‘‘పలాస 1978’’ ఫస్ట్ లుక్ లాంచ్
‘‘పలాస 1978’’ ఫస్ట్ లుక్ లాంచ్
ఉత్తారాంధ్రలోని పలాస ప్రాంత ఆత్మను తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం‘‘పలాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా కథలు కొన్నిచట్రాల్లోబిగుసుపోయిన టైం లో కంచెరపాలం ఆ గిరిని దాటుకొని కొత్త అనుభూతులనుప్రేక్షకులకు పంచింది. ఆ కోవలో పలాస చిత్రం కూడా ఒక నిజమైనఎమోషన్స్ చుట్టూ , సమాజంలో పేరుకుపోయిన అసమానతలుకు వెండితెర రూపంగారూపొందింది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్,సుబ్రహ్మణ్యపురం తరహాలో రియలిస్టిక్క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ను హీరో రక్షిత్ బర్త్
డే సందర్భంగా దర్శకుడు మారుతి ,చిత్ర సమర్పకులు తమ్మారెడ్డిభరద్వాజ లాంచ్ చేసారు.
ఈ సందర్భంగా మారుతి గారు మాట్లాడుతూఃనిర్మాత ప్రసాద్ గారు కథ చెప్పినప్పుడు మాములు కథ అనుకున్నాను. కానీఇప్పుడు సినిమా గురించితెలిసాక ఈ కథను ఆ ఊరిలో ఉండి , తిరిగి, అనుభవించి రాసారు. మంచిఇంటెన్షనల్ కథను తీసుకున్నారు. కంచెరపాలెం లాగా ఇది ప్రేక్షకులకుకొత్త అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్బాగుంది. చాలా కొత్త గా డిజైన్ చేసారు. వాటర్ పెయిటింగ్ తో చాలా అందంగాడిజైన్ చేసారు. హీరో లుక్ బాగుంది. మంచి ఎక్స్ పీరియన్సడ్ హీరోలాగాకనపడుతున్నాడు. తమ్మారెడ్డి గారు ఇలాంటి సినిమాలకు అండగా నిలబడటంఆనందించతగ్గ విషయం. తమ్మారెడ్డి మార్క్ కనపడుతుంది. ప్రతి నెలాఇలాంటి మవీస్ ఆయన నుండి రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ:ఈ కథ చెప్పటానికి వచ్చి నప్పుడు చాలా అయిష్టంగానే విన్నాను. కానీ కథవిన్నాక ఇందులో విషయం గమ్మత్తుగా ఉంది . ముంబైలో మాఫియా ఒకలాగాఉంటుంది, విజయవాడలో ఒకలాగా ఉంటుంది. అలాగే ప్రతి ఊరిలో ఒక మాఫియాఉంది. అది ఎలా ఉంటుంది అనే విషయమే పలాసలో కొత్తగా ఉంటుంది. పలాసపేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈసినిమా పలాస కు ఒక కొత్తగుర్తింపు ను తెస్తుంది. ఇందులో పనిచేసిన ప్రతి వాళ్లు కూడా హ్యాపీగాఫీల్ అవుతారు. కంచెరపాలెం లుక్ లోనే కొత్త సబ్జెక్ట్ ని చేసారు.ఒక్కప్పుడు ప్రతి దర్శకుడు ఒక్కో జానర్ లో సినిమాలు తీసేవాడు, కానీఇప్పుడు అందరూ ఒకే జానర్ లో సినిమాలు తీస్తున్నారు. పలాసప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందనినమ్ముతున్నాను. అన్నారు.
మ్యూజిక్ దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ :ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడూ కనిపిస్తున్నా ఇందులో మాత్రం క్రూరమైనపాత్ర ను చేసాను. సినిమా లో 40 సంవత్సరాల జర్నీ ఉంటుంది అంత జర్నీ నాపాత్రకు కూడా ఉంటుంది. హీరో రక్షిత్ ఇకనుండి తన ప్రతి పుట్టిన రోజూతన సినిమా ఈవెంట్ లోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కంచెరపాలెం,సుబ్రమణ్యపురం తరహాలో రెండు గంటలు వరకు పలాస లో ప్రేక్షకుల్నితిప్పుతుంది. ఫస్ట్ ఆఫ్ చూసాను, మ్యూజిక్ కి టైం కావాలి అని అడిగాను. అంతతొందర తొందరగా ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వలేం. సినిమాలో కనిపించేఅన్ని పాత్రలకు ఎలివేషన్ ఉంది. డ్రామా ఉంది, వోయిలెన్స్ ఉంది.సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలుస్తుంది.
హీరో రక్షిత్ మాట్లాడుతూ :ఈ సినిమా కథ వినగానే విపరీతంగా నచ్చింది అందుకే దర్శకుడు నిపూర్తిగా నమ్మాను. రెండు నెలల పాటు పలాస లో షూట్ చేసాం, అక్కడ అన్నిసౌకర్యాలు ఉండవు. అయినా టీం అందరూ బాగా సహాకరించి షూటింగ్ కంప్లీట్చేసాం. ఎన్ని కష్టాలు పడినా, ఇప్పుడు సినిమా చూసాక మరిచిపోయాం.ఈసినిమాలో నా పాత్రకు నాలుగు వేరియేషన్స్ ఉంటాయి. గాంగ్స్ ఆఫ్ వసేపూర్ లాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాం. తప్పకుండాప్రేక్షకుల ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు.
హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ:ఈ మూవీ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాకుఎంతో సపోర్ట్ గా నిలిచారు. దర్శకుడు కుమార్ గారు చెప్పిన విధానంనచ్చి ఈసినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఎన్ని అవాంతరాలువచ్చినా ఆయన అనుకున్నది చేసారు. చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కున్నాం.కానీ ఇప్పుడు సినిమా గురించి ఇంత పాజిటివ్ టాక్ వింటుంటే అవన్నీమర్చిపోతున్నాం. హీరో రక్షిత్ బాగా సపోర్ట్ చేసారు. కొన్నిసన్నివేశాలలో నాకు నేనే కొత్త గా అనిపించాను. క్యాస్టూమ్స్ కూడా చాలారియలిస్టిక్ గా వాడాము. ఇలాంటి ప్రాజెక్ట్ లో పార్ట్ అయినందుకు చాలాసంతోషంగా ఉంది. అన్నారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ :తెలుగు లో నేటివ్ కథ లు చాలా తక్కువుగా వస్తున్నాయి. తెలుగు కథ వైజాగ్దాటి ముందుకు పోలేదు. పలాస ప్రాతం బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఈ కథనుతీసుకొని ప్రసాద్, తమ్మారెడ్డి లకు చెప్పాను.వాళ్ళ ముందుకు రావడంతోనేఈకథ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాను. నేను ఎంత గొప్పగాకథ రాసుకున్నా అది ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే దర్శకుడిఆలోచనలను అర్దం చేసుకునే కెమెరా మెన్ కావాలి విన్సెంట్ అరుల్ నాకథకు ప్రాణం పోసాడు. 40 యేళ్ళ పాటు సాగే కథను 40 రోజుల్లోతీయగలిగాం అంటే అది మా టీం నాకు అందించిన సహాకారమే. ఫస్ట్ లుక్విషయంలో కూడా కొత్తగా ట్రై చేసాం ఇప్పుడు అందరూ లుక్ బాగుంది అంటుంటేచాలా సంతోషంగా ఉంది. అన్నారు.
రచయిత నాగేంద్ర :తెలుగు సినిమా కథలు కొన్ని పరిధులలో ఆగిపోయాయి. ఆ పరిధులుదాటికథను చెప్పేందుకు ప్రయత్నించాం. పలాస ప్రాతం యెక్క ఆత్మ ఈసినిమాలోకనపడుతుంది. అసమానతులు, కులాల మద్య పోరు వంటి సామాజిక అంశాలుఇందులో ఉంటాయి. తప్పకుండా పలాస కొత్త అనుభూతలను ఇస్తుంది అన్నారు.
కెమెరా మెన్ విన్సెంట్ అరుల్ మాట్లాడుతూ:కొన్ని సినిమాలే మనసుకు దగ్గరగా వస్తాయి. నాకు పలాస కథ విన్నప్పుడుఅలాంటి అనుభూతి కలిగింది. దర్శకుడు రాసుకున్న కథలో చాలా విషయాలుఆశ్చర్యం కలిగించారు. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా బాగాచేసారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కు థ్యాంక్స్ అన్నారు.
నటీ నటులుఃరక్షత్, నక్షత్ర, రఘుకుంచె, తిరువీర్, విజయరామరాజు,తన్మయిబోలి, ప్రవీణ్, జనార్ధన్, మిర్చి మాధవి తదితరులు
టెక్నీషియన్స్:
సమర్పణః తమ్మరెడ్డి భరద్వాజ,
కో ప్రొడ్యూసర్ -ఎ.ఆర్ బెల్లన్న,
మ్యూజిక్ – రఘుకుంచె,
సినిమాటోగ్రఫీః\అరుల్ విన్సెంట్,
ఎడిటింగ్ ః కోటగిరి వెంకటేశ్వరరావు,
కొరియోగ్రఫీః విజయ్ పొలాకి,
స్టంట్స్ః రామ్ సుంకర,
పి.ఆర్.వో- జి.ఎస్.కె మీడియా
నిర్మాతః ధ్యాన్ అట్లూరి,
రచన,దర్శకత్వంః కరుణ కుమార్