లాష్‌బ్యాక్‌తో మంచి ముగింపు ఇచ్చాడు డైరెక్టర్  ఇందులో లవ్ మాత్రమే  కాకుండా ఫ్రెండ్‌షిప్‌ , ప్రజెంట్‌ అమ్మాయిలు  ఎలా ఉన్నారు? అనేది కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. బోల్డ్‌ కంటెంట్‌ ఉన్నప్పటికీ బ్యాడ్‌గా మాత్రం అనిపించదు.  నిర్మాతలు ఎక్కడ రాజి పడకుండా  సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. 
 
 అనాసిస్‌:
 యూత్‌ ఫుల్‌ కాన్సెప్ట్‌తో ఇంటెన్స్‌ రొమాంటిక్‌  లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేమపిపాసి రూపొందింది. ఫస్టాఫ్‌లో అమ్మాయిు, అబ్బాయిలను ఎలా యూజ్‌ చేసుకుంటారు అనేది ప్రజంట్‌ యూత్‌కి కనెక్టయ్యేలా ఉంది. లిపిలాక్స్‌ ఎక్కువే అయినప్పటికీ కథలో భాగంగా వస్తాయి తప్ప అగ్లీగా అనిపించవు. మంచి సాంగ్స్‌, సినిమాటోగ్రఫీ, క్రేజీ డైలాగ్స్‌ తో పాటు ఒక జెన్యూన్‌ లవ్  చూడాలనుకునేవాళ్లు ఈ సినిమాకు వెళ్లి రెండున్నర గంటలు  హ్యాపీగా ఎంజాయ్‌ చేయవచ్చు.