నెట్ ఫ్లిక్స్ మొదటి తెలుగు ఫిలిం పిట్ట కథలు
NETFLIX ANNOUNCES FIRST TELUGU FILM, PITTA KATHALU
Brings together four incredibly talented directors, Tharun Bhascker, B.V. Nandini Reddy, Nag Ashwin and Sankalp Reddy, to helm an anthology about distinctly bold women
Mumbai, 20th January, 2021: Netflix today announced its first Telugu original film, Pitta Kathalu. The four-part anthology film is directed by four of the finest stalwarts of Telugu cinema – Tharun Bhascker, B.V. Nandini Reddy, Nag Ashwin and Sankalp Reddy. Pitta Kathalu, which means short stories in Telugu, tells the stories of four distinctly bold women. Bringing these characters to life are Eesha Rebba, Lakshmi Manchu, Amala Paul and Shruti Haasan in lead roles. Pitta Kathalu also stars Ashima Narwal, Jagapathi Babu, Satya Dev, Saanve Megghana, Sanjith Hegde among many other well-known names.
Produced by Ronnie Screwvala’s RSVP Movies and Ashi Dua Sara’s Flying Unicorn Entertainment, Pitta Kathalu will premiere exclusively on 19th February on Netflix across 190 countries.
National Film Award-winning director, Tharun Bhascker said, “Pitta Kathalu is a labour of love with every story in the anthology showcasing a beautiful landscape of the country and presenting women-led stories that will touch a chord with the audience. Working with other extremely talented directors and incredible actors was an opportunity to cherish. It is time for regional Indian content to shine on the global stage.”
Director of numerous hits, director B.V. Nandini Reddy said about her first Netflix film,“Collaborating with Netflix and the accomplished cast of Pitta Kathulu has been a very rewarding experience. Working with gifted directors who seek to travel on newer paths of storytelling has helped us bring forth authentic human stories and a differentiated take on relationships. We hope these stories will have a universal impact with the massive reach that Netflix provides.”
Filmfare Award-winning director, Nag Ashwin said, “With this the first Telugu original by Netflix, I really wanted to push the boundaries of what people expect from the medium. I hope Pitta Kathalu, the four different stories of this anthology, the four unique worlds the directors have created will connect with people, not just in the Telugu speaking states but across the world.”
National Film Award-winning director, Sankalp Reddy said, “I am very excited to announce my first Netflix film, Pitta Kathalu. The film brings four stories to life and explores some unique themes that we hope will interest viewers. It is incredible that these stories will travel to millions of viewers globally with Netflix.”
Srishti Behl Arya, Director, International Original Films, Netflix India said, “Great stories can come from anywhere. As we expand our film slate and tell more stories that are rooted in all corners of the country, we are thrilled to bring the magic of Telugu storytelling to Netflix, with Pitta Kathalu. This anthology was a wonderful opportunity to work with imaginative storytellers and incredible talent who have pushed the creative boundaries. We can’t wait for our members in India and around the world to discover these intricate, well-told stories.”
Pitta Kathalu will release on 19th February, 2021, exclusively on Netflix!
CREDITS:
Movie: Ramula
Director and writer: Tharun Bhascker
Cast: Machu Lakshmi, Saanve Megghana, Naveen Kumar
Movie: Meera
Director : B.V. Nandini Reddy
Writer: Radhika Anand
Cast: Jagapathi Babu, Amala Paul, Aswin Kakamanu
Movie: xLife
Director and writer: Nag Ashwin
Cast: Shruti Haasan, Sanjith Hegde, Sangeet Shobhan, Anish Kuruvilla, UKO, Dayanand Reddy, Thanmayi
Movie: Pinky
Director : Sankalp Reddy
Writer: Emani Nanda Kishore
Cast: Satya Dev, Eesha Rebba, Srinivas Avasarala, Ashima Narwal
About Netflix
Netflix is the world’s leading streaming entertainment service with over 195 million paid memberships in over 190 countries enjoying TV series, documentaries and feature films across a wide variety of genres and languages. Members can watch as much as they want, anytime, anywhere, on any internet-connected screen. Members can play, pause and resume watching, all without commercials or commitments.
For the latest news, updates and entertainment from Netflix India, follow us on IG @Netflix_IN, TW @NetflixIndia and FB @NetflixIndia
About RSVP
The vision of RSVP is to develop and create stories that must be told, stories that we would love to tell and stories that people go to the movies for. Younger audiences are closing the mediums of their choice and we maintain it’s an audience revolution and evolution more than a technology one. The goal is to constantly innovate and disrupt in this space of movies, digital content and the new age of documentaries.
Following this vision, RSVP has successfully produced Love Per Square Foot, Lust Stories, Karwaan, Pihu, Kedarnath, Uri – The Surgical Strike, Sonchiriya , Raat Akeli Hain, The Sky is Pink and Mard Ko Dard Nahi Hota. The upcoming films under the banner are Rashmi Rocket, Tejas, Pippa and Sam Maneckshaw.
About Flying Unicorn
Flying Unicorn Entertainment is an independent production house founded by Ashi Dua Sara. She pioneered the anthology film genre in India first with Bombay Talkies and then Lust Stories, working with four of the biggest directors in Bollywood – Zoya Akhtar, Dibakar Banerjee, Anurag Kashyap, and Karan Johar. She also produced Kaalakaandi, a Saif Ali Khan starrer caper black-comedy.
*నెట్ ఫ్లిక్స్ మొదటి తెలుగు ఫిలిం పిట్ట కథలు*
ఆధునిక స్వాతంత్ర్య భావాలు గల విలక్షణమైన మహిళల గురించి ఒక కథా సంకలనాన్ని నడిపించడానికి అద్భుతమైన ప్రతిభావంతులైన నలుగురు దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలను ఒక చోట చేర్చింది నెట్‌ఫ్లిక్స్.
నెట్‌ఫ్లిక్స్ ఈరోజు తన మొదటి ఒరిజనల్ తెలుగు ఫిలిం ‘పిట్టకథలు’ ప్రకటించింది. ఈ నాలుగు భాగాల ఆంథాలజీ చిత్రానికి నలుగురు తెలుగు సినిమా అత్యుత్తమ దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలు దర్శకత్వం వహించారు. సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను పిట్టకథలు అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల నలుగురు మహిళల గురించి చెబుతుంది. ఈ నాలుగు పాత్రలకు ప్రాణం పోయడానికి ఈషా రెబ్బా, లక్ష్మి మంచు, అమలా పాల్, మరియు శృతిహాసన్ ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే అషిమా నర్వాల్, జగపతిబాబు, సత్యదేవ్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రోనీ స్క్రూవాలా యొక్క RSVP మూవీస్ మరియు ఆశి దువా సారా యొక్క ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన `పిట్టకథలు` 190 దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.
నేషనల్ ఫిలిం అవార్డు గ్రహీత తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “పిట్ట కథలు ఫిలింలోని ప్రతి కథ దేశంలోని ఒక్కో అందమైన సంస్కృతిని ఆవిష్కరిస్తుంది. మహిళల నేతృత్వంలోని ఈ కథలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎంతో ప్రతిభావంతులైన దర్శకులతో, నటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రాంతీయ భారతీయ కంటెంట్ ను ప్రపంచ వేదికపై ప్రకాశింపజేసే సమయం” అన్నారు.
ప్రముఖ దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి తన మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం గురించి మాట్లాడుతూ – “నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిట్టకథలు చిత్రానికి ఇంత మంచి తారాగణం కుదరడం నిజంగా గొప్ప విషయం. కొత్త మార్గాల్లో ప్రయాణించాలనుకునే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మానవ సంబంధాలను, కథలను సహజంగా, ఒక కొత్త కోణంలో చూపించడానికి దోహద పడింది. నెట్‌ఫ్లిక్స్ లాంటి భారీ వేదిక ఈ కథలను గ్లోబల్ ప్రేక్షకులకు దగ్గిర చేస్తుంది.” అన్నారు.
ఫిలింఫేర్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – “ నెట్‌ఫ్లిక్స్ మొదటి తెలుగు ఒరిజినల్ ఫిలిం పిట్టకథలు, ప్రేక్షకుల అభిరుచిని మరింత విస్తృత పరిచేలా ఉంటుంది . ఈ నలుగురు దర్శకులు సృష్టించిన నాలుగు వేర్వేరు కథలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి“ అన్నారు.
నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ – “నా మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం పిట్టకథలు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాలుగు కథలు నాలుగు ప్రత్యేకమైన ఇతివృత్తాలతో కలిగి ఉండి ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రేక్షకుల వరకు ప్రయాణించగలవని నమ్మకం ఉంది“ అన్నారు
నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ సృష్టి బెహ్ల్ ఆర్య మాట్లాడుతూ – “గొప్ప కథలు ఎక్కడి నుండైనా రావచ్చు. మేము దేశం నలుమూలలకు చెందిన కథలను చెప్పి మా ఫిల్మ్ స్లేట్‌ను విస్తరించాలనుకుంటున్నాము. ఈ క్రమంలో భిన్నమైన శైలి కలిగిన తెలుగు స్టోరీ టెల్లింగ్ ను ‘పిట్టకథలు’ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సభ్యుల కోసం ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం“ అన్నారు.
పిట్టకథలు 19 ఫిబ్రవరి 2021 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది
*టైటిల్ : రాముల*
నటీనటులు: మంచు లక్ష్మి, సాన్వే మేఘన, నవీన్ కుమార్,
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్.
*టైటిల్: మీరా*
నటీనటులు: జగపతిబాబు, అమలాపాల్, అశ్విన్ కకమను,
రచన: రాధిక ఆనంద్,
దర్శకత్వం: బి.వి నందిని రెడ్డి.
*టైటిల్: ఎక్స్ లైఫ్*
నటీనటులు: శృతిహాసన్, సంజిత్ హెగ్డే, సంగీత్ శోభన్, అనీష్ కురువిల్లా, యుకెఒ, దయానంద్ రెడ్డి, తన్మయి..
రచన,దర్శకత్వం: నాగ్ అశ్విన్,
*టైటిల్: పింకీ*
నటీనటులు: సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, అశిమా నర్వాల్,
రచన: ఎమని నందకిషోర్
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.
నెట్‌ఫ్లిక్స్ గురించి
నెట్‌ఫ్లిక్స్ 190 కి పైగా దేశాలలో 195మిలియన్లకుపైగా సభ్యత్వాలతో మూవీస్, టీవీ సిరీస్‌లు, డాక్యుమెంటరీలను అందిస్తోంది. సభ్యులు తమకు కావలసిన కంటెంట్‌ను ఇంటర్నెట్-కనెక్ట్ స్క్రీన్తో ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. సభ్యులు వాణిజ్య ప్రకటనలు లేకుండా పాజ్ చేయడం మరియు చూడటం తిరిగి ప్రారంభించవచ్చు.
RSVP గురించి
మనం చెప్పవలసిన, చెప్పడానికి ఇష్టపడే కథలను అభివృద్ధి చేయడం మరియు సృష్టించడం
RSVP యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ క్రమంలో RSVP విజయవంతంగా లవ్ ఫర్ స్క్వేర్ ఫూట్, లస్ట్ స్టోరీస్, కార్వాన్, పిహు, కేధార్‌నాథ్, ఉరి – ది సర్జికల్ స్ట్రైక్, సోంచిరియా, రాత్ అకేలి హై, ది స్కై ఈజ్ పింక్ మరియు మర్ద్‌కొ దర్ద్ నాహి హోతా వంటి చిత్రాలను నిర్మించింది.
ఈ బేనర్‌లో రాబోవు చిత్రాలు రష్మి రాకెట్, తేజస్, పిప్పా మరియు సామ్ మానేక్షావ్
ఫ్లయింగ్ యునికార్న్ గురించి
ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆషి దువా సారా చేత స్థాపించబడిన ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ. ఆమె మొదట బొంబాయి టాకీస్ మరియు తరువాత లస్ట్ స్టోరీస్‌తో కలిసి భారతదేశంలో ఆంథాలజీ ఫిల్మ్ కళా ప్రక్రియకు మార్గదర్శకత్వం వహించారు ప్రస్తుతం జోయా అక్తర్, దిబకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్ మరియు కరణ్ జో హార్ వంటి నలుగురు బాలీవుడ్‌లో అతిపెద్ద దర్శకులలో కలిసి పని చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన కాలాకాండిని కూడా ఫ్లయింగ్ యునికార్న్ నిర్మించింది