నువ్వే నా ప్రాణం మూవీ రివ్యూ

నువ్వే నా ప్రాణం మూవీ రివ్యూ

నువ్వే నా ప్రాణం మూవీ రివ్యూ!!
 న‌టీన‌టులుః కిర‌ణ్ రాజ్‌, ప్రియా హెగ్డే, సుమ‌న్‌, భానుచంద‌ర్‌, తిల‌క్‌, గిరి, సోనియా చౌద‌రి  త‌దిత‌రులు
 సంగీతంః మ‌ణిజెన్నా,
నేప‌థ్య సంగీతంః రాజా
ఫైట్స్ః మ‌ల్లి
నిర్మాతః శేషు మలిశెట్టి
ద‌ర్శ‌క‌త్వంః శ్రీకృష్ణ మ‌లిశెట్టి

రేటింగ్ః3/5

టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌ల‌తో ఇటీవ‌ల కాలంలో ప్రేక్ష‌కుల‌ను అత్యంత ఆకర్షించిన చిత్రం `నువ్వే నా ప్రాణం`. ఆదిత్య ఆడియో ద్వారా విడుద‌లైన ఈ చిత్రంలోని ప్ర‌తి పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. యూట్యూబ్ లో , సోష‌ల్ మీడియాలో, ఇన్ స్టా రీల్స్ లో పాట‌లు వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై అటు ఇండ‌స్ట్రీలో ఇటు ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ రోజు విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాలకు రీచ్ అయ్యిందో లేదో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
 క‌థః
 గైన‌కాల‌జిస్ట్ అయిన కిర‌ణ్మ‌యి( ప్రియా హెగ్డే)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు ఐపియ‌స్ ఆఫీస‌ర్ అయిన ( హీరో కిర‌ణ్ రాజ్) సంజు. కిర‌ణ్మ‌యిని ప్రేమ‌లో ప‌డేయ‌డానికి నానా తంటాలు పడి త‌న మ‌న‌సును గెలుచుకుంటాడు సంజు. ఇరు కుటుంబాల ఒప్పందంతో పెళ్లి చేసుకుంటారు. ఇలా చాలా  సాఫీగా సాగిపోతున్న  సంజు జీవితంలోకి  కొంత మంది తీవ్ర‌వాదులు ఎంట‌ర‌వుతారు. ఈ క్ర‌మంలోనే సంజుకి, కిర‌ణ్మ‌యికి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి అవి విడాకులు వ‌ర‌కు దారి తీస్తాయి. అంత‌గా ప్రేమించిన సంజు…కిర‌ణ్మ‌యిని ఎందుకు కాద‌నుకుంటాడు? అస‌లు ఆ తీవ్ర‌వాదులు సంజు వెంట ఎందుకు ప‌డుతున్నారు?  చివ‌ర‌కు సంజు, కిరణ్మ‌యి ఒక‌ట‌వుతారా?  లేదా?  తెలియాలంటే `నువ్వే నా ప్రాణం` చిత్రం చూడాల్సిందే.

 న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్ః
 ల‌వ‌ర్ బాయ్‌గా, సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా కిర‌ణ్ రాజ్  ప‌ర్ఫ‌క్ట్ గా యాప్ట్ అయ్యాడు. క‌న్న‌డ న‌టుడు అయినా అచ్చ‌మైన తెలుగు కుర్రాడుగా ఒదిగిపోయాడు. త‌న ప‌ర్ఫార్మెన్స్, డాన్స్, ఫైట్స్ అన్నీ బాగా కుదిరాయి. అలాగే క‌న్న‌డ హీరోయిన్ అయిన ప్రియా హెగ్డే కూడా గైన‌కాల‌జిస్ట్ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఆమె అందం, అభిన‌యం రెండూ ఆక‌ట్టుకుంటాయి. సుమ‌న్, భానుచంద‌ర్, తిల‌క్ ఎప్ప‌టిలాగే వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
 సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
ముందుగా డైర‌క్ట‌ర్ శ్రీకృష్ణ మ‌లిశెట్టి గ‌ట్స్ మెచ్చుకోవాలి. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎటువంటి అనుభ‌వం లేకుండా ఒక ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించి..దాన్ని విజ‌య‌వంతంగా రిలీజ్ చేసినందుకు. యువ‌త ఆలోచ‌న‌లు, హైఫై ఫ్యామిలీస్ వింత పోక‌డ‌లు తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేస్తూనే..ఒక స్వ‌ఛ్చ‌మైన ప్రేమ‌క‌థ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. కొత్త ద‌ర్శ‌కుడైనా త‌ను చెప్పాల‌నుకున్న‌ది ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా  సూటిగా చెప్పారు. అక్క‌డ‌క్క‌డా కొన్ని సీన్స్ మినహా బోర్ కొట్ట‌కుండా చూసుకున్నారు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా మంచి ల‌వ్ స్టోరీగా ఎంట‌ర్ టైన్ చేస్తూ సెకండాఫ్ లో అంద‌ర్నీ ఆలోచింప‌జేసేలా సినిమా ఉంటుంది.  సెకండాఫ్ గాడి త‌ప్పింది అనుకునే లోపే ప్రీ క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఇచ్చి అందర్నీ షాక్ కు గురి చేశారు ద‌ర్శ‌కుడు.  కొత్త క‌థ కాకున్నా…త‌న  బ్రిలియంట్  స్క్రీన్ ప్లే తో ద‌ర్శ‌కుడు ఆడియ‌న్స్ ని మెప్పించాడు అన‌డంలో సందేహం లేదు.   ఇక నువ్వే నా ప్రాణం చిత్రానికి పాట‌లు హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. పాట‌ల‌న్నీ కూడా విన‌డానికి, చూడ‌టానికి బావున్నాయి. ఆర్‌.ఆర్ బావుంది.  ఫైట్స్ ఓకే. నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ‌కు కావాల్సినంత ఖ‌ర్చు పెట్టారు.

 ఫైన‌ల్ గా చెప్పాలంటేః
 ఇటీవ‌ల కాలంలో ఇలాంటి  ల‌వ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రాలు రాలేద‌నే చెప్పాలి. యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడొచ్చు. ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా చ‌క్క‌టి పాట‌లు, చక్క‌టి హీరో హీరోయిన్ల జంట‌, క‌లర్ ఫుల్ సినిమాటోగ్ర‌పీ , అర్ధ‌వంతమైన మాట‌లతో నువ్వే నా ప్రాణం చిత్రం ఆక‌ట్టుకుంటుంది. గో అండ్ వాచ్..డోంట్ మిస్.