సెవెన్’లో లిప్‌లాక్ లేని హీరోయిన్ నేనే అనుకుంట‌! 

సెవెన్’లో లిప్‌లాక్ లేని హీరోయిన్ నేనే అనుకుంట‌! 
 
సెవెన్’లో లిప్‌లాక్ లేని హీరోయిన్ నేనే అనుకుంట‌! 
– పూజితా పొన్నాడ ఇంటర్వ్యూ 
 
హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. ‘దర్శకుడు’, ‘రంగస్థలం’ సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పూజితా పొన్నాడ ఇందులో ఒక హీరోయిన్‌గా నటించారు. జూన్ 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా పూజితా పొన్నాడతో ఇంటర్వ్యూ…. 
 
‘సెవెన్’ టైటిల్ మిస్టరీ ఏంటి?
మరో మూడు రోజుల్లో సినిమా విడుదలవుతోంది. అప్పటివరకూ ఆ సస్పెన్స్ అలాగే ఉంచుదాం.
 

టైటిల్ లోగోలో ‘7’ చివర ఎర్రగా డిజైన్ చేశారు. ఎందుకలా?

అది రక్తం. సినిమాలో ఎవరో మర్డర్ అవుతారనుకుంట! అందుకని అలా డిజైన్ చేసినట్టున్నారు. మరో రోజులు వెయిట్ చేయండి. మీతో పాటు ప్రేక్షకులందరికీ తెలుస్తుంది. ఎంట‌ర్‌టైనింగ్‌, డిఫ‌రెంట్ మూవీ. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్.
 
‘సెవెన్’లో మీ పాత్ర ఏమిటి?
నాదొక సస్పెన్స్ రోల్. ఎక్కువ రివీల్ చేయకూడదు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లు, పాటలు చూసి ఉంటారు. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. కథలో కొన్ని ప్రశ్నలకు నా పాత్ర ద్వారా సమాధానం లభిస్తుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.  కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 
 
మీరు ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్లలో ఈ సినిమాలో క్యారెక్టర్ బోల్డ్ అనుకుంట?
బోల్డ్ కాదు.. డిఫరెంట్ క్యారెక్టర్. ‘సెవెన్’లో నా క్యారెక్టర్‌కు మంచి ప్రేమకథ ఉంది. నేను నటించిన ఫస్ట్ ప్రోపర్ లవ్ స్టోరీ ఇదే అనుకుంటున్నాను.
 
ట్రైల‌ర్‌లో లిప్ లాక్స్‌ హాట్ టాపిక్. ఫస్ట్ టైమ్ కిస్ సీన్ చేసినట్టున్నారు?
ఈ సినిమాలో నాకు లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు? ‘సెవెన్’లో లిప్ లాక్ లేని ఏకైక హీరోయిన్ నేనే అనుకుంటాను.
 
హవీష్ తో యాక్టింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
హవీష్ చాలా స్వీట్ పర్సన్. అతనితో పని చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నాకు హవీష్ ఫ్రెండ్ గా తెలుసు. ఈ సినిమా షూటింగులో నటుడిగా హవీష్ గురించి తెలుసుకున్నా. తనలో డెడికేషన్ లెవల్స్ చాలా ఎక్కువ. ఫస్ట్ డే సెట్‌లో హవీష్ డెడికేషన్ చూసి ‘వావ్’ అనుకున్నాను. పని పట్ల కమిటెడ్ గా ఉన్నారు.  
 
 
మీతో కలిపి సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. ఇంతమందితో నటించడం?
విచిత్రం ఏంటంటే… ఎవరికీ ఎవరితో సంబంధం ఉండదు. ఎవరి కథ వాళ్ళది. చివర్లో అందరి కథలు కలుస్తాయి. ప్రతి ఒక్కరి కథలో హవీష్ హీరో. నేను కాకుండా ఐదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ… వాళ్ళతో ఇంటరాక్షన్ లేదు. రెజీనాగారితో మాత్రమే కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. ఆమెతో నటించడం మంచి అనుభూతి. ప్రతి హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆరుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా కథకు ముగింపు ఉండదు. రమేష్ వర్మగారు అంత పకడ్బందీగా కథ, స్క్రీన్ ప్లే రాశారు. 
 
నిజార్ షఫీ దర్శకత్వం గురించి?
నేను నటించిన ‘రాజుగాడు’కి నిజార్ షఫీ గారు వర్క్ చేశారు. ఆయన టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ అని తెలుసు. ఈ సినిమాతో మంచి దర్శకుడు అని నిజార్ షఫీ గారు నిరూపించుకున్నారు. 
 
తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీశారు. తమిళంలో నటించడం ఎలా ఉంది?
నా స్కూలింగ్, కాలేజీ ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో సాగింది. అందువల్ల, నాకు తమిళం బాగా వచ్చు. దాంతో తమిళ షూటింగ్ ఇబ్బందిగా అనిపించలేదు. ఈజీగా చేశా. తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కావాలని కొంతకాలంగా అనుకుంటున్నా. ఈ సినిమాతో యాక్సిడెంటల్‌గా పరిచయం అవుతున్నా. ముందు బైలింగ్వల్ చేస్తున్నారని నాకు తెలియదు.
 
సినిమాలో పాటలు అన్నీ హిట్టయ్యాయి. మీకు నచ్చిన పాట?
‘ఆర్.ఎక్స్. 100’కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో నా పాట ‘సంపొద్దే’ నాకు చాలా ఇష్టం.
 
ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎలా వస్తున్నాయి?
ఎవరి ప్రయాణం వాళ్ళది. ఒక హీరోయిన్ కెరీర్‌తో మ‌రో హీరోయిన్ కెరీర్‌ని కంపేర్ చేయ‌కూడ‌దు. నా వరకూ మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తెలుగమ్మాయిలు కావాలని మరీ తీసుకుంటున్నారు. మా ఇంట్లో సినిమా నేపథ్యం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేశా. ఇంట్లో అవి చూపిస్తే ఎంకరేజ్ చేశారు. సుకుమార్ గారు నేను నటించిన షార్ట్ ఫిలిమ్స్ చూసి ‘దర్శకుడు’కి ఎంపిక చేశారు. ఆ సినిమా కాస్టింగ్ పర్సన్ కి నా పాత్రకు తెలుగమ్మాయే కావాలని సుకుమార్ గారు చెప్పారట. అదొక్కటే కాదు… ఇప్పటివరకూ నేను నటించిన ప్రతి పాత్ర తెలుగమ్మాయి కావడం వల్ల వచ్చినదే. 
 
మీ తదుపరి సినిమాలు?
రాజశేఖర్ గారి ‘కల్కి’ విడుదలకు సిద్ధమైంది. అందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను గిరిజన యువతిగా నటిస్తున్నాను. నా లుక్ నుంచి ప్రతి విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు డిటైల్డ్ గా వర్క్ చేసి, క్యారెక్టర్ డిజైన్ చేశారు. నా రోల్ కి మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ‘కల్కి’ కాకుండా కీర్తీ సురేష్ గారితో ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నా. తమిళంలో ఒక సినిమాకు సంతకం చేశా.
 
 
 
I must be the only actress without a lip-lock scene in ‘Seven’: Poojitha Ponnada
 
Poojitha Ponnada, the Telugu-speaking actress who was seen in ‘Rangasthalam’ and ‘Darsakudu’ earlier, is gearing up for the grand release of the romantic thriller ‘Seven’ on June 5.  In this interview, catch the beauty talk about her role, the film ‘Seven’, what makes it a different movie, her future projects and more.  
 
Tell us about your journey so far in the film industry.  
 
My schooling and college were in Chennai. I started out as a software employee.  Before entering the movie industry, I did a few short films.  Sukumar garu gave me a call after watching one of them and offered me ‘Darsakudu’.  After ‘Rangasthalam’, the urge in me to try new kind of roles and showcase my acting skills went up many notches.  The urge has only been increasing.  
 
So, you don’t have a film background.  It must have been very hard, right?
 
Yes, I have no film background.  Nobody in my family has been into cinema.  They were shocked when I told them I would be doing films.  My family members live in Mumbai.  I used to work on short films during weekends.  Everybody’s journey is different.  Hardwork is very important in the film industry.  You have to be in the right place at the right time.  I can speak only for myself.  Some people enter the industry with the passion to become an actor right from childhood.  Others are not like that.  I belong to the second category.  
 
Coming to ‘Seven’, what is your role like in it?
 
My role is suspenseful.  So, I can’t talk much about it.  It’s a romantic crime thriller.  Answers to some of the questions will be found in my character.  It’s a different kind of role altogether. This is my first proper love story.  
 
How was it working with the likes of Nandita, Anisha Ambrose, Tridha and others?
 
There are five other heroines but I didn’t get to interact with them much, except for Regina Cassandra.  Every heroine’s story is different and they don’t merge until the end.  Havish is the lover boy of the movie.  
 
What makes ‘Seven’ a unique film?
 
‘Seven’ is mostly a screenplay-based movie.  The concept, the screenplay were developed in a unique manner.  Every actor has his or own importance in the story.  Take out even one character, it doesn’t make sense.  
 
There is so much entertainment and glamour quotient in the movie.  It’s edge of the seat but it’s not entirely serious.  I am happy that ‘Seven’ is releasing in Tamil as well.  I can speak Tamil well.  This is my accidental Tamil debut.
 
How was it doing a lip-lock?
 
(Smiles) I don’t have a lip-lock in the movie.  I must be the only heroine who doesn’t have a lip-lock scene in ‘Seven’.  I don’t know what other heroines have done in the movie.  I am neither for or against lip-locks.  It all depends on the script.  
 
How was it working with the director and actor Havish?
 
I have known Nizar Shafi as a very good cameraman but this time, I could witness his directorial talent.  It was a great experience working with him.  As for Havish, he is a very dedicated person.  I had known him before this film as a friend before this film happened.  He is quite committed.  ‘Seven’ has been a superb experience.  I like the song featuring me the most.  Chaitan Bharadwaj of ‘RX 100’ fame has done a remarkable job.  
 
As a Telugu-speaking girl, how do you see the industry changing?
 
These days, there is an increasing demand for Telugu-speaking girls.  For example, ‘Darsakudu’ happened only because the director felt only a Telugu girl should do it.  Same goes with the other directors with whom I have worked.  I instantly come across as a Telugu girl.   Female-oriented movies are being made in more numbers.  I think things are changing.    
 
What is your definition of glamour?
 
Glamour is something that should look nice.  It’s not about going bold; it’s something that everyone can enjoy.  
 
What about your upcoming movies?
 
‘Kalki’ is up for release soon.  It’s a very different movie.  I will be seen as a tribal girl in the film.  I have a Telugu and a Tamil film lined up later.  In one of the new films, I will be sharing screen space with Keerthy Suresh.  I am open to doing negative roles as well.  
 
We heard that you are utterly disappointed with ‘Where Is The Venkatalakshmi’.  What went wrong?
 
I regret doing ‘Where Is The Venkatalakashmi’.  I don’t want to go into too many details.  There was a whole lot of manipulation.  They didn’t do what was narrated to me.  Even the promotions didn’t go as they said they would go.  It was supposed to be a love story.  Two months after I came on board, they told me I would have to do a romantic song.  But it turned out to be something else (erotic song).