Nani – Sudheer Babu – Indraganti – Dil Raju Movie Opening Matter

Nani – Sudheer Babu – Indraganti – Dil Raju Movie Opening Matter
Nani - Sudheer Babu - Indraganti - Dil Raju Movie Opening Matter
నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రొడక్ష‌న్ నెం.36 చిత్రం `వి` ప్రారంభం
నేచుర‌ల్ స్టార్ నాని, హీరో సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.36 చిత్రం `వి` సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్‌, ల‌క్ష్మ‌న్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రిగాయి. ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు `ఎంసిఎ` డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు క్లాప్ కొట్ట‌గా.. `నేను లోక‌ల్‌` ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన కెమెరా స్విచ్ఛాన్ చేశారు. `ఎఫ్‌2` డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.
న‌టీన‌టులు:
నాని
సుధీర్ బాబు
అదితిరావు హైద‌రి
నివేదా థామ‌స్‌
త‌నికెళ్ళ‌భ‌ర‌ణి
వి.కె.న‌రేష్‌
రోహిణి
వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
మేక‌ప్‌: అర్జున్‌
కాస్ట్యూమ్స్‌: య‌న్‌.మ‌నోజ్‌కుమార్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  రాజేష్‌, అశ్విన్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోట‌ర్‌:  వి.చంద్ర‌మోహ‌న్‌
కో డైరెక్ట‌ర్‌:  కోట సురేష్ కుమార్‌
పాటలు:  సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ర‌వీంద‌ర్‌
స్టంట్స్‌: ర‌వివ‌ర్మ‌
ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేష్‌
డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ:  పి.జి.విందా
సంగీతం: అమిత్ త్రివేది
నిర్మాత‌లు:  శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్, హ‌ర్షిత్ రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి