నరసింహపురం మూవీ రివ్యూ
`నరసింహపురం` రివ్యూ
నటీనటులుః నందకిషోర్, విజయ్ కుమార్, హనుమంతు, ఉషశ్రీ, విజయ్ కుమార్, రవివర్మ బళ్లా, రంగధామ్
ఎడిటర్ః శివ. వై .ప్రసాద్
సంగీతంః ఫ్రాక్లిన్ సుకుమార్
నిర్మాతలుః శ్రీరాజ్ బళ్లా, ఫణిరాజ్ గౌడ్, నందకిషోర్ ధూళిపాల
దర్శకుడుః శ్రీరాజ్ బళ్లా
రేటింగ్ః 3.5/5
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఇంట్రస్టింగ్ సినిమాల్లో `నరసింహపురం` ఒకటి. ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్స్ సినిమాపై క్రేజ్ ని పెంచాయి. ఇక టెలివిజన్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న నందకిషోర్ హీరోగా నటించగా శ్రీరాజ్ బళ్లా దర్శకత్వం వహించడంతో ఆటోమెటిక్ గా అందరి చూపు ఈ సినిమా పై పడింది. ఇక ఈ రోజు విడుదలైన ఈ చిత్రం రివ్యూ ఏంటో తెలుసుకుందాం…
స్టోరిః
నంద ( నందకిషోర్) తన గతమంతా మర్చిపోయి పిచ్చివాడిగా మారతాడు. కానీ నందను మాత్రం సిరి కడుపులో పెట్టుకుని పసిపాడిలా చూసుకుంటుంది. తనకేదైనా అయితే విలవిల్లాడిపోతుంది. అసలు నంద ఎందుకు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? సిరికి నందకు సంబంధం ఏంటి? నంద ఫ్లాష్ బ్యాక్ ఏంటి , నంద ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తన చెల్లెలికి ఏమైంది అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిందీ చిత్రం.
నటీనటుల హావభావాలుః
ఈ చిత్రంలో హీరోగా నటించిన నంద కిషోర్ తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతం మర్చిపోయిన పిచ్చివాడిగా, చెల్లెలను ప్రాణంలాగా ప్రేమిం అన్నయ్యగా, ప్రేమికుడుగా ఇలా పలు షేడ్స్ ఉన్న పాత్రకు ప్రాణం పోశాడు. ఈ సినిమాను తన భుజాలపై మోసాడు. ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండించాడు. విలన్ గా నటించిన ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్ కూడా తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. తన డైలాగ్ డిక్షన్ బావుంది. హీరోయిన్ గా సిరి అందం అభినయం ఆకట్టుకుంది. మిగతా వారంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
దర్శకుడు తీసుకున్న కథాంశం బాగుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ పేలవంగా అనిపించినా నటీనటులు దాన్ని కనపడనీయకుండా చేశారు. ఇక పాటల విషయానికొస్తే ఒక్క పాట మినహా మిగతావి పెద్దగా ఏం లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా బాగానే ఉన్నాయి. దర్శకుడు లోని ప్రతిభకు ఎమోషనల్ సీన్స్ తార్కాణంగా చెప్పాలి. కొత్త దర్శకుడుగా తనకు వంద మార్కులు వేయొచ్చు. కాకుంటే కామెడీ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.
విశ్లేషణః
దర్శకుడు తీసుకున్న కథ, కథనాలు సినిమాకు హైలెట్‌గా చెప్పాలి. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ , హరో హీరోయిన్స్ కు మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అక్కడక్కడా మినహా సినిమా ఓవరాల్ గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. సో ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూసి ఎంజాయ్ చేయవచ్చు. సో డోంట్ మిస్ దిస్ మూవీ.
ఫైనల్ గా చెప్పాలంటే
ఈ సినిమాకు నందకిషోర్-శ్రీరాజ్ బలం