నాని బర్త్‌డే సందర్భంగా ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ఒక టాలెంటెడ్ యాక్టర్, ఇంకో సమర్థుడైన డైరెక్టర్ కలిస్తే, ఒక మాగ్నమ్ ఓపస్ లాంటి సినిమా వస్తుందంటారు. ఇప్పుడు.. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కలయికలో వస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ అలాంటి అద్వితీయ చిత్రంగా రూపొందుతోందనే నమ్మకం అందరిలోనూ కలుగుతోంది. ఒక విలక్షణ కథతో తీస్తున్న ఈ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని గెటప్‌లో నాని కనిపించబోతున్నారు.
సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లాంటి ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ మూవీని వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 24 నాని బర్త్‌డేని పురస్కరించుకొని చిత్ర బృందం ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో ఒక బెంగాలీ యువకుని గెటప్‌లో నాని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఆయన మీసకట్టు, హెయిర్ స్టైల్ విలక్షణంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌లో రాయల్ ప్రెస్, పక్కనే రిక్షా బండిని చూస్తుంటే ఈ మూవీ ఒక పీరియడ్ డ్రామా అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గమనించదగ్గ విషయమేమంటే నానిని వెనక నుంచి ఒక యువతి గట్టిగా కౌగలించుకుంది కానీ, ఆమె ముఖం అసలు కనిపించడం లేదు. ముగ్గురు హీరోయిన్లలో ఎవరు ఆయనను కౌగలించుకున్నారనే విషయాన్ని మన ఊహలకి వదిలేశాడు దర్శకుడు. అయితే ఆ పోస్టర్ ప్రకారం ‘శ్యామ్ సింగ రాయ్’ ఒక విలక్షణ లవ్ స్టోరీ అనే విషయాన్ని ఊహించవచ్చు.
అపూర్వమైన కథతో రూపొందుతోన్న ఈ సినిమాని యాక్టర్లు, టెక్నీషియన్లు ఒక స్పెషల్ ఫిల్మ్‌గా నమ్మి వర్క్ చేస్తున్నారు. షూటింగ్ దశలోనే ఆ విషయం సినిమాకు పనిచేస్తున్న వారందరికీ అర్థమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరో, ముగ్గురు హీరోయిన్లు సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. అక్కడ పలు కీలక సన్నివేశాలను తీస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా ఒరిజినల్ స్టోరీని అందించారు. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరుపొందిన మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సమకూరుస్తుండగా, సాను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
తారాగణం:
నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం.
సాంకేతిక బృందం:
డైరెక్టర్: రాహుల్ సాంకృత్యాన్
ప్రొడ్యూసర్: వెంకట్ ఎస్. బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
ఒరిజినల్ స్టోరీ: సత్యదేవ్ జంగా
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్ఘీస్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
ఎడిటింగ్: నవీన్ నూలి
పీఆర్వో: వంశీ-శేఖర్.
It turns out to be a magnum opus when a very talented actor and capable director work together. In that case, Natural Star Nani and Rahul Sankrityan’s first collaboration Shyam Singha Roy is no less than a magnum opus, given the film is made with a unique concept and it is going to present Nani in a never seen before getup.
Three beautiful heroines Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian are playing female leads and several top-notch technicians working for the film produced by Venkat S Boyanapalli
Wishing Nani on his birthday, the makers of Shyam Singha Roy have dropped first look poster today and the actor gives pleasant surprise with his remarkable makeover as a Bengali guy.
From hairstyle to dressing, Nani aces the look of a Bengali and more importantly his chiseled physic grabs all the attention. A girl hugs Nani affectionately from behind signifying the film is going to narrate a great love story as well.
Shyam Singha Roy is a very special film for all the actors and technicians associated with given the film is made with a distinctive subject. The film’s shooting is currently taking place in Kolkata. The entire lead cast including all the heroines is taking part in the lengthy schedule where crucial scenes of the film are being shot.
Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam play important roles in the film.
The Production No 1 of Niharika Entertainment has original story by Satyadev Janga. Melody songs specialist Mickey J Meyer is on board to compose soundtracks, while Sanu John Varghese cranks the camera. Naveen Nooli is the editor.
Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam
Technical Crew:
Director: Rahul Sankrityan
Producer: Venkat S Boyanapalli
Banner: Niharika Entertainment
Original Story: Satyadev Janga
Music Director: Mickey J Meyer
Cinematography: Sanu John Varghese
Production Designer: Avinash Kolla
Executive Producer: S Venkata Rathnam (Venkat)
Editor: Naveen Nooli
PRO: Vamsi-Shekar