నెపోటీజం ట్రైలర్ ను రిలీజ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ వేణుగోపాలచారి
నెపోటీజం ట్రైలర్ ను రిలీజ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ వేణుగోపాలచారి
నవంబర్ 14న xappie అప్ ద్వారా గ్రాండ్ రిలీజ్
పాపిన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కొర్రపాటి వెంకట రమణ సమర్పణలో, విపుల్ దర్శకత్వంలో, వై అనిల్ కుమార్, కే.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం *నెపోటిజం*. వెంకీ, వాసిం,వెంకట్ పొడి శెట్టి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపావళి కానుకగా నవంబర్ 14న xappie అప్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను సంస్థ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ వేణుగోపాల చారి రిలీజ్ చేశారు. మరియు xappie లో మొదటి టిక్కెట్ ను తెలంగాణ కార్మిక శాఖ నాయకులు రాంబాబు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ వేణుగోపాల చారి మాట్లాడుతూ: డైరెక్టర్ వి పుల్ పవన్ కళ్యాణ్ అభిమాని మా ప్రాంత వాస్తవ్యుడు. బంధు ప్రీతి అనేది ప్రతి ఒక్క రంగం లో వుంది. డాక్టర్ కొడుకు డాక్టర్, లాయర్ కొడుకు లాయర్, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్, స్టార్ కొడుకు స్టార్ అవ్వటం లో తప్పేమీ లేదు. అయితే వాళ్ళ టాలెంట్ వల్ల వాళ్ళ నైపుణ్యం వల్ల మాత్రమే వాళ్ళు ఆయా రంగాలలో నిలదొక్కు కొగలరు. బంధు ప్రీతి వల్ల స్టార్ గా ఎవ్వరూ ఎదగరు. ఎంతో శ్రమ తో డెడికేటెడ్ తో ఫంక్తువాలిటి తో స్టార్స్ గా ఎదిగుతారు. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నీ అందరూ ఆదరించాలి నవంబర్ 14న xappie ద్వారా రిలీజ్ అవుతుంది అని అన్నారు
తెలంగాణా కార్మిక నాయకులు రాంబాబు గారు మాట్లాడుతూ: ట్రైలర్ బాగుంది. సహజంగా తండ్రులు ఒక వృత్తి లో నైపుణ్యం సంపాదించి నప్పుడు వాళ్ళ పిల్లలు ఆ వృత్తి లో నైపుణ్యం లేకపోయినా వస్తు వుంటారు. అయితే వాళ్ళల్లో టాలెంట్ వుంటేనే ఆ రంగంలో నిలదొక్కుకో గలుగుతారు. ఈ కరోనా టైం లో థియేటర్స్ లేవు ఇప్పుడు ప్రేక్షకులు ఓటిటి సౌకర్యాన్ని వినియోగించు కుంటున్నారు. ఈ నెపోటిజం సినిమా xappie ద్వారా రిలీజ్ అవుతుంది. 99రూపాయల టిక్కెట్. అందరూ ఈ సినిమా చూసి ఈ టీమ్ ను ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త శ్రీ కంఠమనేని శివ శంకర్ మాట్లాడుతూ: ఈ సినిమా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అనిపిం చి నేను ఒక లీడ్ రోల్ లో నటించాను. నెపొటిజం లేని ఫీల్డ్ లేదు. ఒక డాక్టర్ అతని కొడుకుని డాక్టర్ చేయాలనుకోవడం లో తప్పులేదు దేనికైనా బేసికల్ గా కమిట్ మెంట్, హార్డ్ వర్క్ వుండాలి. ఈ రెండు లెకుండా ఫ్లాట్ ఫామ్ వుంటే సరిపోదు.ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా వుంటుంది అని అన్నారు.దర్శకుడు విపుల్ మాట్లాడుతూ; సక్సెస్ ఫుల్ గా సినిమా కంప్లీట్ చేసుకొని నవంబర్ 14న xappie అప్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. ఇటీవలే తమ్మారెడ్డి భరద్వాజ గారు లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మంచి అప్లాజ్ వచ్చింది. నెపొటిజం అన్ని ఇండస్ట్రీస్ లో చూస్తున్నాము. నే పొటిజం వున్న వాళ్ళు ఎంత సక్సెస్ లో వున్నారు. లేని వాళ్ళు ఎంత సక్సెస్ లో వున్నారు. కొన్ని అశాలతో ఇండస్ట్రీ కొచ్చిన్న నలుగురు కుర్రాళ్ళు కథ ఇది. నేను ఉద్దేశ్య పూర్వకంగా గాని ఎవ్వరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. అందరూ నవంబర్ 14న xappie అప్ ద్వారా చూడండి అని అన్నారు
నిర్మాత అనిల్ కుమార్ మాట్లాడుతూ:నెపొటిజం సినిమాని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాము.ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తియ్యలేదు .ఇండస్ట్రీ కి వచ్చిన నలుగురు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా. మరొక నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ: మా మిత్రుడు విపుల్ డైరెక్షన్ లో ఈ సినిమా తీసాము. నవంబర్ 14న xappie అప్ ద్వారా రిలీజ్ అవుతుంది అందరూ చూడాలని కోరుకుంటున్నాను అన్నారు చిత్ర సమర్పకులు కొర్రపాటి వెంకట రమణ మాట్లాడుతూ; నవంబర్ 14రిలీజ్ అవుతున్న నెపొటిజం సినిమా ను అందరూ చూసి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
మ్యూజిక్: మేఘవత్
సినిమాటోగ్రఫీ: ఆర్ రాఘవేంద్ర
ఎడిటింగ్: వి నాగిరెడ్డి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మహావీర్
కొరియోగ్రఫర్: మహావీర్
కో ప్రొడ్యూసర్స్: కొసరాజు శివరామకృష్ణ, కే.కృపాకర్.