New Movie with VJ Sunny as hero launched by Full Moon Media Productions

ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై వి.జె.సన్నీ హీరోగా నూతన చిత్రం ప్రారంభం!!
వినోద ప్రధానమైన చిత్రాలు అందించాలన్న సంకల్పంతో , అభిరుచితో టెక్సాస్ కు చెందిన ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థ చలనచిత్ర ప్రపంచంలో సరికొత్త సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా బిగ్ బాస్ ఫేమ్ , ఏటియమ్ వెబ్ సిరీస్ తో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.జె.సన్నీ హీరోగా ఓ చిత్రాన్ని ఫిబ్రవరి 9న గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభించారు. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి మరియు రేఖ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది.
ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ సంస్థ అధినేతలు మాట్లాడుతూ…“ వి.జె. సన్నీ హీరోగా ఈ రోజు మా చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించాం. ఈ రోజు నుండి కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశాం . ఎంతో ప్రతిభావంతులైన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పని చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, దర్శకులు మరియు నిర్మాతలను కనెక్ట్ చేసే టాలెంట్-స్కౌటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన Hunt4Mint తో చేతులు కలపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేయడంతో పాటు వారి ద్వారా మరిన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతో అభిరుచితో ప్రారంభించిన మా సంస్థ నుండి మంచి చిత్రాలు చేయనున్నాం. త్వరలో మా చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తాం“ అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ః కార్తీక్ శ్రీనివాస్; సంగీతంః మదీన్; ఆర్ట్ డైరెక్టర్ః రాజీవ్ నాయర్; చీఫ్ కో-డైరెక్టర్ః చిన్న; కో -డైరెక్టర్ః సంతోష్ కృష్ణ; అసోసియేట్ డైరెక్టర్ః యశ్వంత్; అసిస్టెంట్ డైరెక్టర్ః యష్ ; పిఆర్ ఓః లక్ష్మీగణపతి- వంగాల కుమారస్వామి; నిర్మాణంః ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ ; దర్శకత్వ పర్యవేక్షణః వి.జయశంకర్; రచన-దర్శకత్వంః సంజయ్.