Nikhil’s – Chandu mondeti – people media factory – “Karthikeya 2” Movie Opening

Nikhil’s – Chandu mondeti – people media factory – “Karthikeya 2” Movie Opening

 

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ అర్ట్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న కార్తికేయ‌2 మార్చి 2 న తిరుమ‌ల తిరుప‌తి లో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం

నిఖిల్‌, చందు మెుండేటి ల కాంబినేష‌న్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2, ఈ రోజు తిరుమ‌ల తిరుప‌తి లోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధానం లో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు శ్రీ భుమాన క‌రుణాక‌ర‌న్ రెడ్డి పూజా కార్య‌క్ర‌మానికి హాజ‌రై కెమెరా స్విఛ్ ఆన్ చేయ‌గా, భూమాన త‌న‌య‌డు శ్రీ అభిన‌య‌ రెడ్డి హీరో నిఖిల్ పై క్లాప్ కొట్టి కార్తీకేయ 2 షూటింగ్ ని ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు చందుమొండేటి, నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగర్వాల్, స‌హానిర్మాత వివేక్ కుచిభోట్ల, చిత్ర యూనిట్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా  

హీరో నిఖిల్ మాట్లాడుతూ
ద‌ర్శ‌కుడు చందుమొండేటి రెడీ చేసిన కార్తీకేయ ఓ రేంజ్ లో‌ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఆ సినిమాలో ఎనిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్ ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి ప‌రిచ‌యం చేశారు. ఇన్నాళ్ళ‌కి మ‌ళ్ళి మా ఇద్ద‌రి కాంబినేష‌న్ లో కార్తికేయ2 రెడీ అవుతుండ‌టం చాలా ఎక్సెటింగ్ గా అనిపిస్తోంది. అంతేకాదు తిరుమ‌ల తిరుప‌తి లోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధానం లోని పూజాకార్య‌క్ర‌మాల‌తో ఈ సీక్వెల్ ప్రారంభం కావ‌టం చాలా ఆనందంగా ఉంది. అలానే  ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక అతిధిగా విచ్చేసిన తిరుప‌తి శాస‌న‌స‌భ సభ్యులు భుమాన క‌రుణాక‌ర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్య‌వాదాలు. ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామివారి పదాల చెంత సినిమా స్క్రిప్ట్ ను ఉంచి స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నామని,అఈ సినిమాలో భారతీయ సంప్రదాయాలను అద్భుతంగా చూపెడుతున్నామని, ఉగాది తర్వాత రెగ్యులర్ గా చిత్రీకరణ మొద‌లు పెట్టి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపారు నిఖిల్.

శ్రీ భుమాన‌క‌రుణాక‌ర్ రెడ్డి మాట్టాడుతూ

నిఖిల్ హీరోగా చందుముండేటి డైరెక్ష‌న్ లో కార్తికేయ 2 చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్స‌వం, శ్రీ త‌రుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధిలో జ‌ర‌గ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, శ్రీ కృష్ట‌ని చుట్టూ అల్లుకున్న క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని నిర్మాత‌లు విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ త‌న‌కు తెలుప‌గానే చాలా సంతోషమేసంద‌ని, గ‌తంలో వ‌చ్చిన కార్తీకేయ ని ఆడియెన్స్ ఎంత‌గా ఆదించారో అంత‌కు మించి ఈ సీక్వెల్ ని ఆదిరిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లుగా భుమాన తెలిపారు.

శ్రీ అభిన‌య‌ రెడ్డి మాట్లాడుతూ

నిఖిల్ గారికి కార్తీకేయ 2తో మ‌రో విజ‌యం రావడం ఖాయంగానే అనిపిస్తోంది. గ‌తంలో వ‌చ్చిన కార్తీకేయ త‌న‌ను ఎంతో ఆట‌క్టుకుంద‌ని, ఈ సినిమా సీక్వెల్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాన‌ని, ద‌ర్శ‌కుడు చందుమొండేటి ఈ సీక్వెల్ ని మెద‌టి వెర్ష‌న్ ని మించే రేంజ్ లో రూపొందిస్తార‌ని ఆశిస్తున్నట్టుగా అభిన‌య్ చెప్పారు. దాంతో పాటు ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి త‌న‌ను ఆహ్వానించిన చిత్ర నిర్మాత‌లు విశ్వ‌ప్ర‌సాద్ గారికి, అగర్వాల్ గారికి, స‌హా నిర్మాత వివేక్ గారికి అభిన‌య్ ప్ర‌‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగర్వాల్, ద‌ర్శ‌కుడు చందు మొండేటి, కో ప్రొడ్యూస‌ర్ వివేక్ మాట్లాడుతూ

కార్తీకేయ 2 చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్స‌వాన్ని శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామీ స‌న్నిధిలో జ‌రుపుకోవ‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో కార్తికేయ సీక్వెల్ ఎప్పుడు అని ఇటు నిఖిల్ ని, అటు ద‌ర్శ‌కుడు చందు మెుండేటి ని కామెంట్ చెయ్య‌ని నెటిజ‌న్స్ లేర‌నే చెప్పాలి. అంత‌లా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన కార్తీకేయ 2 కి సంబంధించిన టైటిల్ లోగోకి, కాన్సెట్టి వీడియోకి భారీ రేంజ్ లో రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్ కూడా క‌చ్ఛితంగా ఆడియెన్స్ కి ఓ స్పెష‌ల్ థ్రిల్ ఇస్తుంది. ఇక ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన తిరుప‌తి శాస‌నస‌భ్యులు, శ్రీ భూమాన కుర‌ణాక‌ర్ రెడ్డి, అలానే అవినాష్ రెడ్డి గారి కి ప్రత్యేకంగా కృత్ఞ‌తులు చెప్పారు.

బ్యాన‌ర్‌..  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రోడ్యూస‌ర్ .. వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు.. టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం.. చందు మెుండేటి