‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్రం నుంచి విడుదల అయిన మరో గీతం !!

‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’  చిత్రం నుంచి విడుదల అయిన మరో  గీతం !!

  ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్రం నుంచి విడుదల అయిన మరో గీతం !!
  యూత్ స్టార్ నితిన్ అండ్ కో  పై చిత్రీకరించిన సందర్భోచిత గీతం.

 కథానాయకుడు నితిన్ పరిచయ గీతం ఇదంటున్న గీత రచయిత శ్రీ మణి

యూత్ స్టార్  ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్ర లోని మరో గీతం ఈరోజు  విడుదల అయింది. 

కథానుసారం చిత్ర కథా నాయకుడు పరిచయ గీతం గా కనిపించే, వినిపించే ఈ సందర్భోచిత గీతం  వివరాల్లోకి వెళితే …..
 
” సన్ లైట్ ను చూసి నేర్చుకుని ఉంటే 
ఫుల్ మూన్ కూల్ గా ఉండేవాడా
క్లాస్ మేట్  ని చూసి నేర్చుకుని ఉంటే
ఐన్ సైంటిస్ట్  అయ్యే వాడా….?”
అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు డేవిడ్ సీమన్  గాత్రంలో ఈ గీతం హుషారుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు ముఖ్యంగా యువతను, అలాగే సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి.  నితిన్ తో పాటు చిత్రంలోఅతని మిత్రులు అభినవ్ గోమటం, సుహాస్ బృందంపై  శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఈ గీతాన్ని వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి.. 
 
చిత్ర కథానుసారం కథానాయకుడు పరిచయ గీతం గా ఇది వస్తుంది అని తెలిపారు గీత రచయిత శ్రీ మణి. చిత్రంలోని ప్రతిపాట సందర్భ శుద్ధి గానే సాగుతాయి. కథను చెబుతాయి. ఈ పాట కూడా అంతే. దర్శకుడు వెంకీ గారు చిత్రం లో పాట కు ఉండే సందర్భాన్ని వివరించే తీరు  పాటలు ఇంత బాగా రావటానికి కారణం ఆన్నారు శ్రీ మణి. 
 
‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం వరుసగా విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, లిరికల్ వీడియో గీతాలు మరింత పెరిగేలా చేస్తూనే ఉన్నాయి.
 
యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం
‘రంగ్ దే’. ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.
 

 ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
 
 
  Nithin, Keerthy Suresh’s Rang De movie’s  song has been released. 
 Youth Star Nithiin and co are featuring in this peppy song.
 Nithin’s introductory song written by  Srimani
 
Youth Star Nithiin, Keerthy Suresh’s Rang De movie’s  song has been released. More details about the introductory song of the hero –
Srimani has penned ghe lyrics for this song. David Simon has lent his voice for the vocals. Devi Sri Prasad has composed this song in a fashion to attract both the youth and music lovers. Other than the lead actor Nithin, his friends Abhinav Gomatam and Suhas are featured in the song. Shekhar Master’s choreography teamed up with Venky Atluri’s direction has ensured that this song would be a spectacle on the silver screen
 
According to the story, this song is the introductory song for the hero. The lyrics have been penned by Srimani. All the songs in the movie are situational songs which take the story forward.   Director Venky Atluri’s vision of emotion is the primary reason for the song’s to have garnered such popularity according to the lyrist Srimani.
 
On the occasion of ‘Rang De’ releasing on March 26th the promotions and the related events have been ramped up the the team. Youth Star ‘Nithiin’ and leading actress ‘Keerthy Suresh’s combination on the silver screen promises to be enthralling and mesmerizing going by the articles, videos and songs that have been released so far.
 
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.