Neelakasham Album Song Launch
ఎస్ ఎస్ థమన్ చేతుల మీదుగా “నీలాకాశం” ఆల్బమ్ విడుదల..
సినీ సంగీతం వివి విని అలసిన శ్రోతలకు ‘నీలాకాశం’ అనే సరికొత్త తెలుగు ఆల్బమ్ స్వాన్తన కలిగించనుంది. ‘సీతారామరాజు’ అనే కొత్త సంగీత దర్శకుడు మరియు పాటల రచయిత దీనితో పరిచయం అవుతున్నారు. కృష్ణ తేజస్వి, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ చెన్ను, నికిత శ్రీవల్లి, మనీషా
పండ్రంకి మొదలగు కొత్త గాత్రాలు సందడి చేయనున్నాయి. ఈ టీమ్ వైజాగ్, చెన్నై, ముంబై మొదలగు చోట్ల స్టూడియోలలో శ్రమించి ఆహ్లాదమైన పాటలను ముందుకు తీసుకు వచ్చారు. ఈ మధురమైన నీలాకాశం ఆల్బమ్ ‘వాటర్ లెమన్ రికార్డ్స్’ అనే కొత్త ఆడియో సంస్థ ద్వారా మార్కెట్ లోనికి రానున్నాయి. ఈ విడుదల కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మరియు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిచే శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ థమన్ మాట్లాడుతూ…ఆశీర్వాద్ గారికి మాకు చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. చెన్నైలో తరచూ కలుస్తుంటాము. మా నాన్న గారికి ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ కమ్యూనికేషన్ తోనే నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా మందికి లైట్ మ్యూజిక్ చాలా పాటలకు ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు అదొక మెడిసిన్ కూడా.. ఇలాంటి లైట్ మ్యూజిక్ ను సీతారామ రాజు, ఆశీర్వాదం గారు శ్రోతలకు అందించడానికి చేసే ఈ ప్రయత్నం ఎంతో గొప్పది. ఈ నీలాకాశం ఆల్బమ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగర్స్ అందరికీ బెస్ట్ విషెస్ తెలువుతున్నా అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. గంటశాల గారు అప్పట్లో ఇలాంటి లైట్ మ్యూజిక్ నే చేసేవారు. ఆలాంటి మ్యూజిక్ వలనే ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్స్ సాంగ్స్ వచ్చాయి. ఆ తరాన్ని అనుసరిస్తూ ఇప్పుడు నీలాకాశం అనే లైట్ మ్యూజిక్ ఆల్బమ్ ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏ జనరేషన్ కు అయినా.. ఎప్పుడు విన్నా ఈ లైట్ మ్యూజిక్ ఆహ్లాదంగా అనిపిస్తూనే ఉంటుంది. వీరి స్ఫూర్తి తో మరెన్నో లైట్ మ్యూజిక్స్ రావాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఆల్బమ్ లో పాడిన నూతన సింగర్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా అన్నారు.
సీతారామ్ రాజు మాట్లాడుతూ.. మేము అడగ్గానే నీలాకాశం ఆల్బమ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అన్నారు.
ఆశీర్వాదం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన థమన్ మరియు భరద్వాజ్ అలానే సిగర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ నీలాకాశం మ్యూజిక్ ఆల్బమ్ లో అటు అందమైన మెలోడీలతో పాటు ఆధునికమైన అమరికతో కూడిన సంగీతాన్ని వినచ్చు అని తెలియచేసారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సింగర్స్ కృష్ణ తేజ, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు