Nandamuri Kalyanram – Satish Vegesna – Aditya Music New Film Launch

నెంబర్ వన్ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలో తొలిసారి అడుగుపెట్టింది. శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇంటియా ప్రై.లి పతాకంపై డైనమిక్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జాతీయ అవార్డ్ విన్నర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం గురువారం హైదరబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఉమేశ్ గుప్తా నిర్మాత. ఈ కార్యక్రమానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు గోపీసుందర్ క్లాప్ కొట్టగా, జగదీశ్ గుప్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఉమేశ్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు.
“జూలై 24 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. నిరవధికంగా హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ఊటీ లో చిత్రీకరణ చేస్తాం. సతీశ్ వేగేశ్నగారు అద్భుతమైన ఎమోషన్స్‌తో సినిమా కథను సిద్ధం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రాన్ని నిర్మిస్తాం` అని నిర్మాతలు తెలిపారు.
నటీనటులు:
నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్, వి.కె.నరేశ్, సుహాసిని, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెలకిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న
నిర్మాత: ఉమేశ్ గుప్తా
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
సంగీతం: గోపీ సుందర్
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: రామాంజనేయులు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రషీద్ ఖాన్