ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ల్యాణ్ ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ టైటిల్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’

ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ల్యాణ్ ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ టైటిల్  ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’

ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ల్యాణ్ ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ టైటిల్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’
ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్ విడుద‌ల
రూ. 150 కోట్ల‌తో మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్ గ్రాండియ‌ర్‌గా నిర్మిస్తోన్న చిత్రం
2022 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌కు ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ఎ.ఎం. ర‌త్నం ఈ ఎపిక్‌ చిత్రానికి సమర్పకులు.

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్‌ను విడుద‌ల చేశారు. ఆ లుక్‌నుచూడ‌గానే అద్భుతంగా అనిపిస్తోంది.
‘ హరి హర వీరమల్లు’ గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ తొలి
దృశ్యమాలిక‌లో పవన్ లుక్ పూర్తిగా కొత్త‌ద‌నంతో క‌నిపిస్తోంది. పై నుంచి కింద దాకా ఆయ‌న రూపం పూర్తిగా మారిపోయింద‌ని స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇది మ‌నం గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపం. డైరెక్ట‌ర్ క్రిష్అద్భుత‌మైన విజ‌న్‌కు త‌గ్గ‌ట్లు కీర‌వాణి టెర్ర‌ఫిక్ మ్యూజిక్‌, గ్రాండియ‌ర్ విజువ‌ల్స్‌తో ఈ ఫ‌స్ట్ గ్లిమ్స్ అపూర్వం గాఉంది.

“ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ.” అని డైరెక్ట‌ర్ క్రిష్ చెప్పారు. నేటి త‌రం
ద‌ర్శ‌కుల్లో ఒకఇంద్ర‌జాలికుడు లాంటి ఆయ‌న త‌న ట్రేడ్‌మార్క్ అంశాల‌తో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైనవిజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. క‌చ్చితంగాఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని
ఇస్తుంది.

ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, రెడ్ ఫోర్ట్, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. అంటే.. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు.

ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ నలభై శాతం పూర్త‌యింది. జూలై నాటికి మొత్తం చిత్రీక‌ర‌ణ‌నుపూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తామ‌నే ఆశాభావాన్ని నిర్మాత‌ ఎ. ద‌యాక‌ర్ రావు వ్యక్తం చేశారు. పీరియడ్ డ్రామా ఫిల్మ్ కావడంతో, వీఎఫ్ఎక్స్ ప‌నుల కోస‌మే ఆరు నెలల సమయాన్ని కేటాయించారు. ప‌లుహాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన బెన్ లాక్ ఈ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను పర్యవేక్షిస్తారు.

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు

అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.
పాన్‌ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

2022 సంక్రాంతికి ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

సాంకేతిక బృందం:

స‌మ‌ర్ప‌ణ‌: ఎ.ఎం. ర‌త్నం, ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి, నిర్మాత‌: ఎ. ద‌యాక‌ర్ రావు, బ్యాన‌ర్‌: మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. మ్యూజిక్‌: ఎం.ఎం. కీర‌వాణి

పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, చంద్ర‌బోస్‌ , డైలాగ్స్‌: సాయి మాధవ్ బుర్రా

ఎడిటింగ్‌: శ్రావ‌ణ్‌, , విజువ‌ల్ ఎఫెక్ట్స్‌: బెన్ లాక్ ‌ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌, స్టంట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, శ్యామ్ కౌశ‌ల్‌, దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఐశ్వ‌ర్ రాజీవ్ , పిఆర్వో: ల‌క్ష్మీ వేణుగోపాల్‌.‌

  Powerstar Pawan Kalyan’s Epic magnum opus titled ‘Hari Hara Veeramallu.’ 

  First Look Glimpse Unveiled 

  Mega Surya Production is making this grandeur budget film with 150Cr 

 Grand Release For Sankranthi 2022

Powerstar Pawan Kalyan and Crafty Director Krish Jagarlamudi’s Legendary Heroic OutLaw Film Titled ‘Hari Hara Veeramallu’; A production of legendary producer AM Ratnam on Mega Surya Production banner.

On the auspicious occasion of Maha Shivaratri, the title and first look glimpse of Powerstar Pawan Kalyan’s forthcoming epic movie under the direction of Krish Jagarlamudi and production of legendary producer AM Ratnam on Mega Surya Production banner are revealed. This magnum opus is titled ‘Hari Hara Veeramallu’ and the first glimpse is extraordinary in its own way.

Powerstar Pawan Kalyan is essaying the title role. *In the video* Pawan’s look is completely refreshing and from tip to toe there can be noticed a clear makeover. It’s a never before look of Pawan and crafty *director Krish’s taking is superb* which is *terrifically complemented by Keeravani’s music* and *the grandeur visuals* go with the flow.

This is the story of legendary heroic outlaw,” says director Krish who is a magician in this space of genres and this film will have his trademark elements. This massive film ‘Hari Hara Veeramallu’ is set in the period of 17th century on the backdrop of Moghuls and Qutub Shahis era and it will offer spectacular visual feast. This is an untold story in Indian cinema and will truly be spellbound.

Gigantic sets like Charminar, Red Fort and Machilipatnam port are assembled for the film’s shooting which means it is being made on a lavish budget of ₹ 150 crore with uncompromising grandeur production values.

So far ‘Hari Hara Veeramallu’ has wrapped up forty percent of its shooting and the makers are hopeful to wrap it up by July and then head to the post-production works. Being a period drama film, six months’ time is dedicated for VFX and it will be supervised by Ben Lock who was associated with Hollywood films earlier.

Nidhhi Agerwal is playing the female lead.

Top technicians such as MM Keeravani and ace cinematographer Gnana Shekar VS are handling music and camera respectively for this film.

Also the film is being made on a pan-India level and will get a simultaneous release in Hindi, Tamil, and Malayalam languages along with Telugu.

‘Hari Hara Veeramallu’ is slated for 2022 Sankranthi release.

Crew:

Presented by AM Ratnam

Direction: Krish Jagarlamudi

Producer: A. Dayakar Rao

Banner: Mega Surya Production

Cinematography: Gnanashekar VS

Music: MM Keeravani

Editor: Sravan

Dialogues: Sai Madhav Burra

Visual Effects: Ben Lock

Production Designer: Rajeevan

Stunts: Ram-Laxman, Sham Kaushal, Dileep Subbarayan

Lyrics: ‘Sirivennela’ Seetharama Sastry, Chandrabose

Costume Designer: Aiswarya Rajeev

PRO: LakshmiVenugopal