Polimera-2 Movie Movie Teaser Launch
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేసిన `మా ఊరి పొలిమేర-2` టీజర్
శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా ` రూపొందుతోన్న చిత్రం`మా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ…“సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో తను నటించిన `మా ఊరి పొలిమేర` చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న `మా ఊరి పొలిమేర-2` టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. మొదటి పార్ట్ లా సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…“ ముందుగా మా టీజర్ లాంచ్ చేసిన వరుణ్ తేజ్ గారికి ధన్యవాదాలు. గతంలో అదాశర్మతో నేను `క్వశ్చన్ మార్క్` అనే సినిమా తీశాను. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఈ క్రమంలో ఓ రోజు ఓటీటీలో `మా ఊరి పొలిమేర` సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే డైరక్టర్ అనిల్ కి కాల్ చేసి సీక్వెల్ నా బేనర్ లో చేస్తాను అన్నాను. తను కూడా ఓకె చెప్పాడు. ఫస్ట్ పార్ట్ కన్నా రెండో పార్ట్ అంతకు మించి చేశాడు. స్క్రీన్ ప్లే, డైరక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సత్యం రాజేష్, కామాక్షి పోటాపోటీగా నటించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి పార్ట్ పెద్ద హిట్టయింది. అలాగే డైరక్టర్ మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో సినిమా చేశాం. ఈ నెలాఖరులో కానీ ఆగస్ట్ మొదటి వారంలో కానీ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ…“లాక్ డౌన్ సమయంలో టీవీలో ప్రసారమైన ఒక రియల్ ఇన్స్ డెంట్ చూసి ఇన్ స్పైర్ అయి ఈ కథ రాసుకున్నా. మా ఊరి పొలిమేర తీసే సమయంలోనే సెకండ్ పార్ట్ కథ కూడా రాశాను. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి.. క్యారక్టర్స్ తగ్గట్టుగా బోల్డ్ డైలాగ్స్, సీన్స్ ఉంటాయి తప్ప..ఎక్కడా కావాలని ఏదీ పెట్టలేదు. నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఉందా? లేదా? అనే డెబిట్ మీద వెళ్లలేదు. ఒక వేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశాము. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్ లో షూటింగ్ చేశాము. సెకండ్ పార్ట్ లో పద్మనాభ స్వామి టెంపుల్ అంశాన్ని కూడా లైట్ గా టచ్ చేసే ప్రయత్నం చేశాము. అది ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇది మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే చిత్రం. అందులో బ్లాక్ మ్యాజిక్ అనే అంశాన్ని జోడించాము. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నేను అడిగిన ప్రతిదీ సమకూర్చారు. సత్యం రాజేష్, కామాక్షి అద్భుతంగా నటించారు. ఎవరూ ఊహించని విధంగా సెకండ్ పార్ట్ ఉండబోతుంది. మా సినిమా టీజర్ వరుణ్ తేజ్ గారు లాంచ్ చేసి మా సినిమాకు మరితం బజ్ తెచ్చారు“ అన్నారు.
నటి కామాక్షి మాట్లాడుతూ…“ప్రియురాలు` నా మొదటి సినిమా. ఆ తర్వాత `మా ఊరి పొలిమేర` చిత్రం చేశాను. ఈ సినిమాలో నా పాత్రకు మంచి పేరొచ్చింది. పార్ట్ 2 లో కూడా నా క్యారక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారు దర్శకుడు. నేను డాక్టర్ ని, థియేటర్ ఆర్ట్ స్ట్ ని… కాబట్టి క్యారక్టర్ ని క్యారక్టర్ లాగే చూస్తాను తప్ప..వేరే ఏమీ ఆలోచించను. అందుకే నాకు వచ్చిన పాత్రలు…నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నా. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతానన్న నమ్మకం ఉంది“ అన్నారు.
నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ…“ ముందుగా మా సినిమా టీజర్ లాంచ్ సినిమా పై మరింత హైప్ పెంచిన వరుణ్ తేజ్ కి మీడియా ముఖంగా నా ధన్యవాదాలు. ఇందులో ఒక ఇంపార్టెన్స్ ఉన్న పవర్‌పుల్ రోల్ చేశాను. మొదటి భాగం చేశాక చాలా మంది సెకండ్ పార్ట్ ఎప్పుడూ అంటూ ఎంతో క్యూరియాసిటీ చూపించారు. మొదటి పార్ట్ పెద్ద హిట్టయింది. చాలా సంతోషం. ఈ సినిమా కోసం పది కేజీలు పెరిగాను. స్మశానంలో కొన్ని సీన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత భయపడ్డాను. దర్శకుడు, నిర్మాత ఎక్కడా కాంప్రజైజ్ అవ్వకుండా సినిమాను చాలా గ్రాండ్ గా తీశారు. నా నటన ఇందులో చాలా నేచరల్ గా ఉంటుంది. నటుడుగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. ఇందులో కామాక్షి నట విశ్వరూపం చూస్తారు“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; పీఆర్వోః జీకే మీడియా; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఫైట్ మాస్టర్ః రామ్ మాస్టర్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్.
The edgy teaser is filled with tension and dread!
‘Ma Oori Polimera-2’, produced by Shree Krishna Creations and presented by Gowr Ghana Babu, comes from director Dr. Anil Vishwanath. Satyam Rajesh, Dr. Kamakshi Bhaskarla, Getup Srinu, Rakendu Mouli, Baladitya, Sahitya Dasari, and Ravi Varma are playing different roles in it. The edgy and gripping film is gearing up for a theatrical release at the end of this month.
Ahead of the promising movie’s release, Mega Prince Varun Tej today launched its teaser.
Speaking on the occasion, Varun Tej said that Satyam Rajesh is a good friend of his. “I watched ‘Maa Oori Polimera 1’ on OTT and loved it a lot. The teaser of ‘Ma Oori Polimera-2’ is super interesting. It has been made as a sequel. I wish the film to be a big hit. My best wishes to all the team.”
Producer Gowr Kriesna said, “Thanks to Varun Tej garu for releasing the teaser. I have previously done a movie titled ‘Question Mark’ with Adah Sharma, but it didn’t work commercially. When I watched ‘Ma Oori Polimera-1’ on OTT, I fell in love with it. I immediately called the director Anil and told him I would like to do a sequel. He agreed. The second part is much better than the first. The screenplay and direction are superb. Satyam Rajesh and Kamakshi have acted as rivals. I am very happy to present a good movie to the audience. We trusted the director and invested a huge amount of money. We are planning to release the film at the end of this month or in the first week of August.”
Director Dr. Anil Vishwanath said, “I wrote this story after seeing a real-life incident that was aired on TV during the 2020 lockdown. As the story takes place in a rural setting, the dialogues are raw. The scenes and characters are bold. Our film explores questions such as the reality or otherwise of black magic. We have tried to portray what it would be like if there indeed is black magic. We shot in Paderu, Kerala and Uttarakhand. We have tried to touch the subject of the famous Padmanabha Swamy Temple as well. You have to watch the movie to know what we have tried to tell. The story revolves around a murder mystery. Black magic is an added element. Our producer provided everything I asked for without any compromise. Satyam Rajesh and Kamakshi have acted brilliantly. The second part is going to be unpredictable in terms of the twists and turns. We thank Varun Tej garu for releasing the teaser.”
Actress Kamakshi said that ‘Priyuralu’ was her first film. “After my debut, I did ‘Ma Oori Polimera’. After its OTT release, I received a lot of applause. The director has designed my character very well in the second part as well. I am a doctor and a theater artist. So, I see the character as a character. I don’t think there are any other considerations. I am moving forward to doing the roles I like.”
Actor Satyam Rajesh began his speech by thanking Varun Tej. “I have got a powerful role with a lot of importance in the larger scheme of things. Those who have watched the first part are curious about what the second part is about. The first part was a big hit. I am very happy that I gained ten kilos for this film. I was a bit scared when I had to do some scenes in the graveyard. The director and producer have made the movie on a grand scale. My acting is very natural. I am confident that the film will take me to another level as an actor.”
Music: Gyaani; Cinematography: Khushender Ramesh Reddy; Editing: Sri Vaara; PRO: GK Media; Art Director: Upendra Reddy Chanda; Fight Master: Ram Master; Executive Producer: NC Satish Kumar; Producer: Gowr Kriesna; Story- Screenplay- Dialogues- Direction: Dr. Anil Vishwanath.